శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 321 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 321-2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 321 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 321-2 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀

🌻 321-2. 'కామ్యా' 🌻

కోరబడిన విషయమును పొందుటకు తదనుగుణమైన జ్ఞానమును పొందును. అట్టి జ్ఞానమును క్రియా రూపమున నిర్వర్తించుచూ ఒక్కొక్క కోరికను పూరించుకొను చుండును. ఇట్లు అన్నపానీయాదులతో మొదలిడి జీవుడు దేహపోషణమును పొందుట, ఇంద్రియార్థముల ద్వారా ఇంద్రియ పరిపూర్తి గావించు కొనుట, మనోభావముల ననుసరించి భావ పరితృప్తి గావించుకొనుట, అట్లే బుద్ధి లోకములను లేక వెలుగు లోక విషయములను తెలియ గోరుట; అటుపైన యోగము, ధ్యానము, జ్ఞానము అనుచు తనను, దైవమును తెలియకోరుట క్రమముగ జరుగును.

తన నిజస్థితి తనకి తెలిసినపుడు తాను పరిపూర్ణు డగును. నిజస్థితి తెలియుటగ అనగా తాను ఉండుట అనగా ఏమో తెలియుట. అట్లు తెలిసినవానికి ఇక వుండుటయే వుండును. అదియే సమాధి. అదియే పరమాత్మ స్థితి. ఇంత కార్యక్రమము నడిపించి జీవులను పరిపూర్ణము చేయుటకు శ్రీమాత సృష్టియందు కోరబడు రూపముగ నుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 321-2 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻

🌻 321-1. Kāmyā काम्या (321)🌻

Kāmyā means longing for. She is desired by the seekers of liberation. Liberation is possible only through knowledge and She is that knowledge (nāma 980). The 12th night of dark lunar fortnight is known as kāmyā.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


20 Nov 2021

No comments:

Post a Comment