భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 188


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 188 🌹

✍️. శ్రీ బాలగోపాల్

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. - 2 🌻

705. సద్గురువు అన్ని వస్తువుల యందును, అన్ని ప్రాణులయందు, అందరి మానవులయందు అన్ని స్థాయిలందు తానున్నట్లు ప్రవర్తించును.

706. అవతార పురుషుడట్లుగాక తాను ఏక కాలమందే, అన్ని పరిస్థితులలోను అన్నిస్థాయిలందును అన్ని భూమికలలోను అదే వస్తువుగను అదే ప్రాణిగను అదే మానవునిగను అయి యుండును (విశ్వరూపుడగును-విశ్వమేతానయిపోవును.)

707. అవతార మహిమ:-

ఒక్క అవతార పురుషుడు మాత్రమే సృష్టి యందలి అన్ని వస్తువులకు, అన్ని ప్రాణులకు ,అందలి మానవులకు ఏక కాలమందే విశ్వాత్మక మగు ఆధ్యాత్మిక అఘాతము నిచ్చుటలో అనంత సమర్ధుడు.

మానవులలో తానొక మానవుడై, మానవులందరికీ భౌతికముగను, ఆధ్యాత్మికముగను అన్ని పరిస్థితులందును పరోక్షముగా సహాయపడు చుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


06 Mar 2021

No comments:

Post a Comment