భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 244
🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 244 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. గౌరముఖ మహర్షి - 2 🌻
5. వాళ్ళే మొట్టమొదట స్వర్గానికి వెళ్ళిన – భూమిమీద పుత్రులనుకని వెళ్ళిపోయిన – మొట్టమొదటి పితృదేవతలు. వాళ్ళే సప్తర్షులు. వాళ్ళల్లో మూర్తిమంతంగా ఉండేవాళ్ళూ నలుగురు. ఆ మూర్తులు నిజతేజస్వరూపులుగా ఉన్నారు.
6. ఆ నలుగురూ భూలోకంలో ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలో అక్కడా ఉన్నారు. తరువాత వాళ్ళు ఆకడనుంచే భూలోకంలో ఆరాధన పొందారు. ఆ తరువాత కేవలం భూలోకానికివచ్చి శుద్ధ బ్రహ్మజ్ఞానంతో వాళ్ళు పునరావృత్తిరహితమైన యోగసిద్ధినిపొందారు. వీళ్ళనే పితృదేవతలంటారు” అని చెప్పాడు మార్కండేయుడు.
7. ఇంకా, “ఇది ప్రథమ పితృసర్గం. ఈ ప్రకారంగా అనేకమంది పితరులు సప్తలోకాల్లో ఉన్నారు. ఇక్కడకువచ్చి, ఇక్కడనుండివెళ్ళి దివ్యత్వంపొందిన ఉత్తమలోకవాసులందరూ పితృదేవతలు. వాళ్ళందరూ అనేక స్వర్గములలో ఉన్నారు.
8. భూలోకవాసులైన జనులు, భువర్లోకవాసులైన పితృలోకవాసులను పూజిస్తారు” అన్నాడు. “భువర్లోకవాసులు, మరీచాదులు మొదలుగాగల సువర్లోకవాసులు, కల్పోపవాసిసంజ్ఞులైన మహర్లోకవాసులందరూ – జనలోక వాసులైనటువంటి సనకాది పితరులను కొలుస్తారు.
9. వాళ్ళ పైలోకవాసంలో ఉండేవాళ్ళను కొలుస్తారు. వాళ్ళను ఆరాధిస్తారు. పితృసర్గమని దీనికిపేరు. ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోవటంచేత, వారు ఇక్కడ మానవజన్మ పరంపరకు కారణమవుతున్నారు. వాళ్ళను ఆరాధించమని పితృదేవతల యొక్క ఆరాధనా విధివిధానం ఇవ్వబడింది” అని చెప్పాడు మార్కండేయుడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
03 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment