భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 243


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 243 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. గౌరముఖ మహర్షి - 1 🌻


1. ఒకసారి గౌరముఖుడు ప్రభాసతీర్థం ప్రంతంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకునే సమయంలో మార్కండేయ మహర్షి వచ్చాడు. అప్పుడు మార్కండేయునితో ‘వేదవిదులు పితృదేవతలని అంటారు కదా, వాళ్ళు ఎవరు” అని అడిగాడు గౌరముఖుడు.

2. “విశ్వానికి తండ్రి విష్ణువే! అతనినుంచి బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మకు ఏడుగురు కొడుకులున్నారు. ఏడుగురూ పుట్టిన తరువాత బ్రహ్మ వాళ్ళతో, ‘నన్నే ఆరాధిస్తూ సృష్టిని పెంచండి’ అని చెప్పితే, వాళ్ళు బ్రహ్మజ్ఞానులు కాబట్టి, సృష్టి అంటే వైముఖ్యము కలిగి బ్రహ్మ ఆజ్ఞను తిరస్కరించి తపస్సుకు వెళ్ళారు. అందుకు బ్రహ్మ ఆగ్రహించి, ‘మీరు ఏ బ్రహ్మజ్ఞానం చేత తరిస్తున్నారో అది మీకు నశిస్తుంది’ అని శపించాడు.

3. “తరువాత వాళ్ళు సంసారంలో ప్రవేశించారు, వాళ్ళకు సంతానం కలిగిన తరువాత, వాళ్ళ బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే నశించిందో, వళ్ళు ఈ లోకాన్ని వదిలిపెట్టి వేరే లోకానికి వెళ్ళిపోయే లక్షణం కలిగిన వాళ్ళాయ్యారు. భూలోకానికి వచ్చిన తరువాత సంతానాన్ని కన్న తరువాత ఈ లోకాన్ని వదిలి పెట్టారు. అది తప్పదు. న్శ్వరమైన దేహములే ఇవి.

4. కాబట్టి వాళ్ళు ఈ లోకాన్ని వదులిపెట్టి ఉత్తమలోకాలకు వెళ్ళిపోయారు. స్వర్గానికి వెళ్ళారు. స్వర్గంలోనే వాళ్ళు నిత్యంగా శాశ్వతంగా ఉండదలచుకున్నారు, కాబట్టి వాళ్ళు తమ కొడుకులతో, ‘నాయనలారా! మమ్మల్ని మీరు మరువకండి! శ్రాద్ధాది పితృకర్మలతో మమ్మల్ని అర్చించండి’ అని చెప్పారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


02 Mar 2021

No comments:

Post a Comment