🌹 *అష్టావక్ర మహర్షి - వారి విశిష్టత* 🌹

🌹 *అష్టావక్ర మహర్షి - వారి విశిష్టత* 🌹

            ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్నారాయణుని ఆశ్రయించి, “ఈ అనంత సృష్టి నాచేతనే సృజించబడినది కాబట్టి ఈ సృష్టిలో మొదటివాడను నేనే. ఆద్యంతములు లేక సృష్టంతా వ్యాపించి వున్నవాడను నేనే. కాబట్టి నాకన్న గొప్పవాడు ఈ సృష్టియందు మరొకడు లేడు” అని శ్రీమన్నారాయణునితో సంభాషిస్తే, శ్రీమన్నారాయణుడు సరే అలాగే, ఒకసారి అలా వెళ్ళి పరిశీలించి వద్దాము రండి నడిచి వెళ్ళొద్దాం అన్నాడు.  అని కొంత దూరం తీసుకుని వెళ్ళగా, ఒక చోట ఒక మహానుభావుడు తపస్సు చేస్తున్నాడు.

ఆయన రోమశ మహర్షి. ఆ రోమశ మహర్షి పక్కన గుట్టగా రోమాలు పడి వున్నాయి. ఆయన ఎంత ఎత్తు వున్నాడో, ఆయన పక్కగా పడి వున్నటువంటి రోమాలు కూడా అంత ఎత్తు గుట్ట వున్నది.

ఈ మహానుభావుడు ఎవరూ అని వారు అడుగుతారు. వారినే మనం అడుగుదాం అని వారి దగ్గరకి వెళ్తే, వారు వారిని పరిచయం చేసుకుంటారు. అయ్యా! నేను రోమశ మహర్షిని.

అప్పుడు ఈ బ్రహ్మగారికి ఒక సందేహం కలిగింది. అయ్యా! మీ ప్రక్కనే ఈ రోమాల గుట్ట ఏమిటి అని?

నాలుగు మహాయుగాలు అంటే కృతయుగము, త్రేతాయుగయు, ద్వాపరయుగము, కలియుగము ఇవి నాలుగు కలిపితే ఒక మహాయుగము. ఇటువంటి మహాయుగాలు అన్నీ కలిపి బ్రహ్మకు ఒక పగలు, మళ్ళా ఇంకో మహాయుగం కలిపి ఒక రాత్రి. అలాంటి వంద సంవత్సరాలు అయితే బ్రహ్మగారికి ఆయుర్దాయం నిండుతుంది. అంటే ఒక బ్రహ్మ గారు వెళ్ళి పోయి మరొక బ్రహ్మగారు వస్తారు. ఒక్కొక్క బ్రహ్మగారు వెళ్ళిపోయినప్పుడల్లా ఒక రోమం వూడి పడిపోతుంది ఆయనకి.

ఇప్పుడు ఆ పక్కనున్న రోమాలన్నీ ఏమిటీ అని అంటే, అంతమంది బ్రహ్మలు వెళ్ళి పోయారు. అని రోమశ మహర్షిగారు చెప్పారు. అప్పుడు ఈ బ్రహ్మగారికి ఏమనిపించింది? ఓహో! సరే, ఇంకా వెళదాం పదండీ అన్నారు. ఇక తెలుసుకోవడం అయిపోయింది, నేనే గొప్పవాడినికాదనే సంగతి నాకు అర్థమైపోయింది. నేను గొప్పవాడిని కాదని, నాలాంటి వాళ్ళు ఎన్ని వేలు, లక్షల మంది వెళ్లిపోయారో ఆ రోమశ మహర్షి రోమాలు చూస్తేనే తెలిసిపోతుంది.

సరేలేండి, ఇప్పుడు ఏమైంది? కొంచెం దూరం వెళ్ళి చూద్దాం అని ముందుకు వెళ్తారు. అక్కడ మరొక మునీంద్రులు, వారు వారి దగ్గరకి వెళ్తే అయ్యా! నమస్కారం.

నేను అష్టావక్ర మునీంద్రుడను. మరి మీరేమిటి, మీరు ఎంతకాలం నుంచి తపస్సు చేస్తున్నారు? నాకంటే ముందు రోమశ మహర్షిగారు వున్నారు. వారి ఒంటి మీద వున్న రోమాలు అన్నీ పడిపోతే, రోమశ మహర్షిగారు వుండరు. వారు చాలిస్తారు. అటువంటి రోమశమహర్షిగారు ఒక్క రోమశ మహర్షి పోతే నాకు వున్నటువంటి 8 వంకర్లలో ఒక వంకర పోతుంది. ఇప్పటికి ఇంకా ఒక వంకర కూడా పోలేదు. అన్నారు. వీళ్ళందరూ చిరంజీవులన్నమాట.

ఆ మాట చెప్పడం కోసం. అంటే సృష్టి వున్నంతకాలం, విశ్వ సృష్టి వున్నంతకాలం వీళ్ళందరూ వుండే వాళ్ళే. అందుకే ధృవమండలం ఎప్పటికీ పడిపోదు. మన పెద్దవాళ్ళు అందుకే ఇదంతా చెప్పకుండా, ఇదంతా అర్థం కాదని, ఏం చెప్పారు? 

సప్త ఋషులు అనేవాళ్ళు ఎప్పటికీ వుంటారు. ధృవమండలం ఎప్పటికీ పడిపోదు. ఇలాగ పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం అది. ఇలాగ మహానుభావులు అనంత సృష్టికి, దైవీ ప్రణాళికకు ఆధారంగా వుంటారు.

మైత్రేయుడు ఇలా చాలా మంది వున్నారు. వీళ్ళందరూ కూడా నిరంతరాయంగా ఆ దైవీ ప్రణాళికలో ఎప్పుడూ వుంటారు. వాళ్ళు ఆ దైవీ ప్రణాళికను నిర్వహిస్తూ వుంటారు.

వీళ్ళు ప్రత్యేకంగా చేసేది ఏమైనా వుందా ఇప్పుడు? ఎందుకని? సంకల్పమే అనంత సృష్టికి ఆధారం. కాబట్టి అటువంటి మహానుభావుడు చెప్పినటువంటిది ఈ గీత.

ఇదంతా ఎందుకు చెప్పుకున్నాము అనంటే, అష్టావక్ర మహర్షి అంటే చాలా మంది 8 వంకరలు అనే వరకే తెలుసు అందరికి. ఎందుకంటే పేరు లోనే వుంది కాబట్టి. ఆయన తపః శక్తిగానీ, ఆయన యొక్క ధీ శక్తి గానీ, ఆయన ఉద్ధరించగలిగేటటువంటి శక్తి ఎంతటిది అని తెలియాలంటే, ఇప్పుడు ఆయన ఎంతకాలం నుంచి వున్నారు? ఆయన జనకరాజర్షికి బోధించారు ఈ అష్టావక్రగీత.

🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹
🙏 సేకరణ : 🌴 ప్రసాద్ 🌴

No comments:

Post a Comment