శ్రీ మదగ్ని మహాపురాణము - 250 / Agni Maha Purana - 250


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 250 / Agni Maha Purana - 250 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 74

🌻. శివ పూజా విధి వర్ణనము - 6 🌻


అమృత (ధేను) ముద్ర ప్రదర్శించి, తన ఆసనముపై పుష్ప ముంచి, లలాటముపై తిలకము ధరించి, మూల మంత్రముతో దేవతకు పుష్పము అర్పించవలెను. సాధకుడు - స్నాన - దేవతాపూజా - హోమ - భోజన - యజ్ఞా - నుష్ఠాన - యోగ సాధన - ఆవశ్యక జపసమయములందు, స్థిరబుద్ధి యై మౌనముగా ఉండవలెను, నాదపర్యంతము ప్రణవోచ్చారణముచేయుచు మంత్రశోధనము చేయవలెను. ఉత్తమసంస్కారముక్తుడై దేవపూజా ప్రారంభము చేయవలెను.

మూలగాయత్రి చేత గాని, రుద్ర గాయత్రిచేత గాని అర్ఘ్యపూజనము చేసి ఆ సామాన్యార్ఘ్యమును దేవతకు సమర్పింపవలెను. బ్రహ్మపంచకము (పంచగవ్యములు, కుశోదకముతో చేసిన బ్రహ్మకూర్చము) సిద్ధముచేసికొని, శివలింగమునుండి పుష్పనిర్మాల్యమును తీసివేసి, ఈశాన్యము నందు ''చండాయ నమః'' అని చెప్పుచు చుండునకు సమర్పించవలెను. బ్రహ్మపంచకముతో పిండికా శివలింగములకు స్నానము చేయించి, 'ఫట్‌' అని ఉచ్చరించుచు, మరల ఉదకముతో స్నానము చేయించవలెను. ''నమో నమః'' అని ఉచ్చరించుచు అర్ఘ్యపాత్రగతజలముతో ఆ శివలింగమునకు అభిషేకము చేయవలెను. ఇది లింగశోధన విధానము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 250 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 74

🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 6 🌻


38-39. After having shown the amṛtā mudrā (formation with fingers denoting non-decay) and putting flower on its seat and a mark on the forehead consecrated by the principal mantra (of the god) a bold man should remain perfectly silent at the time of bathing, worship of the god, (offering) oblation unto fire, eating, practising yoga and repetition of necessary (mantras).

40. The mantra should be purified by pronouncing the nāda (oṃ) at the end. That purified mantra should then be used in the worship along with the gāyatrī (mantra) and the general water of oblation should be offered.

41. After having repeated the brahmapañcaka[2], (the worshipper) should collect the garland from the liṅga and offer it to Caṇḍa in the north-eastern direction.

42. The purification of the liṅga consists in the washing of the pedestal and the liṅga with the water (consecrated) by the mantra of weapon and hṛdmantra and sprinkle with the water (for washing) from the vessel of arghya.

43. All the celestials should be worshipped for the purification of the self, the materials, the mantra and the liṅga. Hāṃ, Salutations to God Gaṇapati in the north-western direction. One should pay obeisance to the preceptor in the north-east.

44-45. One should worship the goddess of the seat (of the god) in the kūmaśilā (the tortoise form on the stone) as possessing complexion of the tender shoots and the seat of Śiva known as ananta (endless) should be worshipped as seated on the brahmaśilā along with the attendants of the god such as Vicitra-keśa, Kṛta and Tretā who form the seat and shoes as they were of divinity.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment