🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. జడమహర్షి - 1 🌻
1. తండ్రి అయిన భార్గవుడు ఆ పిల్లవాడికి ఎన్ని బోధలు చేసినా ఒక జడుడివలె, చేవిటివాడిలాగా జడత్వం వహించి ఉన్నాడట. తనకు కావలసిన అహారాదులను గురించి మాత్రమే అడిగేవాడు. అంతేకాని ఎక్కువగా మాట్లాడలేదు. అందువల్ల భార్గవుడి మాటలకు ఆ పిల్లవాడు నవ్వగానే భార్గవుడికి ఆశ్చర్యం వేసింది.
2. “తండ్రీ! నీవు చెప్పిన ప్రకారం బాల్యావస్థలో గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవటము, వేదవేదాంగములను చదువుకోవటము, యజ్ఞ యాగాదులు చేయటము, క్రతువులు చేయటము, నిత్యకర్మానుష్ఠానము, సంసారము, సంతానము కనటము, ఈ ప్రకారంగా నేను అయిదువేల జన్మల నుంచీ చేసాను.
3. అయిదువేల మంది తల్లుల గర్భాలలోంచి మళ్ళీ మళ్ళీ పుట్టాను. నేటికి నీవు మళ్ళీ చేసిన ఉపదేశము వింటే నవ్వొస్తున్నది” అన్నాడు. అందుకు ఆ భార్గవుడు ఆశ్చర్యంతో జడుడితో, “నాయనా! నీకు ఇంత విజ్ఞానం ఏమిటి! నీ వయసెంత? ఇన్నాళ్ళూ నువ్వు నాతో మాట్లాడకపోవడమేమిటి! అంత బుద్ధిమంతుడవైన నువ్వు ఈ సామాన్యుడింట్లో జన్మించటం ఏమిటి! అని అడిగి జదమహర్షి పూర్వజన్మల వృత్తాంతం తెలుసుకొని, ‘మహానుభావా! నీవు నా పూర్వజన్మపుణ్యంచేత పుట్టావు.
4. ఆగర్భజ్ఞానివైన నిన్ను కనటం మా తపోఫలం. అని గురుభావాన్ని పెట్టుకుని కొన్ని ప్రశ్నలు అడిగాడు జదమహర్షిని. “ఈ సృష్టిలో జన్మరహస్యం ఏమిటి? జీవులు ఏ విధంగా చనిపోతాయి? పాపపుణ్యాలు ఎలా ఉంటాయి? వాటి స్వరూపం ఏమిటి?” అని అడిగాడు భార్గవుడు.
5. జడమహర్షి చెప్పిన వాటిలో, మరణానికి ముందు జీవుడు ఏయే పద్ధతులలో శరీరాన్ని వదిలి పెడతాడో చెప్పబడి ఉంది. సాధారణంగా మనం యోగశాస్త్రంలో విన్న మాటలే ఇక్కడా ఉన్నాయి.
6. ఆయన చెప్పినవి: మరణకాల మాసన్నపైనప్పుడు మానవుడి శరీరంలో పెద్ద వేదన కలుగుతుంది. లోపలి నుంచీ మిక్కిలి వేడి అయిన ఆవిర్లు బయలుదేరుతాయి. మర్మస్థానాలన్నీ పట్టుతప్పిపోతాయి. ఉదానవాయువు ఊర్ధ్వగతిలో వెళ్లుతుంది. శరీరంలో తడి ఆరిపోతుంది. మాట పడిపోతుంది. ఉఛ్ఛ్వాసనిశ్వాసాలు ఆగిపోతాయి. నాలుక వెనకకు వెళ్ళిపోతుంది. జీవుడికి బాధ ఎక్కువయిపోతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
06 Mar 2021
No comments:
Post a Comment