✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
🍀. ఆత్మ స్వభావము - 8 🍀
144. ఆవరణ, విక్షేపము వలన మనిషి బంధనాలలో చిక్కుకొని దాని ఫలితముగా తన శరీరమును ఆత్మగా భావించి చావు, పుట్టుకలనే అనేక జన్మలు ఎత్త వలసి వస్తుంది.
145. సంసారమనే వృక్షమునకు అజ్ఞానమనే విత్తనము, తాను శరీరమనే భావన వలన మొలకెత్తి, బంధనాలనే చిగురుటాకులు, నీటి వలన పెంపొంది, శరీరమనే బోదె ప్రాణాధార శక్తితో కూడిన కొమ్మలు, వాటి భాగాలైన మొగ్గలు, సువాసనలు వెదజల్లే పుష్పాలు మొదలగు దుఃఖాలను అనుభవిస్తూ వాటి ఫలితాలైన పండ్లను అనుభవించుటకు ఆ వ్యక్తి ఆత్మ పక్షివలె వాలుతుంది.
146. అనాత్మ యొక్క ఈ బంధనాలలో అజ్ఞానము వలన స్వయంగా చిక్కుకొని, మొదలు చివరలేని సంసార బంధనాలను అనుభవిస్తూ దుఃఖాలనే రైలు ప్రయాణములో పుట్టుక, చావుల రోగములతో వేగుచుండవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 40 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 Nature of Soul - 8 🌻
144. It is from these two powers that man’s bondage has proceeded–beguiled by which he mistakes the body for the Self and wanders (from body to body).
145. Of the tree of Samsara ignorance is the seed, the identification with the body is its sprout, attachment its tender leaves, work its water, the body its trunk, the vital forces its branches, the organs its twigs, the sense-objects its flowers, various miseries due to diverse works are its fruits, and the individual soul is the bird on it.
146. This bondage of the non-Self springs from ignorance, is self-caused, and is described as without beginning and end. It subjects one to the long train of miseries such as birth, death, disease and decrepitude.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
06 Mar 2021
No comments:
Post a Comment