11) 🌹. శివ మహా పురాణము - 363🌹
12) 🌹 Light On The Path - 115🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 248🌹
14) 🌹 Seeds Of Consciousness - 313🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 188🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 43 / Lalitha Sahasra Namavali - 43🌹
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 43 / Sri Vishnu Sahasranama - 43🌹
18) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 015🌹*
AUDIO - VIDEO
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -166 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 10
*🍀 10. ఆత్మజ్ఞానము -2 - నిరాశి : - ఆశ గలవానికి ఆత్మ సంయమము కుదరదు. ఆశ ఉన్నంత కాలము జీవుడు బాహ్యముననే జీవించును గాని అంత రంగమున చేరజాలడు. కనుక తీరని కోరికలు, ఆశలు గలవారు ధ్యానముకు వలసిన ప్రాథమిక అర్హతను కోల్పోవుదురు. అపరిగ్రహః - యోగ సాధకుడు ఇతరుల నుండి లబ్ధిపొందు బుద్ధి కలిగి యుండ రాదు. తా నితరులకు చేయు హితము, తా నితరుల నుండి పొందు హితము కన్న మిక్కుటమై యుండవలెను. యత చిత్తాత్మా : - నియమింపబడిన చిత్తము గలవాడై యుండవలెను. అందులకు కృషి చేయవలెను. ఆశ యతచిత్తము నకు వ్యతిరేకము. అట్లే పరిగ్రహము కూడ. 🍀*
2. నిరాశి :
ఆశ గలవానికి ఆత్మ సంయమము కుదరదు. పంచభూతాత్మకమైన బహిరంగమందు ఆశ, ఆసక్తి సాధకుని అంత రంగ ప్రవేశమునకు అవకాశము కలుగనీయదు.
ఆశ వలన ప్రజ్ఞ బహిర్ముఖ మగుచుండగ, అంతర్ముఖుడెట్లు కాగలడు? ఆశ ఉన్నంత కాలము జీవుడు బాహ్యముననే జీవించును గాని అంత రంగమున చేరజాలడు. కనుక తీరని కోరికలు, ఆశలు గలవారు ధ్యానముకు వలసిన ప్రాథమిక అర్హతను కోల్పోవుదురు. ధ్యానము పేరున అట్టివారు చేయు కృషి యంతయు వృథా ప్రయాసయే అగును. ఈ విషయము తెలియవలెను.
3. అపరిగ్రహః :
ఇతరులను, ఇతరుల పదను తమ కొరకు వినియోగించు వారు కర్మబద్ధు లగుదురు. ఉచితముగ ఇతరుల సహకారమును అందుకొనువారు ఋణగ్రస్తులు కాగలరు. గ్రహించుట, పరిగ్రహించుట ఆత్మసంయమమునకు విరుద్దములు. దానము చేయుట, త్యాగము చేయుట దోహద కారకములు.
యోగ సాధకుడు ఇతరుల నుండి లబ్ధిపొందు బుద్ధి కలిగి యుండ రాదు. తా నితరులకు చేయు హితము, తా నితరుల నుండి పొందు హితము కన్న మిక్కుటమై యుండవలెను. విలువగల వస్తువులు గాని, వెండి బంగారములు గాని, ధనముగాని, బహుమతులుగ స్వీకరించరాదు. అట్లు స్వీకరించినను తక్షణమే సద్వినియోగము చేయవలెను. స్వంతమునకు వినియోగింపరాదు.
4. యత చిత్తాత్మా :
నియమింపబడిన చిత్తము గలవాడై యుండవలెను. అందులకు కృషి చేయవలెను. ఆశ యతచిత్తము నకు వ్యతిరేకము. అట్లే పరిగ్రహము కూడ. అందువలననే నిరాశ, అపరిగ్రహము యతచిత్తమునకు ప్రధానమైన లక్షణములుగ ఈ శ్లోకమున పేర్కొనబడినది.
నిజమునకు యతచిత్తము వలయు నన్నచో అహింస, సత్యప్రవర్తనము, బ్రహ్మచర్యము, దొంగబుద్ధి లేకుండుట, అపరిగ్రహము, బాహ్యశుచి, అంతఃశుచి, సంతోషము,
నిత్య పఠనము, ఈశ్వర ప్రణిధానము ప్రధానమని పతంజలి మహర్షి బోధించెను. అట్టి వానికే స్థిరము, సుఖము అగు చిత్త స్థితి కలుగునని తెలిపెను. భగవద్గీతయందు కూడ ముందు శ్లోకములలో ఈ విషయములే తెలుపబడినవి. ఆత్మజ్ఞానమునం దాసక్తి గలవారు సున్నితముగ పై తెలిపిన నియమములను పాటించుటకు త్రికరణ శుద్దిగ శ్రమించవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 247 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. జడమహర్షి - 1 🌻*
1. తండ్రి అయిన భార్గవుడు ఆ పిల్లవాడికి ఎన్ని బోధలు చేసినా ఒక జడుడివలె, చేవిటివాడిలాగా జడత్వం వహించి ఉన్నాడట. తనకు కావలసిన అహారాదులను గురించి మాత్రమే అడిగేవాడు. అంతేకాని ఎక్కువగా మాట్లాడలేదు. అందువల్ల భార్గవుడి మాటలకు ఆ పిల్లవాడు నవ్వగానే భార్గవుడికి ఆశ్చర్యం వేసింది.
2. “తండ్రీ! నీవు చెప్పిన ప్రకారం బాల్యావస్థలో గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవటము, వేదవేదాంగములను చదువుకోవటము, యజ్ఞ యాగాదులు చేయటము, క్రతువులు చేయటము, నిత్యకర్మానుష్ఠానము, సంసారము, సంతానము కనటము, ఈ ప్రకారంగా నేను అయిదువేల జన్మల నుంచీ చేసాను.
3. అయిదువేల మంది తల్లుల గర్భాలలోంచి మళ్ళీ మళ్ళీ పుట్టాను. నేటికి నీవు మళ్ళీ చేసిన ఉపదేశము వింటే నవ్వొస్తున్నది” అన్నాడు. అందుకు ఆ భార్గవుడు ఆశ్చర్యంతో జడుడితో, “నాయనా! నీకు ఇంత విజ్ఞానం ఏమిటి! నీ వయసెంత? ఇన్నాళ్ళూ నువ్వు నాతో మాట్లాడకపోవడమేమిటి! అంత బుద్ధిమంతుడవైన నువ్వు ఈ సామాన్యుడింట్లో జన్మించటం ఏమిటి! అని అడిగి జదమహర్షి పూర్వజన్మల వృత్తాంతం తెలుసుకొని, ‘మహానుభావా! నీవు నా పూర్వజన్మపుణ్యంచేత పుట్టావు.
4. ఆగర్భజ్ఞానివైన నిన్ను కనటం మా తపోఫలం. అని గురుభావాన్ని పెట్టుకుని కొన్ని ప్రశ్నలు అడిగాడు జదమహర్షిని. “ఈ సృష్టిలో జన్మరహస్యం ఏమిటి? జీవులు ఏ విధంగా చనిపోతాయి? పాపపుణ్యాలు ఎలా ఉంటాయి? వాటి స్వరూపం ఏమిటి?” అని అడిగాడు భార్గవుడు.
5. జడమహర్షి చెప్పిన వాటిలో, మరణానికి ముందు జీవుడు ఏయే పద్ధతులలో శరీరాన్ని వదిలి పెడతాడో చెప్పబడి ఉంది. సాధారణంగా మనం యోగశాస్త్రంలో విన్న మాటలే ఇక్కడా ఉన్నాయి.
6. ఆయన చెప్పినవి: మరణకాల మాసన్నపైనప్పుడు మానవుడి శరీరంలో పెద్ద వేదన కలుగుతుంది. లోపలి నుంచీ మిక్కిలి వేడి అయిన ఆవిర్లు బయలుదేరుతాయి. మర్మస్థానాలన్నీ పట్టుతప్పిపోతాయి. ఉదానవాయువు ఊర్ధ్వగతిలో వెళ్లుతుంది. శరీరంలో తడి ఆరిపోతుంది. మాట పడిపోతుంది. ఉఛ్ఛ్వాసనిశ్వాసాలు ఆగిపోతాయి. నాలుక వెనకకు వెళ్ళిపోతుంది. జీవుడికి బాధ ఎక్కువయిపోతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 313 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 162. The Absolute doesn't know that 'It is'. Only when the knowledge 'I am' spontaneously appeared did it know 'It is'. 🌻*
There is no question of there being any experience in the Absolute or the 'Parabrahman'. All experiences demand the necessity of duality in the form of the experiencer (subject) and the experienced (object).
