5-MARCH-2021 EVENING

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 165🌹  
11) 🌹. శివ మహా పురాణము - 363🌹 
12) 🌹 Light On The Path - 115🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 247🌹 
14) 🌹 Seeds Of Consciousness - 312🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 187🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 42 / Lalitha Sahasra Namavali - 42🌹 
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 42 / Sri Vishnu Sahasranama - 42🌹
18) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 014🌹*
AUDIO - VIDEO 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -165 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 10

*🍀 10. ఆత్మజ్ఞానము -1 - ఏకాకి, రహసి స్థితః : రహస్యముగ, ఏకాంత స్థితియందు ఉండవలెను. దీని కొరకు పూర్వము ఆత్మసంయమము కొరకు యోగసాధకులు గుహలలో ఏకాంతముగ నుండెడివారు. ఏకాంత ప్రదేశమున కేగుట వలన కొంత మనసు కుదుటపడునని కొందరు భావింతురు. కాని కుదురు గల మనస్సు ఎచ్చటనైనను కుదురుగనే యుండును. గుహలకు, అడవులకు పోనవసరము లేదు. తన గృహమునందు సాధకుడు ఒక నిర్ణీత ప్రదేశమున ఏకాంతముగ ఆశీనుడై యుండవచ్చును. మనస్సంతర్గతమై హృదయము నందు నిలిపినచో ఏకాంతము లభించును. హృదయగుహలో అను నిత్యము జరుగు హృదయ స్పందన యందు మనస్సు లగ్నము చేయుట ప్రధానము. 🍀*

యోగీ యుంజీత సతత మాత్మానం రహసి స్థితః |
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీ రపరిగ్రహః | 10

రహస్య ప్రదేశమున ఏకాంతముగ స్థితిగొని అంతర్ముఖమైన చిత్తము గలవాడై, ఆశ లేనివాడై యోగి సతతము ఆత్మయందు మనస్సును లగ్నమొనర్చును. ఈ శ్లోకమున ఆత్మసంయమము గావించు విధానము తెలుపబడినది. అది ఇట్లున్నది.

1. ఏకాకి, రహసి స్థితః : 

రహస్యముగ, ఏకాంత స్థితియందు ఉండవలెను. దీని కొరకు పూర్వము ఆత్మసంయమము కొరకు యోగసాధకులు గుహలలో ఏకాంతముగ నుండెడివారు. ఏకాంత ప్రదేశమున కేగుట వలన కొంత మనసు కుదుటపడునని కొందరు భావింతురు. కాని కుదురు గల మనస్సు ఎచ్చటనైనను కుదురుగనే యుండును. 

గుహలకు, అడవులకు పోనవసరము లేదు. తన గృహమునందు సాధకుడు ఒక నిర్ణీత ప్రదేశమున ఏకాంతముగ ఆశీనుడై యుండవచ్చును. మనస్సంతర్గతమై హృదయము నందు నిలిపినచో ఏకాంతము లభించును. హృదయగుహలో అను నిత్యము జరుగు హృదయ స్పందన యందు మనస్సు లగ్నము చేయుట ప్రధానము. 

స్పందనమందు మనస్సునకు గల ఆసక్తి వలన ప్రజ్ఞ లచ్చట నిలుపుటకు వీలుపడును. అపుడు చిత్తము అంతర్ముఖ మగును. స్పందన పై నియమించబడి యుండును. లేదా మనో ప్రజ్ఞను భ్రూమధ్యమందు లగ్నముచేసి అచట వెలుగు దర్శనము చేయుటకు ప్రయత్నింప వలెను. మనస్సు అటు నిటు పోగలదు. కాని మరల మరల ప్రజ్ఞను భ్రూమధ్య మందలి వెలుగు దర్శనమునకు ప్రోత్సహించవలెను. 

పై రెండు విధములతో జీవలక్షణమును బట్టి ఏ విధానము సులభమో దాని నవలంబించ వచ్చును. విధాన మేదైనను జరుగ వలసిన సాధన నిరంతరము కావలెను. ఒకే ప్రదేశమున నిర్వర్తించుట వలన ప్రకృతి ఆ ప్రదేశమున సహకరించగలదు. నిర్ణీత కాలము కూడ పాటించినచో ప్రయత్నమునకు సిద్ధి కలుగుటకు కాలము కూడ తోడ్పడును. 

