శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 229 / Sri Lalitha Chaitanya Vijnanam - 229


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 229 / Sri Lalitha Chaitanya Vijnanam - 229 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

🍀 56. మహాతంత్రా, మహామంత్రా, మహాయంత్రా, మహాసనా ।
మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా ॥ 56 ॥🍀

🌻 229. 'మహాసనా' 🌻

శ్రీదేవియే మహాసన అని అర్థము. మహాసనా అనగా అన్నిటి యందు ఆసనము వహించునది. అన్నిటి యందు వసించునది. ఆమె లేని సృష్టియే లేదు. సృష్టి లేనపుడు కూడ ఆమె బీజప్రాయముగ పరతత్త్వముతో కూడి యుండును. అన్ని లోకముల యందు ఆమెయే ఆసనము గొని యున్నది. అన్ని జీవుల యందు ఆమెయే చేతనముగ నున్నది.

అచేతనములలో కూడ చేతనమై యున్నది. ఉప్పు ఉప్పగ నుండుటకు, పంచదార తీపిగ నుండుట కును, వేప చేదుగ నుండుటకు ఆమె చేతనమే ఆధారము. అట్లే సకల లోకముల యందలి సకల భావములకు, స్వభావములకు ఆమెయే ఆధారము.

ఆమె ఆసనము గొనుట వలననే అహంకారాది అష్ట ప్రకృతులు సృష్టిలో వివిధములుగ ప్రవర్తించు చున్నవి. ఆమె సింహాసనాసీన, సర్వాసనాసీన. త్రిమూర్తులు, సప్త ఋషులు కూడ ఆమెయందే వసించి యున్నారు. వారి యందు కూడ ఆమెయే ఆసనము గొని యున్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 229 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Mahāsanā महासना (229) 🌻


Āsana means seat. She has a great seat is the literal meaning. Her āsana is the seat of thirty six tattva-s. The third nāma already discussed about Her corporeal seat.

{Further reading on 36 tattva-s or principles: 1, 2, 3, 4. antaḥkaraṇa that comprises of mind, intellect, consciousness and ego. 5, 6, 7, 8, 9. Organs of perception or cognitive senses (jñānedriyā-s), ear, skin, eye, tongue and nose. 10, 11, 12, 13, 14. Cognitive faculties or tanmātra-s, sound, touch, sight, taste and smell. 15, 16, 17, 18, 19. Organs of actions known as karmendriyā-s, mouth, feet, hands, organ of excretion and organ of procreation. 20, 21, 22, 23, 24. Action faculties, speech, movement, holding, excretion and procreation.

(1 to 25 known as ātma tattva-s.) 25, 26, 27, 28, 29, 30, 31. Time (past, present and future), niyati (order of sequence), kalā (induces action), vidyā (induces intelligence), rāgā (desire), puruśā (soul), māyā (illusion, causing ignorance) (25 to 31 known as Vidyā tattva-s.) 32, 33, 34, 35, 36. Śuddhavidyā (induces more intelligence than action), Īśvara (induces more action than intelligence), Sadhāśiva (induces both intelligence and action in equal proportion), Śaktī (induces action), Śiva (induces pure knowledge).}


Continues...
🌹 🌹 🌹 🌹 🌹


05 Mar 2021

No comments:

Post a Comment