కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 14


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 14 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయో మార్గము - ప్రేయో మార్గములు స్వధర్మము-పరధర్మము - 2 🌻

ప్రేయోమార్గమని మరొక మార్గముంది. అందులో ప్రధానమైన సమస్య ఏమిటంటే సుఖానికి దగ్గరిదారిగా కనబడుతుంది, కానీ శాశ్వతముగా దుఃఖాన్ని అందిస్తుంది. ఇంకేమిటట అందులో దోషం? జననమరణ చక్రంలో పడేట్లుగా చేస్తుంది. కర్మచక్రంలో బంధించబడేట్లుగా చేస్తుంది. కాలచక్రంలో బంధించబడేట్లుగా చేస్తుంది. ద్వంద్వానుభూతులయందు మరిగిపోయేట్లుగా చేస్తుంది. తనని తాను మరచిపోయేటట్లుగా చేస్తుంది. 

స్వయం స్థితిని మరచిపోయేట్లుగా చేస్తుంది. హృదయస్థానాన్ని మరుపుకు తెచ్చేట్లుగా చేస్తుంది. స్వీయజ్ఞానాన్ని, స్వరూపజ్ఞానాన్ని మరుపుకు తెచ్చేట్లుగా చేస్తుంది. ఇన్ని దోషములు వున్నాయి కాబట్టి పరధర్మము ఆచరణకు అనుచితమైనటువంటిది.

   శ్రేయోమార్గంలో ఇవన్నీ వ్యతిరేకం. అంటే నీ హృదయస్థానంలో నువ్వు నిలబడి వుంటావు. నీ స్వరూప జ్ఞానంలో నువ్వు నిలబడి ఉంటావు. 

స్వాత్మానుభూతి యందు నిలకడ కలిగి వుంటావు. స్వాత్మనిష్ఠుడవై వుంటావు. సర్వవ్యాపక లక్షణాన్ని కలిగివుంటావు. పరిమితమైనటువంటి అజ్ఞానము , అవిద్యకు దూరంగా వుంటావు. జననమరణ చక్రాలలో నుంచి బయటపడతావు. కర్మచక్రానికి అంటకుండా వుంటావు. ద్వంద్వానుభూతులకి విలక్షణుడవై వుంటావు. 

కాబట్టి శ్రేయోమార్గము ఉత్తమమైనటువంటిది. కాబట్టి అట్టి శ్రేయోమార్గమునే మానవులందరూ కూడా ఆశ్రయించాలి. అదే మానవుని యొక్క స్వధర్మము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment