11) 🌹. శివ మహా పురాణము - 360🌹
12) 🌹 Light On The Path - 112🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 244🌹
14) 🌹 Seeds Of Consciousness - 309🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 184🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 39 / Lalitha Sahasra Namavali - 39🌹
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 39 / Sri Vishnu Sahasranama - 39🌹
18) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 011🌹*
AUDIO - VIDEO
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -162 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 8
*🍀 8 - 4. యోగ కారకములు - 3. విజితేంద్రియః : ఇంద్రియములను బాగుగ నియమించ గలుగువాడు మరియు నిగ్రహానుగ్రహము కలవాడు మాత్రమే యోగి కాగలడని భగవానుడు పలుకుచున్నాడు. నిత్య జీవితమును జ్ఞాన మాధారముగ నిర్వర్తించుటకు పూర్ణ ప్రయత్నము గావింపవలెను. ఇంద్రియములు క్రమముగ వశమగునే కాని, వాటిని వశము చేసుకొనుటకు తీవ్రమగు దీక్షలు పట్టరాదు. ఇట్టి కార్యములకు బలము జ్ఞానము నుండి లభించును. 🍀*
జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా కూటస్థా విజితేంద్రియః |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః || 8
3. విజితేంద్రియః :
ఇంద్రియములను బాగుగ నియమించ గలుగువాడు మరియు నిగ్రహానుగ్రహము కలవాడు మాత్రమే యోగి కాగలడని భగవానుడు పలుకుచున్నాడు. యోగసాధకునకు ఇంద్రియములు సహకరించుటయే గాని, ఇంద్రియములకు లోబడుట జరుగదు.
ఇంద్రియార్థముల వైపు పరుగిడు మనసు జ్ఞాన విజ్ఞానముల ద్వారా వివేకమును, వైరాగ్యమును పొంది ఇంద్రియముల నధిగమించగలదు.
సాధకుడు క్రమపద్ధతిన యోగా
భ్యాసము చేయువాడైనచో, జ్ఞానమును ఆచరణమున పెట్టుటకు మొదట ప్రయత్నము చేయును.
దానివలన వివేక వైరాగ్యములు కలుగవలెను. అట్లు కలుగనంత వరకు ఇంద్రియములే జయించు చుండును. అట్లు జరిగినపుడెల్ల నిరుత్సాహపడక పునః ప్రయత్నము గావించు చుండవలెను.
నిత్య జీవితమును జ్ఞాన మాధారముగ నిర్వర్తించుటకు పూర్ణ ప్రయత్నము గావింపవలెను. ఇంద్రియములు క్రమముగ వశమగునే కాని, వాటిని వశము చేసుకొనుటకు తీవ్రమగు దీక్షలు పట్టరాదు. స్నేహమున లొంగినట్లు ఇతర మార్గము లలో ఇంద్రియములు లొంగవు.
దమించుట యోగమార్గమున నిషిద్ధము. ప్రేమతో, లాలనతో పిల్లలను ఉన్ముఖము చేసుకొనునట్లు, ఇంద్రియములను బాధించక స్నేహపూర్వకముగ నియమములోనికి తెచ్చుకొనవలెను. ఇట్టి కార్యములకు బలము జ్ఞానము నుండి లభించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram Channel 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
Join and Share శ్రీమద్భగవద్గీత Bhagavad-Gita
www.facebook.com/groups/bhagavadgeetha/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 362 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
94. అధ్యాయము - 06
*🌻. పార్వతి పుట్టుట - 2 🌻*
దేవతలిట్లు పలికిరి -
ఓ దుర్గా! నీకు జయము జయము. ఓ మహేశ్వరీ!నీవు జ్ఞానఘనవు, జగన్మాతవు. సత్యము నందు నీవు దృఢముగా ప్రతిష్ఠితవై సద్రూపవై ఉన్నావు. సత్యమే నీ స్వరూపము గనుక, నీవు త్రికాలములయందు సత్స్వరూపిణివి (19). నీవు సత్యమునందుండి సత్యము నుండి అవతరించి సత్యముచే సుప్రీతురాలగుదువు. వ్యావహారిక సత్యమగు జగత్తునకు అధిష్ఠాన సత్యము నీవే. నీది సత్యదర్శనము. నిన్ను మేము శరణు పొందుచున్నాము (20).
హే శివప్రియే!మహేశ్వరీ! నీవు దేవతల దుఃఖమును హరించెదవు. ముల్లోకములకు తల్లివి, శర్వుని పత్నివి అగు నీవు సర్వమును వ్యాపించియున్నావు. నీకు భక్తులయందు ప్రేమ మెండు (21). ఓ త్రిలోకములకు అధీశ్వరి యగు మహేశ్వరీ! నీవు అవతరించి దేవకార్యమును చేయుము. నీ దయచే మేము అందరము నాథవంతులమైతిమి (22).
ఉత్తమ సుఖములను పొందు వారందరూ ఆ సుఖములను నీనుండియే పొందుచున్నారు. ముల్లోకములలో నీవు లేనిదే ఏదియూ శోభించ జాలదు (23).
బ్రహ్మ ఇట్లు పలికెను -
దేవతలు ఈ తీరున గర్భమునందున్న మహేశ్వరిని పరి పరి విధముల స్తుతించి, ప్రసన్నమగు మనస్సు గలవారై, అపుడు తమ తమ ధామములకు వెళ్లిరి (24). తొమ్మిది మాసములు గడచి పదియవ మాసము పూర్తియగు నంతవరకు, జగన్మాతయగు కాళీదేవి గర్భస్థురాలై ఉండెను (25).
అపుడు ఒకనొక శుభముహూర్తమునందు, నక్షత్రములు గ్రహములు శాంతములై యుండగా, ఆకాశము ప్రసన్నమై దిక్కులన్నియు ప్రకాశించుచుండగా (26),వనములతో గ్రామములతో సముద్రములతో కూడిన భూమి మంగళములతో నిండియుండెను. సరస్సులలో, నదులలో, దిగుడు బావులలో పద్మములు వికసించియుండెను (27).
ఓ మహర్షీ! సుఖమగు స్పర్శ కలిగిన గాలులు అన్ని దిక్కుల యందు వీచినవి. సత్పురుషులందరు ఆనందించిరి. దుష్టులు శీఘ్రమే దుఃఖితులైరి (28). దేవతలు అంతరిక్షములోనికి దుందుభలను వాయించిరి. అపుడచట పుష్పవృష్టి కురిసెను. గంధర్వ శ్రేష్ఠులు గానమును చేసిరి (29). ఆకాశమునందు విద్యాధరస్త్రీలు, అప్సరసలు కూడ నాట్యమును చేసిరి. అపుడు దేవతలు మొదలగువారు అంతరిక్షములో గొప్ప ఉత్సవమును చేసుకొనిరి (30).
ఆ సమయములో పూర్వము సతీ రూపముగా అవతరించిన శివశక్తి స్వీయరూపముతో మేన యెదుట సాక్షాత్కరించెను (31). వసంత ఋతువులో చైత్రమాసములో నవమీ తిథినాడు మృగశిరా నక్షత్రమునందు అర్ధరాత్రి సమయమునందు చంద్రమండలము నుండి ఆకాశగంగవలె ఆ దేవి జన్మించెను (32).
ఆ సమయములో ఆ స్వరూపముతో ఉమాదేవి మేన యొక్క గర్భము నుండి, సముద్రము నుండి లక్ష్మీదేవి వలె జన్మించెను (33). అపుడామె జన్మించగానే జగత్తు ప్రసన్నమాయెను. అనుకూలము, శుభగంధముతో గూడినది అగు వాయువు మెల్లగా వీచెను (34).
జలవర్షముతో బాటు పుష్పవర్షము కూడ కురిసెను. అగ్నులు ప్రశాంతముగా ప్రజ్వరిల్లినవి. మేఘములు గర్జించెను (35). ఆమె జన్మించిన ఆ సమయములో హిమవంతుని రాజధాని యందు సర్వము సుసంపన్నమగుటయే గాక, సర్వదుఃఖములు క్షయమయ్యెను (36).
ఆ సమయములో విష్ణువు మొదలగు దేవతలందరు అచటకు వచ్చి ఆనందించి ప్రీతితో జగన్మాతను దర్శించిరి (37). జగన్మాత, శివునకు ప్రియురాలు, దివ్యమగు రూపము గలది, మహామాయ, శివలోకమునందు నివసించునది, శుభకరి అగు ఆ కాళికను వారు స్తుతించిరి (38).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 112 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 8 - THE 20th RULE
*🌻 20. Seek it not by any one road. - 5 🌻*
426. In former times we may have been murderers or drunkards; if these things have been our particular experience, we now know them as wrong because we did them before we knew better, and found that their results brought suffering.
At a further stage we learned that such things delay our progress, and are therefore wrong, but without some experience we should never have realized this consciously. No amount of advice could have given us the vivid knowledge we have gained from experience.
Having learnt our lesson along one line we never again under any stress of temptation make that particular mistake. You would never be safe if there were any possibility of your falling. You must have conscious knowledge of these things; the typical thing you have to know, the fundamental experience you must have, if you wish to be safe and helpful.
427. C.W.L. – Here again the Chohan reminds us that the object of occult training is not to produce merely good men, but great spiritual powers who can work intelligently for the Logos. Moral goodness is certainly a prerequisite, but it is useless alone.
428. When a man begins his evolution in the quite primitive stage he has no ideas of right and wrong, so we could hardly speak of him as having vices and virtues. The salvage is after all nothing more than a centre of outrushing energy – the irresponsible kind of outrush of which we see so much in the lower kingdoms.
A creature like a fly has a very tiny body, but it is a mass of energy which is terrible as compared with its size. Imagine an entity of our own size endowed with as much energy in proportion and as little idea of what to do with it – it would be a terrible, wild thing, a source of danger to all around.
429. The savage has that kind of energy. It bursts out in fighting and in lusts of all kinds, which are certainly vices from our point of view, although we are hardly justified in regarding them as such in him.
He does not murder from any sort of unholy, vitiated pleasure in murder, as has happened with people of higher races. He certainly has a kind of pride in being able to dominate and kill other people, and in that way he works off a vast amount of energy which, many thousands of years later, will be directed into useful channels.
He has to learn how to handle that energy; how to let it run through him without doing hurt to himself or others, but that is a matter of long training and development, and of gaining control of the vehicles by the ego.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 243 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. గౌరముఖ మహర్షి - 1 🌻*
1. ఒకసారి గౌరముఖుడు ప్రభాసతీర్థం ప్రంతంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకునే సమయంలో మార్కండేయ మహర్షి వచ్చాడు. అప్పుడు మార్కండేయునితో ‘వేదవిదులు పితృదేవతలని అంటారు కదా, వాళ్ళు ఎవరు” అని అడిగాడు గౌరముఖుడు.
2. “విశ్వానికి తండ్రి విష్ణువే! అతనినుంచి బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మకు ఏడుగురు కొడుకులున్నారు. ఏడుగురూ పుట్టిన తరువాత బ్రహ్మ వాళ్ళతో, ‘నన్నే ఆరాధిస్తూ సృష్టిని పెంచండి’ అని చెప్పితే, వాళ్ళు బ్రహ్మజ్ఞానులు కాబట్టి, సృష్టి అంటే వైముఖ్యము కలిగి బ్రహ్మ ఆజ్ఞను తిరస్కరించి తపస్సుకు వెళ్ళారు. అందుకు బ్రహ్మ ఆగ్రహించి, ‘మీరు ఏ బ్రహ్మజ్ఞానం చేత తరిస్తున్నారో అది మీకు నశిస్తుంది’ అని శపించాడు.
3. “తరువాత వాళ్ళు సంసారంలో ప్రవేశించారు, వాళ్ళకు సంతానం కలిగిన తరువాత, వాళ్ళ బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే నశించిందో, వళ్ళు ఈ లోకాన్ని వదిలిపెట్టి వేరే లోకానికి వెళ్ళిపోయే లక్షణం కలిగిన వాళ్ళాయ్యారు. భూలోకానికి వచ్చిన తరువాత సంతానాన్ని కన్న తరువాత ఈ లోకాన్ని వదిలి పెట్టారు. అది తప్పదు. న్శ్వరమైన దేహములే ఇవి.
4. కాబట్టి వాళ్ళు ఈ లోకాన్ని వదులిపెట్టి ఉత్తమలోకాలకు వెళ్ళిపోయారు. స్వర్గానికి వెళ్ళారు. స్వర్గంలోనే వాళ్ళు నిత్యంగా శాశ్వతంగా ఉండదలచుకున్నారు, కాబట్టి వాళ్ళు తమ కొడుకులతో, ‘నాయనలారా! మమ్మల్ని మీరు మరువకండి! శ్రాద్ధాది పితృకర్మలతో మమ్మల్ని అర్చించండి’ అని చెప్పారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 309 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 158. Be one with the Self, the 'I am'. If necessary discard the words 'I am', even without them you know 'you are'. 🌻*
You have to totally identify yourself with the indwelling knowledge 'I am' in you. This knowledge 'I am', or sense of 'presence' has spontaneously dawned on you; it came without your asking or willing it to be so.
When it came it was wordless, just a feeling of 'being', and as long as it prevailed words were not required and life went on. It was only when your conditioning began that words and language intruded and soon took over.
This takeover has been so complete that you cannot conceive of a life without words, which now exist as concepts. So, in order to make your meditation effective, you are asked to discard the words 'I am', because even without them 'you are'.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness
Join and Share
DAILY SATSANG WISDOM SEEDS OF CONSCIOUSNESS
www.facebook.com/groups/dailysatsangwisdom/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 184 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - అవతార పురుషుడు - 6 🌻*
693. నిజమగు అవతారతత్వమును సామాన్యుడు ఆకళింపు చేసికొనలేక, భగవంతుడు మానవుడయ్యెనని గ్రహించి అంతటితో తృప్తి జెంది ఊరకుండును.
694. అవతార పురుషుడు అదియే అయిపోవును.
ఉదా:- “ఎవ్వనిచే జనించు..... సర్వము తానైన వాడెవ్వడు”......
సద్గురువు అదిగానే వ్యవహరించును.
అవతార పురుషుడు తానే ప్రపంచమై పోవును.
------------------------------------
Notes:- సద్గురువు సమస్తమును తానై వ్యవహరించును, తానై ప్రవర్తించును. అవతారము సర్వమును తానేయగును. (విశ్వరూపుడగును)
695. అవతాన పురుషు డెన్నడును వ్యక్తుల కర్మను తీసివేయడు, కాని ఆతని దైవత్వము విశ్వాత్మకముగా పనిచేయును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 39 / Sri Lalita Sahasranamavali - Meaning - 39 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 39. ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ ।*
*సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ॥ 39 ॥ 🍀*
🍀 103. ఆజ్ఞాచక్రాంతళస్థా -
ఆజ్ఞాచక్రము యొక్క మధ్యలో ఉండునది.
🍀 104. రుద్రగ్రంథి విభేదినీ -
రుద్రగ్రంథిని విడగొట్టునది.
🍀 105. సహస్త్రారాంభుజారూఢా -
వెయ్యి దళములు గల పద్మమును అధిష్టించి యున్నది.
🍀 106. సుధాసారాభివర్షిణీ -
అమృతము యొక్క ధారాపాత వర్షమును కురిపించునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 39 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 39. ājñā-cakrāntarālasthā rudragranthi-vibhedinī |*
*sahasrārāmbujārūḍhā sudhā-sārābhivarṣiṇī || 39 || 🌻*
🌻 103 ) Agna chakarantharalastha -
She who lives in between two eye lids in the form of she who orders
🌻 104 ) Rudra grandhi vibhedini -
She who breaks the ties of Rudra grandhi i.e she who helps us cross the ties due to our violent thoughts and nature
🌻 105 ) Sahararambhujarooda -
She who has climbed sahasrara the thousand petalled lotus which is the point of ultimate awakening.
