శ్రీరమణీయం -(114)

శ్రీరమణీయం -(114)


"దేహంపై మనస్సుకు మమకారం లేకుండా ఎలా ఉంటుంది ?"


అశాశ్వతమైన దేహంపైనా మన మమకారం ? తనదే అయిన ఆత్మను వదిలి, తనది కాని దేహంకోసం ప్రాకులాడే మనసు, 'అయినవాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో 'వడ్డిస్తుంది. అహంకారంతో ఈ దేహానికి, కుటుంబానికి, సమాజానికి ఎంత సేవ చేసినా తృప్తి, సంపూర్ణత ఉండవు. అదే తన వెనుకవున్న దైవాన్ని తెలుసుకున్న మనసు తాను నిమిత్తమాత్రమేనని గ్రహించి అహంకార రహితస్థితిలో చేసే సేవ నిజమైన సేవ అవుతుంది. ఆ సేవకు సంపూర్ణత, సార్థకత ఉంటుంది. మనం ఎంతో మమకారంతో పెంచుకున్న ఈ దేహం మరొకరు వదిలేస్తేనే మన వాడుకుంటున్నామని తెలిస్తే గాని దానిపై వ్యామోహం తగ్గదు. ఏ ప్రాణికైనా మరణాంతరం దేహం పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే. తిరిగి మరో కొత్త దేహం ఏర్పడేది కూడా అదే పంచభూతాల నుండే ! అంటే అప్పటికే ఎవరో వాడేసిన దేహం తాలూకా పంచభూతాలతోనే మనం శరీరాన్ని ధరిస్తున్నామనే కదా ! తిరిగి కొంతకాలానికి ఈ దేహానికి మరణం తప్పదు కదా !! అలాంటి దేహంపైనా మన మమకారం !!!

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_'దైవానికి, దేహానికి మనసే వారధి !'-

No comments:

Post a Comment