నిర్మల ధ్యానాలు - ఓషో - 164


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 164 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. జీవితానికి సరిహద్దులు లేవు. జీవితం ఆద్యంతాలు లేనిది. కానీ మనం మరీ ఎక్కువగా శరీరానికి, మనసుకు అతుక్కుపోయి వుంటాం. అది మన యధార్థం కాదన్న విషయాన్ని మనం పూర్తిగా మరిచిపోయాం. మనం రూపరహితులమని గుర్తించినపుడు మనం దేవుడిలో భాగాలవుతాం. దేవుడు మనలో భాగమవుతాడు. 🍀


జీవితం దాని యథార్థాన్ని బట్టి సరిహద్దులు లేనిది. అది శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది కాదు. అది సముద్ర సంబంధమయినది. సముద్రాల కయినా సరిహద్దులుంటాయి. కానీ జీవితానికి సరిహద్దులు లేవు. జీవితం ఆద్యంతాలు లేనిది. కానీ మనం మరీ ఎక్కువగా శరీరానికి, మనసుకు అతుక్కుపోయి వుంటాం. అది మన యధార్థం కాదన్న విషయాన్ని మనం పూర్తిగా మరిచిపోయాం.

మనం ఎన్నో శరీరాల్లో జీవించాం. నువ్వు ప్రయాణికుడివి, తీర్థయాత్రికుడివి. జీవితం, చైతన్యం ఒక శరీరం నించీ యింకో శరీరానికి సాగుతుంది. మనం రూపరహితులమని గుర్తించినపుడు ఆ రోజు మనకు గొప్పరోజు అది పరివర్తన చెందిన రోజు. అపుడు మనం వెనకటిలా వుండం. అప్పుడు మనం దేవుడిలో భాగాలవుతాం. దేవుడు మనలో భాగమవుతాడు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


13 Apr 2022

No comments:

Post a Comment