✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 33. మహర్షి దేవాపి సాన్నిధ్యము -2 🌻
పై మొత్తము సన్నివేశము అటుపైన ఒక కలగా గోచరించినది. అది కలగాని కల. ఆ సన్నివేశమునకు ప్రాముఖ్యనాయక నా దైనందిన జీవితమున నిమగ్నమైతిని. మూడు వారములు యాంత్రికముగ గడచిపోయినవి.
ఒకరోజు రాత్రి పిల్లలను నిద్రపుచ్చి ముందుగదిలో ఒక వాలుకుర్చీలో కూర్చొనియుంటిని. దివ్యవాణి మరల వినిపించినది. అంతకు ముందు తెలిపిన విషయములే తెలిపినది. నేను మునుపటి వలెనే నిరాకరించితిని. ఆ దివ్యవాణి రెండువారముల పాటు తనకు తోడ్పడవలెనని, అటుపైన నిర్ణయము చేసుకొనవచ్చునని తెలిపినది.
నేను కొంత కరగితిని. రెండు వారములే కదా! అటుపైన నిర్ణయించుకొన వచ్చునుకదా! అని, "సరే" నంటిని, ఈ విధముగా నా గురుదేవులు తలపెట్టిన కార్యము అనూహ్యముగా మొదలగుచున్నదని కూడా నాకా సమయమున తెలియదు. నేను అనుమతించిన కొద్దిరోజులలోనే నాకు "Initiation, Human and Solar" అను గ్రంధము వివరింప బడుటయు, నేను వ్రాయుటయూ జరిగినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
05 Mar 2021
No comments:
Post a Comment