శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 230 / Sri Lalitha Chaitanya Vijnanam - 230


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 230 / Sri Lalitha Chaitanya Vijnanam - 230 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

🍀 56. మహాతంత్రా, మహామంత్రా, మహాయంత్రా, మహాసనా ।
మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా ॥ 56 ॥🍀


🌻 230. 'మహాయాగ క్రమారాధ్యా' 🌻

అరువది నాలుగు (64) యోగినీ పూజలతో కూడిన మహాయాగ క్రమము ననుసరించి ఆరాధింపబడునది శ్రీదేవి యని అర్థము. అరువది నాలుగు (64) కళలు, 64 విద్యలు, 64 ముద్రలు కలవు. వీని వివరములు భాగవత పురాణమున దశమస్కంధమున శ్రీకృష్ణుడు నేర్చిన విద్యలుగ వివరింపబడినవి. ఈ విద్యలు నేర్చినవారు పూర్ణ పురుషులు. ఇట్టివారు లోకమున అరుదుగ అవతరింతురు.

యోగులు ఈ విద్యలను నేర్చుటకు ఉత్సుకత చూపుదురు. ఈ విద్యల యందు సిద్ధి పొందిన వారు శివ సమానులు. వీనిని గూర్చి తెలుసుకొన గోరువారు, యాగమునకు ప్రతిపాదింపబడిన భావోపనిషత్తును పరిశీలించ గలరు. ఈ ఆరాధనమున శబ్రోచ్చారణము, క్రమము, ముద్రలు, అత్యంత నియమ నిష్ఠలను పాటింప వలెనని తెలుపబడుచున్నది.

సృష్టియొక మహాయాగము, సృష్టియాగము క్రమము ననుసరించియే సాగును. సృష్టి క్రమము ననుసరించియే ఈ ఆరాధన ముండునని, ఆరాధనము పురోగతి చెందుచుండగ సృష్టి రహస్యము లన్నియు తెలియబడుననియూ తెలుపుదురు. ఈ యాగక్రమము, ఆరాధనా విధానము తెలిసినవారు అరుదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 230 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Mahā- yāga-kramārādhyā महा-याग-क्रमाराध्या (230) 🌻

Worshipping sixty four yoginī-s (demigoddesses who are assistants to Her) is called mahā-yaga and if performed according to the laid down procedures, gives immediate results. This worship falls under the category of tantra śāstra as navāvaraṇa pūja.

In Śrī cakra, each of the eight āvaraṇa is presided by a yoginī. It is said that each of these yoginīs has eight deputies making sixty four yoginīs in all. Yoginī-s are explained as demigoddesses attending on Śiva and Śaktī.

There is another interpretation. There are eight forms of Bhairava known as aśta Bhairava. Their consorts are known as aśta mātās. Sixty four Bhairava-s and sixty four Yogini-s are born to them.

The Bhāvanopaniṣad prescribes Her mental worship. This is also called mahā-yāga. Yāga generally means fire rituals and navāvaraṇa pūja, though all fire rituals are not called yāga. Krama means going, proceeding or course.

The nāma means that She is worshipped through navāvaraṇa pūja. The secretive meaning is that She is worshipped mentally as prescribed by Bhāvanopaniṣad (भावनोपनिषद्)

{Names of sixty four yoginī-s: (The names of yoginī-s differ from text to text.) 1. Brahmāni, 2. Candikā 3. Raudrī, 4. Gauri, 5. Indrānī, 6. Kaumāri, 7. Bhairavī, 8. Dusgā, 9. Nārasimhī, 10. Kālikā, 11. Cāmundā, 12. Śiva-dūtī, 13. Vārāhī, 14. Kauśikī, 15. Mahā-iśvari, 16. Śankari, 17. Jayanti 18. Sarva-maṇgalā, 19. Kāli, 20. Karālini, 21. Medhā, 22. Śivā, 23. Śākambari, 24. Bhīmā, 25. Śantā, 26. Bhramāri, 27. Rudrāni, 28. Ambikā, 29. Kśamā, 30. Dhātri, 31. Svahā, 32. Svadhā, 33. Parnā, 34. Mahāundarī, 35. Ghora-rūpā, 36. Mahā-kāli, 37. Bhadra-kāli, 38. Kapālini, 39. Kśemakari, 41. Candrā 42. Candrāvāli, 43. Prapancā, 44. Pralayantikā, 45. Picuvaktrā, 46. Piśāci, 47. Priyankari, 48. Bāla-vikarmī, 49. Bāla-pramanthani, 50. Madana-unmanthani, 51. Sarvabhūtā-damani, 52 Umā, 53. Tārā, 54. Mahā-nidrā, 55. Vijayā, 56. Jayā, 57. Śaila-putrī, 58. Zayanti, 59. Dusjayā, 60. Jayantikā, 61. Bidāli, 62. Kūśmāndī, 63. Katyāyani, 64. Mahāgauri.}

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


06 Mar 2021

No comments:

Post a Comment