ముందు శ్లోకములలో తెలిపినట్లు సమబుద్ధి ఏర్పడుట వలన చిత్త మంతర్గత మగుటకు గల అవరోధ ములు తగ్గును. ఒకే ప్రదేశము, ఒకే కాలము తోడగుట వలన అవరోధములు మరింత తగ్గును. అంతరంగమునందు ప్రజ్ఞ నిలుపుటవలన సాధన రహస్యముగ సాగును. అంతరంగమున తానే కాంతుడు గనుక ఏకాంతము సిద్ధించును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 365 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
95. అధ్యాయము - 07

*🌻. పార్వతి బాల్యము - 2 🌻*

బంధువులకు ఇష్టురాలు, మంచి శీలముతో గుణముతో కూడియున్నది అగు ఆమెను బంధుజనులు కులమునకు తగిన 'పార్వతి' అను పేరుతో పిలువజొచ్చిరి (15). ఆ ఉమాదేవి హిమవంతుని గృహములో వర్షకాలమందలి గంగవలె, శరత్కాలమందలి వెన్నెలవలె ప్రకాశించెను (16).

ఓ మహర్షీ! భవిష్యత్తులో ఆ కాళి తపస్సునకు పక్రమించగా, తల్లి 'ఉమా (అబ్బే, వద్దు)' అని నిషేధించును. అప్పటి నుండియూ ఆ సుందరికి ఉమ అను పేరు లోకములో ప్రసిద్ధిని గాంచెను (17). హిమవంతుడు పుత్రసంతానము గలవాడే. అయిననూ, సర్వసౌభాగ్యవతి యగు పార్వతియను పుత్రికను ఎంత చూచిననూ, ఆతనికి తనివి తీరలేదు (18). 

వసంతర్తువు యందు అనంత సంఖ్యలో పుష్పములున్ననూ, తమ్మెదల దండు మామిడి చెట్టు పై విశేష ప్రీతిని కలిగియుండును గదా! ఓ మహర్షీ! (19) సంస్కారవంతమగు వాక్కుచే విద్వాంసుడు వలె ఆ హిమవంతుడు ఆమెచే పవిత్రితుడాయెను. మరియు అలంకృతుడాయెను (20).

గొప్ప కాంతులను విరజిమ్మే అగ్ని శిఖతో దీపమువలె, మందాకిని (పాలపుంత)తో బ్రహ్మండములోని నక్షత్ర మార్గమువలె, హిమవంతుడు గిరిజతో కూడి ప్రకాశించెను (21). ఆమె బాల్యమునందు సుఖురాండ్రతో గూడి గంగానది యొక్క ఇసుకతిన్నెలపై బంతులతో, ఆట బొమ్మలతో చిరకాలము క్రీడించెను (22). 

ఓ మహర్షీ! తరువాత ఆ శివాదేవి విద్యా రంభ సమయములో ఆరంభించి, సద్గురువు వద్ద నుంచి పరమ ప్రీతితో మనస్సును లగ్నము చేసి విద్యలను స్వీకరించి పఠించెను (23).

ఓ మహర్షీ! ఈ తీరున నేను అనిర్వచనీయమగు శివాలీలను చక్కగా వర్ణించితిని. మరికొన్ని లీలలను చెప్పగలను. నీవు ప్రేమపూర్వకముగా వినుము (25).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో పార్వతీ బాల్యలీలల వర్ణనమనే ఏడవ అధ్యాయము ముగిసినది (7).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 115 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 8 - THE 20th RULE
*🌻 20. Seek it not by any one road. - 8 🌻*

438. The disciple rightly puts before himself, as his aim, the realization and purification of the individuality. It is a thing created for the use of its creator. Sometimes it is technically called a creature; then we hear of the man – the true man – meeting his creature. 

So also the individual, the creature, meets his own creator. This meeting occurs only in a high stage of evolution. When a man meets his creature be is perfect and transcends individuality.

439. The creation of the individuality takes place at a lower stage; the man is busy building it up for a very long time. 

The less evolved members of humanity are for a long period shut up in their lower vehicles – that is necessary for their progress, before the individual is fully built – so the causal body remains an unconscious shell for a long time, while activities are busy in, the personality. Think of the ages taken in building the physical vehicle; think of the rounds and the stages that the pitris went through on the moon chain before becoming fit to pass into human evolution. 

There is an immense difference in the time that human beings take in building the individual, though all take long. The building goes on more rapidly in the higher stages under the inspiration of the more evolved ego than in the lower stages; when the intelligence reaches a high stage it is utilizing higher forces and learning not to waste them, and then the building goes on with immense rapidity. 

This gives us great encouragement; for in looking back to the moon chain and thinking of the time we have taken to advance, it would seem very long if it had to be repeated, but looking forward we see that progress may become almost incredibly swift.

440. The divine fragment can do nothing by itself; all its development must come by contact with outside forces, and through the vehicles – it cannot grow without them. As H.P.B. said, spirit is senseless on the lower planes. It cannot bring forth any power without a vehicle of expression on the plane in which it has to act. 

Further it can only have control of the vehicles when they are perfected. The work of bringing the vehicles to perfection develops the powers of the spirit to perfection, so the two developments go on together. 

And when that work is complete, spirit has in itself the power to disintegrate its individual vehicles the moment it leaves them, and to reintegrate them in a moment when it chooses to do so.

441. Think of the perfected Spiritual Beings. Only while they were evolving at and below our human stage were vehicles necessary for Their growth, but when such a one, having drawn all the experiences of that evolution into His essence, wishes to manifest, He can at any time create what He wants for manifestation, and after having utilized the forces of the plane, can withdraw the vehicle again. 

When speaking of the Planetary Spirits, H.P.B. mentions that They have come through humanity. They could not appear as helpers if They had not through the human stages drawn up into their essence the experience necessary. 

Thus Beings exist who may not be manifest, but who can manifest Themselves, by drawing from Their essence the experience They require and creating a vehicle in which to work.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 246 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. గౌరముఖ మహర్షి - 4 🌻*

15. “వ్యతీపాతము, ఆయనము, విషువత్తు, చంద్రసూర్యగ్రహణములు, సంక్రమణము, పుణ్యకాలాలు, నక్షత్రగ్రహపీడాసమయాలు, చెడ్డకలలు వచ్చినప్పుడు, విశిష్టద్రవ్య పాత్రాలాభాలు కలిగినప్పుడు, గంగాది మహాతీర్థాలకు వెళ్ళినప్పుడు యధాశక్తిగా శ్రాద్ధకర్మలు చేయాలి” అని చెప్పాడు. 

16. ధనం లేని వాళ్ళు తిలతర్పణము లిచ్చినా శ్రాద్ధకర్మఫలం లభిస్తుందని చెప్పాడు. అదికూడా సాధ్యంకాకపోతే ఒక గోవుదగ్గరికివెళ్ళి దాని ముందర ఇంత గడ్డిపెట్టి నమస్కరించినా క్షేమకరమే! అది కూడా చేయలేనివాడు అడవికి వెళ్ళి చేతులు పైకెత్తి సూర్యుణ్ణి చూచి బిగ్గరగా ఇలా చెప్పాలి:

17. “ఓ పితృదేవతలారా! నన్ను మన్నించి నా నమస్కారం స్వీకరించండి”. అలా అంటే, పితృదేవతలు తృప్తి పడతారు అని స్మృతులలో ఉంది. 

18. పితృకర్మలకు ఎవరు అర్హులు అంటే – యోగి, యతి, శిష్యుడు, సోమయాజి, ఋత్విజుడు, సోదరికొడుకు, అల్లుడు, మేనమామ మున్నగువారు పైతృకర్మలు చేయటానికి అర్హులు. అటువంటి బాకీలన్నీ వీళ్ళు తీర్చాలి. కొడుకులు ఎలాగూ చేయాలి. 

19. యతి తన గురువుకు చెయ్యవచ్చు, తప్పుకాదు. ఆశ్రమాలలో గురువుగారి తిథి శిష్యులు జరుపుకోవచ్చు. శ్రాద్ధం అంటే ఈ ప్రకారంగా కొన్ని తర్పణాలు ఇస్తారు. తండ్రికి కొడుకు చేసినట్లుగానే, యతికి మరెవరూ చేసేవాళ్ళు లేకపోతే – యాగం చేసే సోమయాజి ఎవరైనా చేయవచ్చు. 

20. కొడుకులు లేని వాళ్ళు కూడా అలా తమకు చేయించుకోవచ్చు. నపుంసకుడు, దొంగ, నిందితుడు, రోగి, బ్రాహ్మణులు (యాచన చేసే వాళ్ళు) అనర్హులని, ఈ కర్మలు చేయకూడదని నిషేధించారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 312 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 161. The 'I am' is the divinity in you and cause of the sacred repetition ('Japa') in you breath of 'So Hum' (I am 'That'). 🌻*

The 'I am' is the divinity or God in you and makes its presence felt through the sacred repetition or 'Japa' continuously going on in you in the form of breath. 

The ancient ones carefully observed the breath and found two subtle sounds in it at every inhalation and exhalation. When you inhale deeply and slowly you can hear 'Soooo' and when you exhale, again slowly you can hear 'Huuum'. These sounds are called 'So Hum', which in Sanskrit means 'I am That'. 

Many practitioners do this meditation of focusing their attention on the breath and observing the sound 'So Hum', which is regarded as a 'mantra' (condensed sacred words with a deep meaning)

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 187 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. - 1 🌻*

విజ్ఞానభూమిక
701. భగవంతుని జీవితమును సాగించుటలో సద్గురువును, అవతారపురుషుడును సమానులే.

702. సద్గురువును అవతార పురుషుడును ఏక కాలమందే మిధ్యాభూమిక లన్నింటి యందును విహరింతురు.

703. సద్గురువును అవతార పురుషుడును ఏక కాలమందే ఉత్తమాధమ స్థితులయందుందురు.

704. సద్గురువునకు అవతారపురుషునకును గల ముఖ్య భేదమేమనగా_సద్గురువు ఆస్థాయిలందు ప్రవర్తించును అవతార పురుషుడు ఆయాస్థితుల యందుండుటయేగాక, తాను అదే అయిపోవును.
ఉదా:-సద్గురువు రోగి కాలేడు, కాడు. కాని ఆతడు రోగిగా కాన్పించినచో, అతడప్పుడు రోగివలెనే ప్రవర్తించును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా
www.facebook.com/groups/avataarmeherbaba/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 42 / Sri Lalita Sahasranamavali - Meaning - 42 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 42. భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా ।*
*శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ ॥ 42 ॥ 🍀*

🍀 118. భక్తప్రియా - 
భక్తుల యెడ ప్రేమ, వాత్సల్యము గలది.

🍀 119. భక్తిగమ్యా - 
భక్తికి గమ్యమైనటువంటిది.

🍀 120. భక్తివశ్యా - 
భక్తికి స్వాధీనురాలు.

🍀 121. భయాపహా - 
భయములను పోగొట్టునది.

🍀 122. శాంభవీ - 
శంభుని భార్య.

🍀 123. శారదారాధ్యా - 
సరస్వతిచే ఆరాధింపబడునది.

🍀 124. శర్వాణీ - 
శర్వుని భార్య.

🍀 125. శర్మదాయినీ - 
శాంతిని, సుఖమును ఇచ్చునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 42 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 42. bhaktipriyā bhaktigamyā bhaktivaśyā bhayāpahā |*
*śāmbhavī śāradārādhyā śarvāṇī śarmadāyinī || 42 || 🌻*

🌻 118 ) Bhakthi priya -  
 She who likes devotion to her

🌻 119 ) Bhakthi gamya -   
She who can be reached by devotion

🌻 120 ) Bhakthi vasya -   
She who can be controlled by devotion

🌻 121 ) Bhayapaha -   
She who removes fear

🌻 122 ) Sambhavya -   
She who is married to Shambhu

🌻 123 ) Saradharadya -   
She who is to be worshipped during Navarathri celebrated during autumn

🌻 124 ) Sarvani -   
She who is the consort of Lord Shiva in the form of Sarvar

🌻 125 ) Sarmadhayini -   
She who gives pleasures

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 42 / Sri Vishnu Sahasra Namavali - 42 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*సింహ రాశి- పుబ్బ నక్షత్ర 2వ పాద శ్లోకం*

*🍀 42. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః।*
*పరర్థిః పరమస్పష్టః తుష్టః పుష్టశ్శుభేక్షణః॥ 🍀*

🍀 384) వ్యవసాయ: - 
మానవాళి అభ్యున్నతికి తానే కృషిచేయువాడు.

🍀 385) వ్యవస్థాన: - సర్వవ్యవహారములను యధావిధిగ నడుపువాడు.

🍀 386) సంస్థాన: - 
జీవులకు గమ్యస్థానమైనవాడు.

🍀 387) స్థానద: -
 వారివారి కర్మానుసారముగా స్థానముల నందించువాడు.

🍀 388) ధృవ: - 
అవినాశియై, స్థిరమైనవాడు.

🍀 389) పరర్థి: - 
ఉత్కృష్టమైన వైభవముకలవాడు.

🍀 390) పరమస్పష్ట: - 
మిక్కిలి స్పష్టముగా తెలియువాడు.

🍀 391) తుష్ట: - సంతృప్తుడు.

🍀 392) పుష్ట: - పరిపూర్ణుడు

🍀 393) శుభేక్షణ: - 
శుభప్రధమైన దృష్టిగలవాడు.

 సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 42 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Simha Rasi, Pubba 2nd Padam*

*🌻 42. vyavasāyō vyavasthānaḥ saṁsthānaḥ sthānadō dhruvaḥ |*
*pararddhiḥ paramaspaṣṭastuṣṭaḥ puṣṭaḥ śubhekṣaṇaḥ || 42 || 🌻*

🌻 384. Vyavasāyaḥ: 
One who is wholly of the nature of knowledge.

🌻 385. Vyavasthānaḥ: 
He in whom the orderly regulation of the universe rests.

🌻 386. Sāṁsthānaḥ: 
One in whom all beings dwell in the states of dissolution.

🌻 387. Sthānadaḥ: 
One who gives their particular status to persons like Dhruva according to their Karma.

🌻 388. Dhruvaḥ: 
One who is indestructible.

🌻 389. Pararddhiḥ: 
One who possesses lordliness of this most exalted type.

🌻 390. Paramaspaṣṭaḥ: 
One in whom 'Para' or supremely glorious 'Ma' or Lakshmi dwells. Or one who is the greatest of all beings without any other's help.

🌻 391. Tuṣṭaḥ: 
One who is of the nature of supreme.

🌻392. Puṣṭaḥ: 
One who in fills everything.

🌻 393. Śubhekṣaṇaḥ: 
One whose Ikshanam or vision bestows good on all beings that is, gives liberation to those who want Moksha and enjoyments to those who are after it, and also cuts asunder the knots of the heart by eliminating all doubts.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
www.facebook.com/groups/vishnusahasranam/*🌹. భగవద్గీత యథాతథం - 1 - 014 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. విషాదయోగం - అధ్యాయము 1 - శ్లోకము 14 🌻*

14
తత: శ్వేతైర్హయైర్యుక్తే
మహతి స్యందనే స్థితౌ |
మాధవ: పాండవశ్చైవ
దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు: ||

తాత్పర్యము : 
ఎదుటి పక్షమున శ్రీ కృష్ణభగవానుడు, అర్జునుడు ఇరువురును తెల్లని గుఱ్ఱములు కలిగిన మహారథమునందు ఆసీనులైనవారై తమ దివ్యశంఖములను పూరించిరి.

భాష్యము : 
భీష్ముని శంఖనాదానికి భిన్నముగా కృష్ణార్జునుల శంఖాలు దివ్యమైనవని ఇక్కడ చెప్పబడినవి. అనగా ఎదుటి పక్షము వారికి విజయము చేకూరే అవకాశమే లేదని ఈ వర్ణన స్పష్టము చేయుచున్నది. 
”జయస్తు పాండుపుత్రాణాం యేషాం పక్షే జనార్థన:” జనార్ధనునితో సాంగత్యము వలన పాండ పుత్రులనే విజయము వరిస్తుంది. అంతేకాక భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి, సౌభాగ్యము, విజయము ఉంటుందని కనుక కృష్ణుని రూపములో విష్ణువు అర్జునుని చెంత ఉండుటచే వారిదే విజయమని తెలుస్తుంది. అంతేకాక, ముల్లోకాలలో ఎక్కడ నడిపినా విజయమును సాధించే అగ్నిదేవుని రథముపై కృష్ణార్జునులు కూర్చుని యుండుట మరొక విజయ సంకేతము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment