మైత్రేయ మహర్షి బోధనలు - 30


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 30 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 19. నిజమైన విశ్రాంతి-2 🌻

విశ్రాంతి కోరుట తమోగుణ లక్షణము, అది స్తబ్దతను పెంచును. నదీ ప్రవాహము ఎక్కువగ ఉన్నను, అసలు లేకున్నను హాయిని గొలుపదు, అటులనే మానవ జీవనము కూడ. మహానగరము నందునను, మహారణ్యము నందునను ఒకే రకమైన వేగము నందుండుట అభ్యసింపుము. నిశ్చల వేగము సమతుల్యము నకు దారిచూపును. సమతుల్యమే యోగస్థితి, విశ్రాంత స్థితి. ఈ స్థితి యందున్నవాడు సహజయోగి.

అతని మనస్సున అతివేగముగాని, అతినిదానము గాని యుండదు. సన్నివేశములు అతనికి వేగమును గాని, నిదానమును గాని కలిగింపపు. అతని సాన్నిధ్యమున సమస్తము సమవేగము నందుండును. అనగా అతివేగవంతులు కొంత వేగమును కోల్పోవుదురు. అతి నిదానస్తులు కొంతవేగమును పొందుదురు. యోగులు సమస్తమును సమవేగమున నుంచుదురు. సమవేగులకు శక్తి ధారాపాతముగ అందుచు నుండును. వారి యందు శక్తి దుర్వినియోగము కాదు. విశ్రాంతి యనుపదము ఒక ఆరాటముగ గాక, ఆచరణ యందు అవతరించి యుండును. అవిశ్రాంతముగ, సమ వేగమున కృషిచేయువారే నిజమైన విశ్రాంతి ననుభవించుచున్నారు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


20 Nov 2021

No comments:

Post a Comment