🌻 106 ) Sudha sarabhi varshini -
She who makes nectar flow in all our nerves from sahasrara i.e. she who gives the very pleasant experience of the ultimate.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
Join and Share
శ్రీ లలితా చైతన్య విజ్ఞానం Sri Lalitha Chaitanya Vijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 39 / Sri Vishnu Sahasra Namavali - 39 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*సింహ రాశి- మఖ నక్షత్ర 3వ పాద శ్లోకం*
*🍀 39. అతులశ్శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః।*
*సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః॥ 🍀*
🍀 355) అతుల: -
సాటిలేని వాడు.
🍀 356) శరభ: -
శరీరములందు ప్రత్యగాత్మగా ప్రకాశించువాడు.
🍀 357) భీమ: - భీకరమైన శక్తి సంపన్నుడు.
🍀 358) సమయజ్ఞ: -
సర్వులను సమభావముతో దర్శించుటయే తన పూజగా భావించువాడు.
🍀 359) హవిర్హరి: -
యజ్ఞములలో హవిర్భాగమును గ్రహించువాడు.
🍀 360) సర్వలక్షణ లక్షణ్య: -
సర్వప్రమాణములచే సిద్ధించు జ్ఞానము చేత నిర్ణయింప బడినవాడు.
🍀 361) లక్ష్మీవాన్ -
సదా లక్ష్మీదేవి తన వక్షస్థలమందు కలిగినవాడు.
🍀 362) సమితింజయ: -
యుద్ధమున జయించినవాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 39 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Simha Rasi, Makha 3rd Padam*
*🌻 39. atulaḥ śarabhō bhīmaḥ samayajñō havirhariḥ |*
*sarvalakṣaṇalakṣaṇyō lakṣmīvān samitiñjayaḥ || 39 || 🌻*
🌻 355. Atulaḥ:
One who cannot be compared to anything else.
🌻 356. Śarabhaḥ:
The body is called 'Sara' as it is perishable.
🌻 357. Bhīmaḥ:
One of whom everyone is afraid.
🌻 358. Samayajñaḥ:
One who knows the time for creation, sustentation and dissolution.
🌻 359. Havir-hariḥ:
One who takes the portion of offerings (Havis) in Yajnas.
🌻 360. Sarva-lakṣaṇa-lakṣaṇyaḥ:
The supreme knowledge obtained through all criteria of knowledge i.e. Paramatma.
🌻 361. Lakṣmīvān:
One on whose chest the Goddess Lakshmi is always residing.
🌻 362. Samitiñjayaḥ:
One who is vicotious in Samiti or war.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasra
Join and share.....
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation
www.facebook.com/groups/vishnusahasranam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్గీత యథాతథం - 1 - 011 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. విషాదయోగం - అధ్యాయము 1 - శ్లోకము 11 🌻*
11
*అయనేషు చ సర్వేషు యథాభాగ మవస్థితా: |*
*భీష్మమేవాభిరక్షంతు భవంత: సర్వ ఏవ హి ||*
🌻. తాత్పర్యము :
సేనా వ్యూహ ద్వారమునందలి మీ ముఖ్య స్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్‌మ దేవునకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసియున్నది.
🌻. భాష్యము :
దుర్యోధనుడు భీష్ముడి పరాక్రమమును కొనియాడిన తర్వాత మిగిలిన వారు చిన్నబుచ్చుకోకుండా ఉండేందుకు వారందరూ ఎంత ముఖ్యమో తెలియజేయుచుండెను. వారు వారు తమ స్థానాలనందుండి భీష్‌ముడిని అన్నివైపుల నుండి కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుచేసెను. దీని ద్వారా దుర్యోధనుడు తన విజయం భీష్‌ముడి మీదే ఆధారపడి ఉందని స్పష్టపరచుచున్నాడు. భీష్‌మునికి, ద్రోణాచార్యునికి పాండవులంటే ప్రత్యేక అభిమానమున్నా, ద్రౌపది వస్త్రాపహరణ సమయములో మౌన ము వహించుట వలన తన పక్షాన ఈ రోజున కూడా పోరాడగలరనే విశ్వాసము దుర్యోధనునికి ఉన్నది. అదే తన విజయానికి సోపానమని భావించుచున్నాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ….
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram Channel 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
Join and Share శ్రీమద్భగవద్గీత Bhagavad-Gita
www.facebook.com/groups/bhagavadgeetha/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment