దేవాపి మహర్షి బోధనలు - 47


🌹. దేవాపి మహర్షి బోధనలు - 47 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 32. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 1 🌻


ఈ కాలమున పరమగురువుల శిష్యులము అనుకునేవారు, సాధకుల మనుకొనేవారు, వారిని గూర్చి పరమగురువులు చెప్పినట్లుగా ఎన్నియో ముచ్చట్లు పలుకుతారు. అవి అన్నియు నిజమునకు భ్రాంతి దర్శనములే. వీటి నుండి బయటపడక పోయినచో ఏ సాధకుడూ పరమ గురువుల రాజ్యమున ఒక సైనికునిగా నిలబడలేడు. పరమ గురువు లిట్లు తెలుపుదురు.

“నీ జీవితమునకు నీవే స్వామిత్వము వహింపుము. నీవే నీ సమస్యలను విచక్షణతో పరిష్కరించుకొనుము. తప్పులు చేసినచో తప్పించుకొనక సరిదిద్దుకొనుము. నిన్ను నీవు మరచి యితరులకే మైనా తోడ్పడగలవేమో చూడుము. నీయందు తప్పులు పట్టుటకు కానీ, నిన్ను శ్లాఘించుటకు కాని, బుజ్జగించుటకు కాని వీలుపడదు. అట్లు చేసినచో నీ అభివృద్ధిని ఆటంకపరచిన వారమగుదుము.

ఎట్టి పరిస్థితులలోనూ విచక్షణను కోల్పోకుము. మరపు రానీయకుము. కర్తవ్యమున నిష్కర్షగ జీవింపుము.”

అది 1919వ సంవత్సరం. కార్తీకమాసం. ఆహ్లాదకరమైన శరదృతువు కన్నుల కింపు గావించుచున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


02 Mar 2021

No comments:

Post a Comment