భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 184


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 184 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - అవతార పురుషుడు - 6 🌻

693. నిజమగు అవతారతత్వమును సామాన్యుడు ఆకళింపు చేసికొనలేక, భగవంతుడు మానవుడయ్యెనని గ్రహించి అంతటితో తృప్తి జెంది ఊరకుండును.

694. అవతార పురుషుడు అదియే అయిపోవును.

ఉదా:- “ఎవ్వనిచే జనించు..... సర్వము తానైన వాడెవ్వడు”......

సద్గురువు అదిగానే వ్యవహరించును.

అవతార పురుషుడు తానే ప్రపంచమై పోవును.

------------------------------------

Notes:- సద్గురువు సమస్తమును తానై వ్యవహరించును, తానై ప్రవర్తించును. అవతారము సర్వమును తానేయగును. (విశ్వరూపుడగును)

695. అవతాన పురుషు డెన్నడును వ్యక్తుల కర్మను తీసివేయడు, కాని ఆతని దైవత్వము విశ్వాత్మకముగా పనిచేయును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



02 Mar 2021

No comments:

Post a Comment