భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 187
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 187 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. - 1 🌻
విజ్ఞానభూమిక
701. భగవంతుని జీవితమును సాగించుటలో సద్గురువును, అవతారపురుషుడును సమానులే.
702. సద్గురువును అవతార పురుషుడును ఏక కాలమందే మిధ్యాభూమిక లన్నింటి యందును విహరింతురు.
703. సద్గురువును అవతార పురుషుడును ఏక కాలమందే ఉత్తమాధమ స్థితులయందుందురు.
704. సద్గురువునకు అవతారపురుషునకును గల ముఖ్య భేదమేమనగా_సద్గురువు ఆస్థాయిలందు ప్రవర్తించును అవతార పురుషుడు ఆయాస్థితుల యందుండుటయేగాక, తాను అదే అయిపోవును.
ఉదా:-సద్గురువు రోగి కాలేడు, కాడు. కాని ఆతడు రోగిగా కాన్పించినచో, అతడప్పుడు రోగివలెనే ప్రవర్తించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
05 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment