సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా ।
మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55 ॥
🌻 225. 'మహాయోగేశ్వరేశ్వరీ' 🌻
యోగీశ్వరులకు కూడ ఈశ్వరత్వము వహించునది శ్రీమాత అని అర్థము. యోగులకు యోగియైన వానిని యోగీశ్వరు డందురు. యోగీశ్వరునకు కూడ ఈశ్వరి శ్రీమాత.
శ్రీమాత, శ్రీకృష్ణుడు యోగీశ్వరి, యోగేశ్వరులు. యోగేశ్వరుడనగా యోగీశ్వరులకు ఈశ్వరుడు. దీని సోపానక్రమము ఈ విధముగ నున్నది. యోగీ ఆ యోగీశ్వరుడు ఆ యోగీశ్వరేశ్వరుడు లేక యోగేశ్వరుడు. శివుడు యోగేశ్వరులలో మొదటివాడు.
సృష్టి ఆరంభముననే కర్తవ్యము పూర్తి గావించి తపస్సున స్థిరబడినవాడు. ఆది గురువు. అతనిని గూర్చి తపస్సు చేసి శ్రీమాత అతనిని చేరినది. వారిరువురును యోగేశ్వరీ యోగీశ్వరులు. వారి అవతరణమే శ్రీకృష్ణుడు. ఇది ఉత్తమోత్తమ చైతన్య స్థితి. అటుపైన అంతయూ పరమే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 225 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Mahā-yogeśvareśvarī महा-योगेश्वरेश्वरी (225) 🌻
She is the ruler of yoga and sought after by great yogis. Yoga is the practice by which an individual consciousness is merged with the universal consciousness.
Yoga means to unite. It is the union of body, mind and Spirit. Those who have attained this state are called yogis. Such yogis seek Her benediction through meditation to stay attuned with Her.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
03 Mar 2021
No comments:
Post a Comment