🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. గౌరముఖ మహర్షి - 4 🌻
15. “వ్యతీపాతము, ఆయనము, విషువత్తు, చంద్రసూర్యగ్రహణములు, సంక్రమణము, పుణ్యకాలాలు, నక్షత్రగ్రహపీడాసమయాలు, చెడ్డకలలు వచ్చినప్పుడు, విశిష్టద్రవ్య పాత్రాలాభాలు కలిగినప్పుడు, గంగాది మహాతీర్థాలకు వెళ్ళినప్పుడు యధాశక్తిగా శ్రాద్ధకర్మలు చేయాలి” అని చెప్పాడు.
16. ధనం లేని వాళ్ళు తిలతర్పణము లిచ్చినా శ్రాద్ధకర్మఫలం లభిస్తుందని చెప్పాడు. అదికూడా సాధ్యంకాకపోతే ఒక గోవుదగ్గరికివెళ్ళి దాని ముందర ఇంత గడ్డిపెట్టి నమస్కరించినా క్షేమకరమే! అది కూడా చేయలేనివాడు అడవికి వెళ్ళి చేతులు పైకెత్తి సూర్యుణ్ణి చూచి బిగ్గరగా ఇలా చెప్పాలి:
17. “ఓ పితృదేవతలారా! నన్ను మన్నించి నా నమస్కారం స్వీకరించండి”. అలా అంటే, పితృదేవతలు తృప్తి పడతారు అని స్మృతులలో ఉంది.
18. పితృకర్మలకు ఎవరు అర్హులు అంటే – యోగి, యతి, శిష్యుడు, సోమయాజి, ఋత్విజుడు, సోదరికొడుకు, అల్లుడు, మేనమామ మున్నగువారు పైతృకర్మలు చేయటానికి అర్హులు. అటువంటి బాకీలన్నీ వీళ్ళు తీర్చాలి. కొడుకులు ఎలాగూ చేయాలి.
19. యతి తన గురువుకు చెయ్యవచ్చు, తప్పుకాదు. ఆశ్రమాలలో గురువుగారి తిథి శిష్యులు జరుపుకోవచ్చు. శ్రాద్ధం అంటే ఈ ప్రకారంగా కొన్ని తర్పణాలు ఇస్తారు. తండ్రికి కొడుకు చేసినట్లుగానే, యతికి మరెవరూ చేసేవాళ్ళు లేకపోతే – యాగం చేసే సోమయాజి ఎవరైనా చేయవచ్చు.
20. కొడుకులు లేని వాళ్ళు కూడా అలా తమకు చేయించుకోవచ్చు. నపుంసకుడు, దొంగ, నిందితుడు, రోగి, బ్రాహ్మణులు (యాచన చేసే వాళ్ళు) అనర్హులని, ఈ కర్మలు చేయకూడదని నిషేధించారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
05 Mar 2021
No comments:
Post a Comment