🌹. నారద భక్తి సూత్రాలు - 74 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. చలాచలభోధ
తృతీయాధ్యాయము - సూత్రము - 43
🌻. 43. దుస్సంగః సర్వధైవ త్యాజ్యః ॥ 🌻
ఏ రకమైన దుస్సాంగత్యమైనా సరే, అన్నీ వదలివెయాలి.
సాధనలో ఉన్న భక్తుడు, కోరికలను నిగ్రహిస్తూ ఉండగా, దుస్పాంగత్యం కలిగితే ఆ కోరికలు రెట్టించి, అవకాశాన్ని వినియోగించు కుంటాయి. సాధకుడు పతనమవుతాదు.
కామ్యక కర్మలను చేస్తాడు. ఇంకా దిగజారితే నిషిద్ల కర్మలను కూడా చేస్తాడు. అక్రమ మార్గాల నవలంబిస్తాడు. వీటివల్ల నిగ్రహ శక్తి కోల్పోతాడు.
అహంకార మమకారాలను అడ్డు తొలగించు కోవలసింది పోయి వాటిని పెంచి గట్టి పరచుకుంటాడు. విరోధ ఉపాయం విఫలమవుతుంది. అనుకూల ఉపాయాలకు విఘ్నమేర్పడుతుంది.
అవకాశం కోసం పొంచి ఉండే అరిషడ్వర్గం, సందు దొరకగానె దాడి చేస్తుంది. విషయ సంగత్వం గాఢంగా కలుగుతుంది.
అంతవరకు చేసిన సాధనంతా మంటగలసి పోతుంది. సాధనలో పురోగమనం ఉండకపోగా తిరోగమనం జరుగుతుంది.
దుస్సాంగత్యం వలన పతనమైనవాడు తిరిగి పుంజుకోవడం అరుదు. పశ్చాత్తాప పడినప్పటికీ నైరాశ్యం ఆవరించి ఖిన్నుడవుతాడు. గురువు పర్యవేక్షణలో సాధన చెస్తే శిష్యుడిని సకాలంలో హెచ్చరిస్తాడా గురువు. తిరిగి సన్మార్గంలో పెడతాడు.
ఒక్కోసారి సన్మార్గంలో ఉన్న శిష్యుని దుష్ట సంస్కారాలను బయటికి లాగి గురువు పరిక్ష పెడతాడు. అప్పుడది ముందు జాగ్రత్త చర్య అవుతుంది.
బలహీనమైన మనసు గల శిష్యుడిని హెచ్చరిస్తూ, రక్షిస్తూ ఉంటాడు. గురు కృప రుచి మరిగిన శిష్యుడైతే, గుర్వాజ్జను పాటిస్తూ, సాధన చేసాడు.
గురువు ప్రత్యక్షంగా లేకపోయినా గురు కృపను గుర్తించలేక పోయినా, శిష్యుడు దుస్సాంగత్యంలో పడిపోయె ప్రమాదమున్నది.
అతనిని ఇక రక్షించేవారే ఉండరు. ఇటువంటి అవాంతరాల విషయాల్లో ముందస్తు జాగ్రత్త అవసరమని ఈ సూత్రం చెప్తున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment