వివేక చూడామణి - 166 / Viveka Chudamani - 166



🌹. వివేక చూడామణి - 166 / Viveka Chudamani - 166 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -13 🍀

542. ఒక పర్యాయము తెలివి తక్కువ వానిగా, ఇంకొక పర్యాయము యోగి వలె, కొన్ని సార్లు రాజువలె ఉజ్వలముగా, కొన్ని సార్లు సంచారము చేయుచు, కొన్ని సార్లు కొండ శిలువవలె కదలక పడివుండి ఆహారము లభించినపుడే తింటూ స్థబ్దముగా పడివుండుట, కొన్ని సార్లు దయా సాగరునిగా కనిపిస్తూ, కొన్ని సార్లు గౌరవించబడుతూ, మరికొన్ని సార్లు అవమానించబడుతూ, ఇంకొన్ని సార్లు ఎవరికి తెలియనివాడిగా ఇలా ఆత్మ జ్ఞాని అయిన వ్యక్తి జీవిస్తూ ఎల్లపుడు బ్రహ్మానంద స్థితిలో స్థితుడై ఉంటాడు.

543. బ్రహ్మజ్ఞాని తనకు సంపదలు లేనప్పటికి ఎపుడూ తృప్తితో జీవిస్తుంటాడు. నిస్సహాయుడైనప్పటికి శక్తి వంతునిగా బాహ్య వస్తు సముదాయమును అనుభవించుచూ, శాశ్వతముగా తృప్తితో అతడు ఇతరులకు ఆదర్శ ప్రాయుడు కాకపోయినను అందరిని సమానముగా సమ దృష్టితో చూస్తుంటాడు.

544. అతడు ఎపుడూ ఏదో ఒకటి చేస్తుంటాడు. అయినా ఏమి చేయని వాడిలా ఉంటాడు. గత జన్మల ఫలితాలు అనుభవిస్తున్నప్పటికి, వాటికి అతీతముగా, తనకు శరీరము ఉన్నప్పటికి దానికి ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వకుండా; తాను పరిమితుడైనప్పటికి అన్నింటిలో తానే అయి ఉంటాడు. ఆత్మ దర్శకుని వలె జీవిస్తుంటాడు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 VIVEKA CHUDAMANI - 166 🌹

✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda
📚 Prasad Bharadwaj

🌻 32. I am the one who knows Brahman -13🌻

542. Sometimes a fool, sometimes a sage, sometimes possessed of regal splendour; sometimes wandering, sometimes behaving like a motionless python, sometimes wearing a benignant expression; sometimes honoured, sometimes insulted, sometimes unknown – thus lives the man of realisation, ever happy with Supreme Bliss.

543. Though without riches, yet ever content; though helpless, yet very powerful, though not enjoying the sense-objects, yet eternally satisfied; though without an exemplar, yet looking upon all with an eye of equality.

544. Though doing, yet inactive; though experiencing fruits of past actions, yet untouched by them; though possessed of a body, yet without identification with it; though limited, yet omnipresent is he.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


13 Dec 2021

No comments:

Post a Comment