The Absolute is a non-dual state, so who is to experience what? Moreover, the Absolute, does not require any experience or the need to know that 'it is'. By the spontaneous appearance of the knowledge 'I am' it came to know that 'it is', yet it doesn't require the 'I am' at all, for it is complete in itself, devoid of any wants.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 188 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. - 2 🌻*
705. సద్గురువు అన్ని వస్తువుల యందును, అన్ని ప్రాణులయందు, అందరి మానవులయందు అన్ని స్థాయిలందు తానున్నట్లు ప్రవర్తించును.
706. అవతార పురుషుడట్లుగాక తాను ఏక కాలమందే, అన్ని పరిస్థితులలోను అన్నిస్థాయిలందును అన్ని భూమికలలోను అదే వస్తువుగను అదే ప్రాణిగను అదే మానవునిగను అయి యుండును (విశ్వరూపుడగును-విశ్వమేతానయిపోవును.)
707. అవతార మహిమ:-
ఒక్క అవతార పురుషుడు మాత్రమే సృష్టి యందలి అన్ని వస్తువులకు, అన్ని ప్రాణులకు ,అందలి మానవులకు ఏక కాలమందే విశ్వాత్మక మగు ఆధ్యాత్మిక అఘాతము నిచ్చుటలో అనంత సమర్ధుడు.
మానవులలో తానొక మానవుడై, మానవులందరికీ భౌతికముగను, ఆధ్యాత్మికముగను అన్ని పరిస్థితులందును పరోక్షముగా సహాయపడు చుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
Meher Baba అవతార్ మెహర్ బాబా
www.facebook.com/groups/avataarmeherbaba/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 43 / Sri Lalita Sahasranamavali - Meaning - 43 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 43. శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా ।*
*శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ॥ 43 ॥ 🍀*
🍀 126. శాంకరీ -
శంకరుని భార్య.
🍀 127. శ్రీకరీ -
ఐశ్వర్యమును ఇచ్చునది.
🍀 128. సాధ్వీ -
సాధు ప్రవర్తన గల పతివ్రత.
🍀 129. శరచ్చంద్ర నిభాననా -
శరత్కాలము లోని చంద్రునితో సమానమైన వదనము గలది.
🍀 130. శాతోదరీ -
కృశించిన లేదా సన్నని పొట్ట గలిగినది.
🍀 131. శాంతిమతీ -
శాంతి గలది.
🍀 132. నిరాధారా -
ఆధారము లేనిది.
🍀 133. నిరంజనా -
మాయా సంబంధమైన అజ్ఞానపు పొరలేని దృష్టి గలది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 43 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 43. śāṅkarī śrīkarī sādhvī śaraccandra-nibhānanā |*
*śātodarī śāntimatī nirādhārā nirañjanā || 43 || 🌻*
🌻 126 ) Sankari -
She who is the consort of Sankara
🌻 127 ) Sreekari -
She who gives all forms of wealth and happiness
🌻 128 ) Sadhwi -
She who is eternally devoted to her husband
🌻 129 ) Sarat chandra nibhanana - She who has the face like moon in the autumn
🌻 130 ) Satho dhari -
She who has a thin belly
131 ) Santhimathi -
She who is peace personified
🌻 132 ) Niradhara -
She who does not need any support to herself
🌻 133 ) Niranjana -
She who is devoid of any blemishes or scars
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 43 / Sri Vishnu Sahasra Namavali - 43 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*సింహ రాశి- పుబ్బ నక్షత్ర 3వ పాద శ్లోకం*
*🍀 43 . రామో విరామో విరతో మార్గో నేయో నయోనయః।*
*వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః॥ 🍀*
🍀 394) రామ: -
నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు.
🍀 395) విరామ: -
సకల జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు.
🍀 396) విరత: -
విషయ వాంఛలు లేనివాడు.
🍀 397) మార్గ: -
మోక్షమునకు మార్గము తానైనవాడు.
🍀 398) నేయ: -
ఆత్మజ్ఞానము ద్వారా జీవులను నడిపించువాడు.
🍀 399) నయ: -
జీవులను నడిపించి పరమపదస్థితికి గొనిపోవువాడు.
🍀 400) అనయ: -
తనను నడుపువాడు మరొకడు లేనివాడు.
🍀 401) వీర: -
పరాక్రమశాలియైనవాడు.
🍀 402) శక్తిమతాం శ్రేష్ఠ: -
శక్తిమంతులలో శ్రేష్ఠుడైన భగవానుడు.
🍀 403) ధర్మ: -
ధర్మ స్వరూపుడు.
🍀 404) ధర్మ విదుత్తమ: -
ధర్మము నెఱింగినవారిలో శ్రేష్ఠుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 43 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Simha Rasi, Pubba 3rd Padam*
*🌻 43. rāmō virāmō virajō mārgō neyō nayōnayaḥ |*
*vīraḥ śaktimatāṁ śreṣṭhō dharmō dharmaviduttamaḥ || 43 ||🌻*
🌻 394. Ramaḥ:
The eternally blissful on in whom the Yogis find delight.
🌻 395. Virāmaḥ:
One in whom the Virama or end of all beings takes place.
🌻 396. Virajaḥ:
One in whom the desire for enjoyments has ceased
🌻 397. Mārgaḥ: The path.
🌻 398. Neyaḥ:
One who directs or leads the Jiva to the Supreme Being through spiritual realization.
🌻 399. Nayaḥ:
One who leads, that is, who is the leader in the form of spiritual illumination.
🌻 400. Anayaḥ:
One for whom there is no leader.
🌻 401. Vīraḥ:
One who is valorous.
🌻 402. Śaktimatāṁ śreṣṭhaḥ:
One who is the most powerful among all powerful beings like Brahma.
🌻 403. Dharmaḥ:
One who supports all beings.
🌻 404. Dharma-viduttamaḥ:
The greatest of knower of Dharma. He is called so because all the scriptures consisting of Shrutis and Smrutis form His commandments.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasra
www.facebook.com/groups/vishnusahasranam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్గీత యథాతథం - 1 - 015 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. విషాదయోగం - అధ్యాయము 1 - శ్లోకము 15 🌻*
15
పాంచజన్యం హృషీకేశో
దేవదత్తం ధనంజయ: |
పౌండ్రం దధ్మౌ మహాశంఖం
భీమకర్మా వృకోదర: ||
తాత్పర్యము :
శ్రీ కృష్ణ భగవానుడు పాంచజన్యమనెడి తన శంఖమును పూరించెను; అర్జునుడు దేవదత్తమనెడి తన శంఖమును పూరించెను; భోజన ప్రియుడును, ఘన కార్యములను చేయువాడును అగు భీముడు పాండ్రమనెడి తన మహాశం ఖమునూదెను.
భాష్యము :
భగవంతుని వేరు వేరు కార్యాల వలన ఆయనకు అనేక నామములు ఉన్నవి. ఇక్కడ హృషీకేశ అని పిలవబడినాడు. అనగా అందరి ఇంద్రియములకు ప్రభువు అని. అయితే జీవులు నిరాకారులు అని భావించేవారు ఇంద్రియాలను లెక్కచేయరు. అయితే కృష్ణుడు పరమాత్మరూపములోఅందరి హృదయాలలో ఉండి వారి ఇంద్రియాలను నిర్దేశిస్తూ ఉంటాడు. అయితే జీవియొక్క శరణాగతిని బట్టి ఆ విధమైన సూచనలు ఇస్తూ ఉంటాడు. అయితే శుద్ధభక్తులైన అర్జునుని వంటి వారికి మాత్రం తానే స్వయంగా వారి ఇంద్రియములను నిర్దేశిస్తూ ఉంటాడు. కృష్ణునితో మొదలుగా పాండవుల శంఖానాదములు వారి పక్షపు సైన్యమును ఎంతగానో ఉత్సాహపరచినవి. అయితే ప్రతిపక్షమున అటువంటి ప్రస్తావనే లేదు. అంతేకాక సర్వాధ్యక్షుడైన కృష్ణుడు గాని, విజయలక్ష్మి గాని వారి పక్షాన లేదు. కాబట్టి శంఖానాదముల ద్వారా కౌరవులకు ఓటమి తప్పదని సూచించబడినది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ….
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment