గీతోపనిషత్తు -280
🌹. గీతోపనిషత్తు -280 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 13-4
🍀 13-4. ఈశ్వర తత్వము - సత్య దర్శనమునకు సత్వగుణము నాశ్రయించుట తప్పనిసరి. అట్టి ఆశ్రయము వలన జీవుని కోశముల యందలి మలినములు తొలగును. మలినమే అజ్ఞానము. అది తొలగినపుడు జ్ఞాన మావిష్కరింప బడును. అట్టి జ్ఞానము నామరూపాతీతమగు వెలుగును దర్శింప జేయును. ఇట్లు దర్శించిన మహాత్ములకు సర్వము ఈశ్వరమయముగనే గోచరించును. ఈశ్వరుని భూత మహేశ్వరత్వము కూడ తెలియబడును. ఈశ్వరుడు సర్వవ్యాపి, సర్వమునకు మూలము అని తెలియ బడును. అట్టి ఈశ్వర తత్త్వము నందు సర్వ జీవులును తేలుచు యున్నారని దర్శనమగును. ఇట్టి దర్శనము నిత్యము అనుభవించు చున్నవారే మహాత్ములు. 🍀
మహాత్మానసు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః |
భజం త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాది మవ్యయమ్ || 13
తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించి మహాత్ములు సమస్త ప్రాణికోటికి ఆదికారణునిగను, నాశ రహితునిగను నన్నెరిగి ఇతర చింతన లేక నన్నే సేవించు చున్నారు.
వివరణము : కనుక ఈ శ్లోకమున సత్యదర్శనమునకు సత్వగుణము నాశ్రయించుట తప్పనిసరి అని తెలుపబడినది. అట్టి ఆశ్రయము వలన జీవుని కోశముల యందలి మలినములు తొలగును. మలినమే అజ్ఞానము. అది తొలగినపుడు జ్ఞాన మావిష్కరింపబడును. అట్టి జ్ఞానము నామరూపాతీతమగు వెలుగును దర్శింపజేయును. ఇట్లు దర్శించిన మహాత్ములకు సర్వము ఈశ్వరమయముగనే గోచరించును. ఈశ్వరుని భూత మహేశ్వరత్వము కూడ తెలియబడును. ఈశ్వరుడు సర్వవ్యాపి, సర్వమునకు మూలము అని తెలియ బడును.
అట్టి ఈశ్వర తత్త్వము నందు సర్వ జీవులును తేలుచు యున్నారని దర్శనమగును. ఇట్టి దర్శనము నిత్యము అనుభవించు చున్నవారే మహాత్ములు. వారికీశ్వరుడు కాని దేమియు లేదు. అట్టి ఈశ్వరుడు శాశ్వతుడని కూడ తెలుయును. ఇట్లు దర్శనము చేయుచున్న మహాత్ములు లోకమున పూజ్యులు. ఆశామోహములకు లోబడినవారు లోకమున బద్ధులు. మహాత్ములు తన దైవీ ప్రకృతి నాశ్రయించి యుండుటచే తనను ఎప్పుడును తెలిసియే యుందురు. అట్లు తెలిసి నన్ను సేవించుచు నుందురు. వారికి తరము లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
23 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment