వివేక చూడామణి - 39 / Viveka Chudamani - 39


🌹. వివేక చూడామణి - 39 / Viveka Chudamani - 39 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు

🍀. ఆత్మ స్వభావము - 7 🍀


141. వికృతి చెందిన తెలివితేటలు తన సొంత జ్ఞానమును అజ్ఞానమనే సొర చేప మ్రింగివేయగా, బుద్ధి యొక్క వివిధ చేష్టలు అనేక జన్మలు ఎత్తుటకు కారణమవుచున్నవి. వాటి వలన మంచి, చెడు జన్మలెత్తి తత్‌ ఫలితాలను అనుభవించవలసి వచ్చుచున్నది. ఎత్తు పల్లములనే సంసార బంధనాలలో చిక్కి, చావు, పుట్టుకలనే జన్మ పరంపరలకు లోను కావల్సి వచ్చుచున్నది. జ్ఞానేంద్రియాల అనుభూతులకు లొంగి అందులో మునిగి తేలుతూ సుఖదుఃఖాలకు లోనగుచున్నారు.

142. సూర్య కిరణముల వలన తయారైన మేఘ సముహములు సూర్యుని కప్పివేసినట్లు, ఆత్మ వలన తయారైన అహము సత్యమైన ఆత్మను కప్పివేసి తానే వ్యక్తమవుతున్నది.

143. మేఘములతో కూడిన ఆకాశం సూర్యుని కప్పివేసినట్లు, తీవ్రమైన చల్లని గాలులు విస్తరించి ఇబ్బందులు కలుగజేసినట్లు, ఆత్మ లోతైన అజ్ఞానముచే మరుగునపడి యున్నది. అందువలన భయంకరమైన అజ్ఞానము వలన ఆత్మశక్తి వ్యక్తము కాకపోవుటచే తెలివి తక్కువ వ్యక్తి అనేకములైన దుష్ఫలితములను పేదుర్కొని దుఃఖించవలసి వచ్చుచున్నది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 39 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 Nature of Soul - 7 🌻

141. The man of perverted intellect, having his Self-knowledge swallowed up by the shark of utter ignorance, himself imitates the various states of the intellect (Buddhi), as that is Its superimposed attribute, and drifts up and down in this boundless ocean of Samsara which is full of the poison of sense-enjoyment, now sinking, now rising –a miserable fate indeed!

142. As layers of clouds generated by the sun’s rays cover the sun and alone appear (in the sky), so egoism generated by the Self, covers the reality of the Self and appears by itself.

143. Just as, on a cloudy day, when the sun is swallowed up by dense clouds, violent cold blasts trouble them, so when the Atman is hidden by intense ignorance, the dreadful Vikshepa Shakti (projecting power) afflicts the foolish man with numerous griefs.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


05 Mar 2021

No comments:

Post a Comment