దేవాపి మహర్షి బోధనలు - 40


🌹. దేవాపి మహర్షి బోధనలు - 40 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 28. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 2 🌻


ఎవరికిని తెలుపుటకు సాహసించలేదు. తెలిపినచో తప్పక నాకు పిచ్చి పట్టినదని భావింతురను దృఢ విశ్వాసము కారణముగనే ఊరకుంటిని. ఈ ప్రపంచమున కంతటికీ మహత్తరమగు సేవల నందించు దానిగను, వేలాది ప్రజల నుద్ధరించు ప్రవక్తగను, అప్పుడప్పుడు భావించుచుండెడిదానను.

ఇది ప్రాథమిక దశయందు సామాన్యముగా అందరూ చేయు పొరపాటు. చేయబోవు కార్యమునకు వలసినది త్రికరణశుద్ధి, తపస్సు అని తెలియుటకు సమయము పట్టినది. ఆ పుణ్యపురుషుడు ఎవరో నాకు తెలియదు.

అతడు మాత్రము నా హృదయమున శాశ్వతముగ తిష్ఠ వేసినాడు. నన్ను నేను నియంత్రించు కొనుటకు అతని స్పర్శ - అందుండి కలిగిన స్ఫూర్తి చాలునని తృప్తి చెందితిని. జీవితమున మొట్టమొదటిసారిగ నా మనస్సు తృప్తిని, అనుభూతి చెందినది.

ఇరువది సంవత్సరముల తరువాత 10వ సం||లో మొట్ట మొదటిసారిగ ఆ మహాపురుషుడెవరో నాకు తెలిసినది. అంతవరకూ అతడు ప్రతి 7 సం||లకు నాకు దర్శన మిచ్చుచున్ననూ, అతడెవరో నాకు తెలియదు.

1915వ సం||న అతడొక మహాత్ముడని, దివ్యజ్ఞాన సంపన్నుడని, భూమి జీవులను తరింపజేయుటకు పరిశ్రమించుచున్న దీక్షాదక్షుడని, అతడితరులకు కూడా తెలియునని, తెలిసినది. అతని నామధేయము 'దేవా!' యని, ప్రేమ-జ్ఞానములను పంచు పరమ గురువని తెలిసినది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


23 Feb 2021

No comments:

Post a Comment