శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 356-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 356-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 356-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 356-2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀
🌻 356-2. 'సదాచార ప్రవర్తికా' 🌻
యజ్ఞము దానము సహజ లక్షణము లైనవారికి మాత్రమే తపస్సు ఫలించును. తపస్సు ఆధారముగ దైవమే తానని, దేవుడే జీవుడుగ నున్నాడని తెలియును. ఇట్టి యజ్ఞ, దాన, తపస్సుల యందు జీవులను క్రమముగ ప్రవర్తింప జేయునది శ్రీమాత. ప్రతి జీవుని కథ యందు స్వార్థ చింతనచే చిక్కుల యందు పడుట, ఆర్తుడు, అర్థార్థుడు అయి గతి లేక దైవమును ప్రార్థించుట, దైవప్రార్థనమున కొంత చిక్కులు సడలగ దైవమునందు ఆసక్తి కలుగుట, అట్టి ఆసక్తి కారణముగ దైవముచే అనుగ్రహింపబడుటకు సదాచారముల నవలంబించుట జరుగుచున్నది.
ఇట్లు జీవులందరిని సదాచారమునకు శ్రీమాతయే మళ్ళించు చున్నది. దుర్బలుర నందరిని సదాచార మార్గమున బలవంతులను చేయుట శ్రీమాతయే జరుపు చున్నది. దుష్టులను సంహరించుచు దుర్బలురను తీర్చిదిద్దుచు సృష్టి చక్రమును నిర్వర్తించునది శ్రీమాతయే. సదాచారమున ప్రవర్తింప చేయుట శ్రీమాత ముఖ్య కార్యములలో నొకటి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 356-2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani
Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻
🌻 356-2. Sadācāra-pravartikā सदाचार-प्रवर्तिका 🌻
She removes the innate ignorance of the soul to realize the Brahman. In this nāma, She is said to induce the ignorant men to perform noble acts. Sat refers those who perform noble deeds and ācāra means the righteous acts performed by them. She makes the ignorant people (ignorant means lack of knowledge of the Brahman.
It could also mean the concept of duality) to pursue the righteous path to realize the Brahman. The principles of righteousness are expounded in epics. These principles form the basis of dharma śāstra (refer previous nāma).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
17 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment