వివేక చూడామణి - 36 / Viveka Chudamani - 36
🌹. వివేక చూడామణి - 36 / Viveka Chudamani - 36 🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
🍀. ఆత్మ స్వభావము - 4 🍀
133. సాక్షిగా ఉన్న ఆత్మ మనస్సు యొక్క మార్పులను, అహాన్ని మరియు శరీరములోని వివిధ అంగములు, ప్రాణ శక్తిని గమనిస్తూ వాటి ఆకారములను పొందుతూ; ఎలా అయితే ఇనుప గుండు అగ్నిని తనలో నింపుకుని మార్పులేక ఉంటుందో అలా వానిలో ఐక్యమై గమనిస్తూంది. కాని అది ఏమి చేయదు, దానిలో ఏ మార్పు రాదు.
134. ఆత్మ ఎప్పుడు పుట్టదు, గిట్టదు, పెరగదు, తరగదు మరియు ఏ మార్పు చెందదు. శాశ్వతత్వము కలిగి ఉంటుంది. ఈ శరీరము నశించినప్పటికి ఆత్మకు చావులేదు. ఆకాశములోని ఘటము పగిలినప్పటికి అందులోని ఘటాకాశము విశ్వములో కలసినట్లు, ఈ ఆత్మ సర్వ స్వతంత్రము. అన్నింటిని అధిగమిస్తుంది, అన్నింటిలో ఉంటూ వాటికి అతీతముగా ఉంటుంది.
135. ఈ అత్యున్నతమైన ఆత్మ సదా మార్పు చెందే ప్రకృతి కంటే భిన్నమైనది. ఇది జ్ఞానసారము. పూర్తిగా ఈ భౌతిక ప్రపంచాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఎఱుక స్థితిలోనూ మరియు ఇతర స్థితులలోనూ అహం యొక్క ప్రభావమును బుద్ది, సాక్షిగా గమనించు చున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 36 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 Nature of Soul - 4 🌻
133. The Knower of the modifications of mind and egoism, and of the activities of the body, the organs and Pranas, apparently taking their forms, like the fire in a ball of iron; It neither acts nor is subject to change in the least.
134. It is neither born nor dies, It neither grows nor decays, nor does It undergo any change, being eternal. It does not cease to exist even when this body is destroyed, like the sky in a jar (after it is broken), for It is independent.
135. The Supreme Self, different from the Prakriti and its modifications, of the essence of Pure Knowledge, and Absolute, directly manifests this entire gross and subtle universe, in the waking and other states, as the substratum of the persistent sense of egoism, and manifests Itself as the Witness of the Buddhi, the determinative faculty.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
02 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment