🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 115 / DAILY WISDOM - 115 🌹
🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 24. సంపూర్ణ స్థితికి తిరిగి వచ్చే మార్గం 🌻
చైతన్యం యొక్క శాశ్వతత్వం దేశ కాల పరిస్థితుల్లో స్వీయ-సంరక్షణ మరియు స్వీయ-పునరుత్పత్తిగా వ్యక్తమవుతుంది. అవరోహణ అనేది మూడు పరిధుల్లో జరుగుతుంది. అవి మానసిక స్వీయ-ధృవీకరణ, భౌతిక స్వీయ-ధృవీకరణ మరియు శాశ్వతత కోసం తపన. ఈ మూడు ప్రవృత్తులు ఏకకాలంలో పనిచేస్తాయి. కానీ అనుకూలమైన పరిస్థితులలో ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే నిర్దిష్ట దశ వ్యక్తపరచబడుతుంది. తద్వారా మానసిక, భౌతిక ధృవీకరణ మరియు లైంగిక కోరిక వ్యక్తీకరణ అన్ని వాటి వాటి అనుకూల సమయాల్లో వ్యక్తీకరించబడతాయి.
ఇక్కడ సానుకూల పరిస్థితులు అనే విషయం గుర్తుంచుకోవాలి. మట్టిలోనికి విసిరిన విత్తనం మొలకెత్తడానికి అనుకూలమైన పరిస్థితులు కాలక్రమేణా వ్యక్తీకరించ బడినప్పుడు మాత్రమే అది మొలకెత్తుతుంది. ఇక్కడ చెప్పబడిన ఈ కీలకమైన అంశాన్ని ప్రత్యేకించి తమ జీవితాలను సంపూర్ణంగా ఆరోహణ మార్గంలో నడపడానికి అంకితం చేసిన వారు తప్పక గమనించాలి. ఈ విషయంపై కొంచెం అవగాహన అవసరం.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 115 🌹
🍀 📖 The Ascent of the Spirit 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 24. The Path of Return to the Absolute 🌻
Self-preservation and self-reproduction are the spatio-temporal forms taken by the absolute character of the eternity of Consciousness. The ‘fall’ is a single act with the threefold downward pressure of psychic self-affirmation, physical self-affirmation and the urge for self-perpetuation. The threefold instinct acts simultaneously, only manifesting a particular phase at a particular time attended with favourable circumstances, so that the psychophysical affirmation and the sex urge, though they are present in the individual at all times hiddenly or expressedly.
Assume special emphasis under given conditions alone, even as a seed thrown into the soil germinates only when the conditions suited to its sprouting manifest themselves in the course of time. Here is a crucial point which has to be taken notice of particularly by those who have dedicated their lives to tread the ‘path of return’ to the Absolute, on which subject a little dilation of understanding is called for.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment