సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము
మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా ।
మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55 ॥
🌻 224. 'మహాసిద్ధి'🌻
ఏడు సిద్ధులను అధిష్ఠించి యుండు ఎనిమిదవ సిద్ధియే శ్రీదేవి అని భావము.
షట్చక్రములను అధిష్ఠించి ఏడవదిగా సహస్రార మున్నది. సహస్రారమును కూడా అధిష్ఠించి అన్నిటి యందు సమానత్వమును చూపునది శ్రీమాత.
రసస్వరూపుడు భగవంతుడు తనయందు ప్రకాశించుట మొదటి సిద్ది. ఇదియే భక్తిరసము. దేవాసుర తత్త్వములచే తిరస్కరింపబడ కుండుట రెండవ సిద్ధి. దేవాసురులు సృష్టి ప్రయోజనమునే కాపాడు చున్నారు. అసురులు స్థూలలోకమును రక్షించుదురు. కావున వారిని రక్షసులని కూడ అందురు. సురలు సూక్ష్మలోకములను నిర్వర్తింతురు.
స్థూల సూక్ష్మలోకములలో ఆదరింపబడుట ఒక సిద్ధి. స్థూలమున ఆదరింపబడు వారు సూక్ష్మమున అంతగ ఆదరింపబడరు. సూక్ష్మమున ఆదరింపబడు వారు స్థూలమున అంతగ ఆదరింపబడరు. రెంటి యందు ఆదరింపబడుట ఒక సిద్ధి. ఉత్తమత్వము, అధమత్వము అనెడి భావములకు లోబడక యుండుట, అధికులని, అధములని మనసు చేయు భావములకు
లోబడకుండుట మూడవ సిద్ధి.
ఈ భేదములు కొంతవఱకే సత్యములు. ఇట్టి వారికి తరతమ భేదము లుండవు. 'బ్రాహ్మణుడు, శూద్రుడు, కుక్క, కుక్క మాంసము తినువాడు మొదలగు భావ భేదము లేనివాడు పండితుడు' అని కృష్ణుడు గీత యందు ప్రకటించుటలోని అంతరార్థ మిదియే.
అట్లే సుఖ దుఃఖముల యందు సమాన భావము కలిగి యుండుట నాలుగవ సిద్ధి. హరిశ్చంద్రాదులు ఈ కోవలోనికి చెందినవారే. కాంతి బలముల ఆధిక్యము పంచమ సిద్ధి. కాంతి బలముల యందు కూడ భేదము లున్నవి. శక్తి, జ్ఞానము, క్రియా శీలతల యందు భేదములు గోచరించవు. ఇవి అన్నియూ అమ్మ శక్తిలోని స్థితి భేదములే. శక్తివంతులకు, ఆత్మవంతులకు పరిణామమున భేదమున్నది.
శక్తివంతుని శక్తి ప్రకటితము. ఆత్మవంతుని శక్తి అప్రకటితము. కాలమును, దేశమును, కర్తవ్యమునుబట్టి ఆత్మవంతుల నుండి శక్తి ప్రకటిత మగుచుండును. శక్తివంతుల శక్తి వారి నధిష్ఠించి యుండును. అవసరమగుచో ఆయుధము ప్రకటితమగుట, అవసర మగుచో జ్ఞానము, క్రియ ప్రకటింపబడుట ఆత్మవంతుల యందు కానవచ్చును. ఆత్మవంతుల యందు శక్తి యిమిడి యుండును. వారు శక్తికి లోబడి యుండరు. శక్తివంతులు శక్తికి లోబడి యుందురు. ఇట్టి వారికే భేద భావ మెక్కువగ నుండును.
శక్తివంతుడగు రావణునకు రాముని యందు చులకన భావము కలదు. ఆత్మవంతుడగు రామునకు అట్టి భావము లేదు. అతనికి గుహుడు, జటాయువు, సుగ్రీవుడు, వానరులు, శబరి, రావణుడు వంటి వారందరూ ఆత్మలే. వారి ప్రవర్తనను బట్టి వారితో ప్రతిస్పందించెను. శబరికి వాత్సల్యమూర్తి వలె గోచరించు రాముడు, రావణునికి ప్రళయకాల రుద్రునివలె గోచరించెను. మిత్రుని వలె సుగ్రీవునకు గోచరించు రాముడు, దేవుని వలె హనుమంతునికి గోచరించెను. ఈ పంచమ సిద్ధి కలవారు ఎవరెట్లు చూచిన అట్లు గోచరింప బడుదురు. వెట్టి గొల్లలతో గొల్లవాని వలె నున్న శ్రీకృష్ణుడు మహాజ్ఞానులగు భీష్మాదులకు విశ్వరూపియై గోచరించును.
పరమాత్మతో నిత్యానుసంధానము కలిగియుండుట ఆరవ సిద్ధి. అనన్య చింతన, పర్యుపాసన, నిత్య అభియుక్తత అనుచు ఈ సిద్ధినే శ్రీకృష్ణుడు తొమ్మిదవ అధ్యాయమున తెలిపినాడు. వీరందరును ఋషి గణములవంటి వారు. ఋషులు ఎప్పుడునూ దైవాను సంధానులై
యుందురు. దైవ ప్రణాళికను నిర్వర్తించుచు నుందురు. వారి చర్యలన్నియునూ దివ్య ప్రణాళికలోని భాగమే.
దైవేచ్ఛానుసారము ఆకాశ సంచారము చేయుట ఏడవ సిద్ధి. నారదుడు, తుంబురుడు, హనుమంతుడు, గరుత్మంతుడు యిట్టి విహారము చేయు సిద్ధులు.
అంతట అన్నిట సమాన ప్రేమభావము ఎనిమిదవ సిద్ధి. ఇదియే మహాసిద్ధి. శ్రీమాత అట్టిది. బ్రహ్మర్షుల నుండి మూర్ఖులు, దుష్టుల వరకు అందరియందు చూపునది ప్రేమతత్త్వమే. ఉద్ధరించు భావమే. ఇదియే మహాసిద్ధి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 224 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Mahā-siddhiḥ महा-सिद्धिः (224) 🌻
She is the ultimate form of attainment. Siddhi means supreme felicity, bliss, beatitude, complete sanctification, final emancipation obtained through penance. There are eight important siddhi-s known as super-human powers or aśtamā sidhhi-s (aśtamā means eight). These eight sidhhi-s are aṇimā, laghimā, prāptiḥ, prākāmyam, mahimā, īśitvaṃ, vaśitvaṃ, kāmāvasāyitā.
Kṛṣṇa says in Uddhava Gita (X.3) “Those who are expert in concentration and yoga call the powers eighteen in number. Eight of these are pertaining to me and the remaining ten are to a perfection of sattva.
Minuteness, immensity, lightness of the body (aṇimā, laghimā, mahimā), connection of being with his organs known as attainment (prāptiḥ), capacity to derive enjoyment from everything heard or seen (prākāmyam), exerting an influence on all, known as rulership (īśitvaṃ), non-attachment to sense objects called self control (vaśitvaṃ) and consummation of any and every desire (vaśitvaṃ) are considered as my natural powers.”
But these super human powers are trivial to a true devotee. Undoubtedly She confers on Her devotees who pursue the path of meditation, these aṣṭama siddhi-s. But a true devotee does not bother about these super human powers and dumps these illusionary powers with the sole aim of realizing Her.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
02 Mar 2021
No comments:
Post a Comment