భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 252


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 252 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కాశ్యప మహర్షి - 3 🌻

చివరిభాగము


17. ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకు తన పళ్ళమీద దృష్టి ఉంటే, పళ్ళను గురించే ఆలోచిస్తుంది మనసు. “నా పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, వంకరగా ఉన్నాయి” అని అలోచిస్తుంది. మంచిది అలాగే ఉండనియ్యి. ఆ విధంగా మనస్సును నిగ్రహించిన తరువాత, ఇక యోగికి దాని పీడ తొలగిపోతుంది! ఈ మనస్సనేది అతడిని బాధించకుండా వదిలేసింది కాబట్టి, అప్పుడు యోగంలోకి వెళ్ళ గలుగుతాడు అతదు.

18. అది కోరిన పని తీర్చనంతసేపు, అతడు యోగంలో ఉండడు. ఏమీ చెయ్యలేడు. దానిని నిగ్రహించే విధానం, దానికి సాధ్యం కానిపని అప్పగించటమే! అసాధ్యమైన పని, దుస్సాధ్యమైన పని అప్పజెప్పాలి.

18. మనస్సు నశించిన వెనుక, యోగి బ్రహ్మోన్ముఖుడైపోతాడు. బ్రహ్మవైపు, నిర్గుణమైన బ్రహ్మవస్తువును తాను చేరటం మొదలుపెడతాడు. ఈ మనస్సనేది దానియొక్క చప్పుడు, అల్లరి. అది ఉడిగిపోయిన తరువాత, బ్రహ్మదర్శనం కోసమని వెళతాదు.

19. అనాది అయిన బ్రహ్మము పంచేంద్రియాలకు గ్రాహ్యంకాదు. అది పంచేంద్రియాలకు, వానితోకలిసిన మనోవృత్తికి తెలియదు. కాబట్టి అన్నిటినుంచి మనసు తొలగిపోయి, మనస్సు నశించాక, ఉజ్జ్వలమైన బ్రహ్మవస్తువు అంతటా కూడా కనబడుతుంది.

20. దాంట్లో వెలుగుతున్న తేజస్సులో తాను, తన లోకము, తన బంధువులు, తన ప్రపంచమున చెట్టు, పుట్టలు, ఇంద్రియాలు, తన పూర్వాపరములు, భూత వర్తమాన భవిష్యత్తులు అన్ని కూడా ఆ తేజస్సులో కనబడతాయి. తన లోపల తేజస్సును వెతుక్కుంటాయి, దాంట్లోనూ కనబడతాయి.

21. చివరకు అవి ఏవీ కూడా కనబడవు. కేవలం అదే కనబడుతుంది, అనంతమైన సత్యము. అది కామక్రోధలోభాలకు అతీతంగా ఉంటుంది అది అని చెప్పి, దానిని – ఆ వెలుగును – చూసినవాడే బ్రహ్మవేత్త అని అంటారు, అని చెప్పి కాశ్యపుడికి బ్రహ్మవిద్యా రహస్యం, యోగవిద్యా విధానమంతా ఆ సిద్ధుడు బోధించాడు.

సమాప్తం .... 🙏. శ్రీ శివానంద సద్గురవే నమః

🌹 🌹 🌹 🌹 🌹

18 Mar 2021

No comments:

Post a Comment