నిర్మల ధ్యానాలు - ఓషో - 97
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 97 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ఈ జీవితమన్నది వ్యర్థం చెయ్యడానికి కాదు. అభివృద్ధి చెందడానికి వున్న అవకాశం. వ్యక్తి తన లోపలికి వెళ్ళాలి. ఏ క్షణం నీ కేంద్రం నీ ప్రశ్నలన్నిటికీ సమాధానమిస్తుందో నీ సంక్లిష్టతలన్నీ అదృశ్యమయి పోతాయి. అయోమయ ముండదు. ప్రతిదీ స్పష్టమవుతుంది. 🍀
హృదయపు లోలోతుల్లో జీవితమన్నది ఎంతో విలువయిన అపూర్వ బహుమతిగా భావించాలి. జీవితంలో ప్రతిక్షణమూ విలువైందే. కాబట్టి ఈ జీవితమన్నది వ్యర్థం చెయ్యడానికి కాదు. అభివృద్ధి చెందడానికి వున్న అవకాశం. ప్రతి మనిషి విలువైన దాన్ని, ముఖ్యమైన దాన్ని చెయ్యాలి. వ్యక్తి ముందుకు చూడాలి. వ్యక్తి బాహ్యమయిన విషయాల గురించి మాత్రమే ప్రకటించు కోకూడదు. జనాలు చేస్తున్నదదే. వ్యక్తి తన లోపలికి వెళ్ళాలి. పరిశీలించాలి. లోపలి లోపలికి వెళ్ళు కేంద్రాన్ని చేరాలి.
ఏ క్షణం నీ కేంద్రం నీ ప్రశ్నలన్నిటికీ సమాధానమిస్తుందో నీ సంక్లిష్టతలన్నీ అదృశ్యమయి పోతాయి. అయోమయ ముండదు. ప్రతిదీ స్పష్టమవుతుంది. స్వచ్ఛ స్పటికంగా వుంటుంది. అన్నీ ఆ స్పష్టత నించీ చూడొచ్చు. ఆ క్షణం వ్యక్తి విశ్వం తనకు ఎంత యిచ్చిందో తెలుసు కుంటాడు. అంతే కాదు. మనం ఎంతగా విశ్వం పట్ల కృతజ్ఞత లేకుండా వున్నామో కూడా తెలిసి వస్తుంది. మత పూర్వకమయిన జీవితానికి కృతజ్ఞత అన్నది ప్రాధమిక అవసరం. కృతజ్ఞత నించీ ప్రార్థన పుడుతుంది. ప్రేమ పుడుతుంది. దయ పుడుతుంది. విలువ తెలిసిన వ్యక్తి కృతజ్ఞత ప్రకటించాలి. జీవితం విలువ తెలిసిన, అస్తిత్వపు అనంత విలువ తెలిసిన వ్యక్తి కృతజ్ఞత ప్రకటించాలి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
20 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment