3-MARCH-2021 EVENING

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 163🌹  
11) 🌹. శివ మహా పురాణము - 361🌹 
12) 🌹 Light On The Path - 113🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 245🌹 
14) 🌹 Seeds Of Consciousness - 310🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 185🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 40 / Lalitha Sahasra Namavali - 40🌹 
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 40 / Sri Vishnu Sahasranama - 40🌹
18) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 012 🌹*
AUDIO - VIDEO 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -163 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 8

*🍀 8 - 5. యోగ కారకములు - 4. సమలోష్టాశ్మకాంచనః : లోహమును, రాయిని, బంగారమును సమానముగ చూచుట ఎరిగినవాడే యోగారూఢుడైన యోగి అని భగవంతుడు చెప్పుచున్నాడు. దీని రహస్య మేమనగ, అన్నిటి యందు అంతర్యామిదైవ మొక్క రీతిగనే యున్నాడు. అంతర్యామి దైవమును దర్శించువాడు యోగి. చైతన్యము యొక్క వికాసమును బట్టి ప్రకాశము, ప్రభావము వేరు వేరుగ నుండును. జీవుల యందు కూడ వారి వారి ప్రకాశమును బట్టి, వారి వారి విలువ లేర్పడుచుండును. ఈ చైతన్య విలాసము వెనుకగల అస్థిత్వమును దర్శించువాడు నిజమగు యోగియని శ్రీకృష్ణుని భావము. 🍀*

జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా కూటస్థా విజితేంద్రియః |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః || 8

4. సమలోష్టాశ్మకాంచనః : 
లోష్ట మనగ లోహము లేక ఇనుప ముక్క. అశ్మము అనగ రాయి (గుండ్రాయి). కాంచన మనగ బంగారము. లోహమును, రాయిని, బంగారమును సమానముగ చూచుట ఎరిగినవాడే యోగారూఢుడైన యోగి అని భగవంతుడు చెప్పుచున్నాడు. రాయి కన్న లోహము, లోహము కన్న బంగారము మానవుల దృష్టిలో విలువైనవి. 

అట్లే శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు కూడ హెచ్చుతగ్గులతో పరిగణింపబడు చున్నాడు. అట్లే విద్యావంతుడు, అజ్ఞాని భేద దృష్టితో చూడబడుచున్నాడు. ఇట్లెన్నియో అసంఖ్యాకములైన విషయములు భేదబుద్దితో చూడ బడుచున్నవి. ధనికుడు, దరిద్రుడు, అధికారి, సామాన్యుడు ఇత్యాదివి కూడ నట్లే. 

వీటన్నిటిని సమానముగ చూచుట ఎట్లు? అన్నమును, అశుద్ధమును సమానముగ చూడదగునా? ఇది సాధ్యపడు విషయమా? సృష్టియందు దేని విలువ దానికున్నది గదా! గుఱ్ఱము, గాడిద ఒకటి ఎట్లగును? ఉప్పు, కప్పురము ఒక్క పోలిక నున్న వాని రుచులు వేరు కదా! దుర్జనులకు, సజ్జనులకు, సామాన్యులకు భేదము లేదా? ఇత్యాది ప్రశ్నలెన్నియో పుట్టుకొని వచ్చును. 

పై తెలిపిన వన్నియు సమానమని చెప్పుట మెట్టవేదాంతమే అగును. అది ఆచరణ యుక్తము కూడ కాదు. మరి భగవంతుడిట్లు చెప్పినాడేమి? దీని రహస్య మేమనగ, అన్నిటి యందు అంతర్యామి దైవ మొక్క రీతిగనే యున్నాడు. అంతర్యామి దైవమును దర్శించువాడు యోగి. పై తెలిపిన అన్ని అంశములు స్థితిగొని యున్నవి గదా. స్థితి విషయమున అన్ని అంశములు ఒక్కటియే. రాజు ఉన్నాడు. పేద ఉన్నాడు. బ్రాహ్మణుడు ఉన్నాడు. అట్లే క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉన్నారు. రాయి ఉన్నది. రాము డున్నాడు. 

ఇచ్చట గమనించవలసిన విషయము “ఉండుట" అను విషయము. దీనిని స్థితి అందురు. ఉండుట అన్నిటియందు సమానమే. కాని ఆయా వస్తువుల చైతన్య వికాసమునందు భేదము కలదు. కొన్నిటి యందు చైతన్యము ఎక్కువ వికసించి యుండును. కొన్నిటి యందు తక్కువ వికసించి యుండును. 

చైతన్యము యొక్క వికాసమును బట్టి ప్రకాశము, ప్రభావము వేరు వేరుగ నుండును. అశ్మము కన్న లోహమందు ప్రకాశ మెక్కువ. ఇనుము కన్న బంగారమునందు ప్రకాశ మెక్కువ. అట్లే జీవుల యందు కూడ వారి వారి ప్రకాశమును బట్టి, వారి వారి విలువ లేర్పడుచుండును. గ్రామ పాలకునకు, సామ్రాజ్య పాలకునకు వ్యత్యాసము వారి చైతన్య వికాసమును బట్టి యుండును.

చైతన్య విలాసమంతయు యోగి దృష్టియందు ఒక మాయా నాటకము. ఈ జన్మకు రాజైనవాడు పై జన్మకు బంటు కాగలడు. ముందు జన్మయందు కూడ బంటుయే అయి ఉండవచ్చును. ఈ జన్మలో ధనికుడు క్రిందటి జన్మలో పేద కావచ్చును. ఇట్లు జీవులు జన్మకొక పాత్ర పోషణము చేయుచు, వేల జన్మలలో వివిధములగు పాత్రలు పోషించు చుందురు. ఈ చైతన్య విలాసము వెనుకగల అస్థిత్వమును దర్శించువాడు నిజమగు యోగియని శ్రీకృష్ణుని భావము. 

యోగి జీవులను, వారియందు వర్తించుచున్న అంతర్యామిని దర్శించి, సమదర్శనుడై నిలుచును. సృష్టియందు ఆ జీవులు పోషించు పాత్ర ననుసరించి వారితో ప్రతిస్పందించును. పాత్ర పోషణమున వైవిధ్య ముండవచ్చును. దానికాధారభూతుడగు జీవుని యందు వసించు అంతర్యామి ఒక్కడే. ఇది తెలిసినవాడు యోగార్హుడగును గాని, కేవలము ప్రకృతి విలువలకే పట్టము కట్టుచు జీవించు మిడిమిడి జ్ఞానము కలవాడు కాదు. 

యోగ సాధకుడు అంతర్యామితో అనుసంధానము చెందుట వలన యోగార్హుడై, యోగియై నిలబడును. చైతన్య విలాసములకు ఆకర్షింపబడినచో యోగ భ్రష్టుడగును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram Channel 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 363 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
94. అధ్యాయము - 06

*🌻. పార్వతి పుట్టుట - 3 🌻*

దేవతలిట్లు పలికిరి -

ఓ జగన్మాతా! మహాదేవీ! నీవు సర్వసిద్ధులను ఇచ్చుదానవు. నీవు సర్వదా దేవకార్యములను చక్కబెట్టెదవు. కాన నిన్ను సమస్కరించుచున్నాము (39). హే భక్తవత్సలే! దేవతలకు అన్ని విధములా కల్యాణమును కలిగించుము. మేన యొక్క మనోరథము పరిపూర్ణమైనది. శివుని మనోరథమును గూడ పరిపూర్ణము జేయుము (40).

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు మొదలగు దేవతలు ఆ శివాదేవిని ఇట్లు స్తుతించిరి, ప్రణమిల్లి, ప్రీతులై ఆమె యొక్క ఉత్కృష్టమగు జన్మను ప్రశంసిస్తూ తమ తమ ధామములకు వెళ్లిరి (41). 

ఓ నారదా! నల్ల కలువ రేకులవలె ప్రకాశించుచున్న ఆ బాలికను చూచి సుందరియగు మేన అతిశయించిన ఆనందమును పొందెను (42). మేన ఆమె దివ్యరూపమును చూచి, ఆ పిదప జ్ఞానమును పొంది, ఆమె పరమేశ్వరియని గుర్తించి మిక్కిలి ఆనందించి స్తుతించెను (43).

మేన ఇట్లు పలికెను -

ఓ జగదంబా! మహేశ్వరీ! నీవు నాయందు అతిశయించిన దయను చూపితివి. ఏలయన, హే అంబికే! నీవు నీ సుందరరూపముతో నా ఎదుట ప్రత్యక్షమైతివి (44). శక్తులన్నింటికి మూలమగు శక్తివి నీవే. హే శివే! నీవు ముల్లోకములకు తల్లివి. నీవు సర్వదా శివునకు ప్రియురాలవగు దేవివి. దేవతలందరు స్తుతించే పరాశక్తివి నీవే (45). ఓ మహేశ్వరీ! దయను చూపుము. నీవు నా ధ్యానమునందు నిలిచి యుండుము. నీవు ఈ రూపములో ప్రత్యక్షమై, కుమార్తెతో సమానమగు రూపమును స్వీకరించుము (46).

బ్రహ్మ ఇట్లు పలికెను -

హిమవంతునికి ప్రియమగు భార్యయై చక్కని సంతానమును గనిన ఆమేన యొక్క ఈ మాటను విని శివా దేవి ఇట్లు బదులిడెను (47).

దేవి ఇట్లు పలికెను -

ఓ మేనా!పూర్వము నీవు నన్ను శ్రద్ధతో చక్కగా సేవింతివి. నీభక్తిచే నేను మిక్కిలి ప్రసన్నురాలనై, వరము నీయుట కొరకు నీ వద్దకు వచ్చితిని (48). 'వరమును కోరుకొనుము' అని నేను పలుకగా, నీవు విని 'ఓ మహాదేవీ!నీవు నాకు కుమార్తెవై జన్మించి, దేవకార్యమును చక్కబెట్టుము' అని నీవు కోరియుంటివి (49). 

నేనపుడు నాకా వరమునిచ్చి నా ధమమునకు వెళ్లితిని. ఇపుడు దానికి సమయము వచ్చినది. ఓ హిమవంతుని ప్రియురాలా! నీకా కుమార్తెనై జన్మించితిని (50). నేనిపుడు దివ్య రూపముతో నీ ఎదుట ప్రత్యక్షమైతిని. అట్లు ప్రత్యక్షమై నీకు నా స్మరణ కల్గునట్లు చేసితిని. అట్లు గానిచో, నీవు నన్ను గుర్చించలేక అజ్ఞానముచే నన్ను ప్రాకృత స్త్రీయని తలపోసి యుండెడి దానవు (51).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇట్లు పలికి జగన్మాతయగు ఆ శివ మిన్నకుండెను. తల్లి ప్రేమతో చూచుచుండగనే ఆమె వెనువెంటనే తన మాయాశక్తిచే శిశు రూపమును స్వీకరించెను (54).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో పార్వతీ జన్మవర్ణనమనే ఆరవ అధ్యాయము ముగిసినది (6).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 113 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 8 - THE 20th RULE
*🌻 20. Seek it not by any one road. - 6 🌻*

430. We see the same thing at a very much higher stage working out in the case of an immensely powerful man, an American millionaire of the old type, for example, who made a great amount of money very often by ruining other people. 

He was doing a very wicked thing, but he was developing tremendous powers of concentration and generalship. Having learnt in that position how to do all this and how to manage his fellow-men, he might perhaps in another life be a general of an army. Very likely at first he would use his generalship as Napoleon did – for his own advancement and to gratify his ambition.

Later on he would learn to use his powers for the service of his fellow-men. In that way it is clear that the very vices of men are steps on the way to something higher and better. The advance from vice to virtue is very largely a matter of learning to control our energies and directing them aright. 

We begin to transmute our vices into virtues when we realize that the energy which is going so to waste and doing so much harm might be applied for good purposes. Each time an evil quality is finally conquered, it is changed into the opposite virtue, and so becomes a definite step raising us higher in evolution.

431. The whole nature of man must be used wisely by the one who desires to enter the way.

432. A.B. – The word “way” here means the real spiritual life. Man is a spiritual being, so in living the spiritual life he is being his true self. If he would tread that way he must use all his faculties and powers, the whole of himself. What man is in his essence, that he becomes in truth – a manifestation of the divine. 

When the disciple is at a certain stage he is told: “Thou art the Path.” Before this time his Master is to him his Path - he sees the divine manifesting in the Master; but when the divine in him manifests, he himself is the Path. He becomes the Path in proportion as he advances. 

Therefore the whole nature of the man is to be used wisely. When that is done the divine fragment, with the help of the thing which he has created for his own use, may unfold its latent powers into active and positive life.

433. The words “divine fragment” are not used merely as a poetic phrase; they contain a truth we cannot afford to forget, which any other words would be inadequate to express. The same idea is found in the Catechism quoted in The Secret Doctrine,1 (1 Op.cit,, Vol. I, p. 145.) where the Guru asks the pupil what he sees. 

He sees countless sparks, which appear as though detached; the ignorant look upon them as separate, but by the wise they are seen as one Flame. Such a fragment, inasmuch as it is a centre of consciousness, is a point without magnitude; it cannot be separate. 

All centres are fundamentally one, since there is only one ultimate sphere, one universe. But the mystery of the unity of being cannot be understood below the nirvanic plane; it cannot be expressed in the lower worlds, and all attempts to symbolize it must be imperfect.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 244 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. గౌరముఖ మహర్షి - 2 🌻*

5. వాళ్ళే మొట్టమొదట స్వర్గానికి వెళ్ళిన – భూమిమీద పుత్రులనుకని వెళ్ళిపోయిన – మొట్టమొదటి పితృదేవతలు. వాళ్ళే సప్తర్షులు. వాళ్ళల్లో మూర్తిమంతంగా ఉండేవాళ్ళూ నలుగురు. ఆ మూర్తులు నిజతేజస్వరూపులుగా ఉన్నారు. 

6. ఆ నలుగురూ భూలోకంలో ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలో అక్కడా ఉన్నారు. తరువాత వాళ్ళు ఆకడనుంచే భూలోకంలో ఆరాధన పొందారు. ఆ తరువాత కేవలం భూలోకానికివచ్చి శుద్ధ బ్రహ్మజ్ఞానంతో వాళ్ళు పునరావృత్తిరహితమైన యోగసిద్ధినిపొందారు. వీళ్ళనే పితృదేవతలంటారు” అని చెప్పాడు మార్కండేయుడు.

7. ఇంకా, “ఇది ప్రథమ పితృసర్గం. ఈ ప్రకారంగా అనేకమంది పితరులు సప్తలోకాల్లో ఉన్నారు. ఇక్కడకువచ్చి, ఇక్కడనుండివెళ్ళి దివ్యత్వంపొందిన ఉత్తమలోకవాసులందరూ పితృదేవతలు. వాళ్ళందరూ అనేక స్వర్గములలో ఉన్నారు. 

8. భూలోకవాసులైన జనులు, భువర్లోకవాసులైన పితృలోకవాసులను పూజిస్తారు” అన్నాడు. “భువర్లోకవాసులు, మరీచాదులు మొదలుగాగల సువర్లోకవాసులు, కల్పోపవాసిసంజ్ఞులైన మహర్లోకవాసులందరూ – జనలోక వాసులైనటువంటి సనకాది పితరులను కొలుస్తారు. 

9. వాళ్ళ పైలోకవాసంలో ఉండేవాళ్ళను కొలుస్తారు. వాళ్ళను ఆరాధిస్తారు. పితృసర్గమని దీనికిపేరు. ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోవటంచేత, వారు ఇక్కడ మానవజన్మ పరంపరకు కారణమవుతున్నారు. వాళ్ళను ఆరాధించమని పితృదేవతల యొక్క ఆరాధనా విధివిధానం ఇవ్వబడింది” అని చెప్పాడు మార్కండేయుడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 310 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 159. The 'I am' is the awareness before thoughts, it cannot be put into words; you have to 'just be'. 🌻*

When the knowledge 'I am' dawned on you, you knew no words or language. It was an awareness without or before thoughts. When we are using words for communication, 

it should be quite obvious that they cannot be used to describe the wordless state! It can be hinted at, or can be pointed out, but its real understanding will only come by being it, so do away with words and 'just be', then see what happens.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness 
www.facebook.com/groups/dailysatsangwisdom/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 185 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - అవతార పురుషుడు - 7 🌻*

696. అవతారపురుషుడు మానవుని వలెనే అస్వస్థతగానున్నడో ఏక కాలమందే ఆతని వెనుక ఆతనికి అనంతశక్తియు – అనంత జ్ఞానమును – అనంత ఆనందమును కలిగియున్నాడు.

697. ముక్తి పొందిన తొలి ప్రత్యగాత్మయే అవతార పురుషుడా? భగవంతుడు తొలిసారిగా పరమాత్మ యొక్క (B) స్థితిలో చైతన్యవంతుడయ్యెను. 

అనగా – భగవంతుడు, ముందు తనను తాను తెలిసికొనెను. ఏక కాలమందే పరమాత్మ యొక్క (A) స్థితిలో అనంతముగా చైతన్య మందు స్పృహ లేక యుండెను.

భగవంతుని తక్కిన ఇతర స్థితులును, దివ్య అంతస్తులును యీ (A) స్థితి యొక్క ఫలితములే. (A) స్థితి శాశ్వతముగా అనంత చైతన్యమును పొందుటకు జిజ్ఞాసతో నుండును. తత్ఫలితముగా మానవుడు భగవంతుడై నట్లు మనము కనుగొనుచున్నాము.

699. సత్యమేమనగా - అవతార పురుషుడు సదా ఒక్కడే, అతడే. ఆ కాలపు పంచ సద్గురువులే భగవంతుని భూలోకమునకు దింపెను. ఈ విధానము ఇంతకు పూర్వము, ఇకముందును శాశ్వతముగా ఇట్లే జరిగిపోవు చుండును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 40 / Sri Lalita Sahasranamavali - Meaning - 40 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 40. తటిల్లతా సమరుచిః, షట్-చక్రోపరి సంస్థితా ।*
*మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ ॥ 40 ॥ 🍀*

🍀 107. తటిల్లతా సమరుచిః - 
మెఱపుతీగతో సమానమగు కాంతి గలది.

🍀 108. షట్చక్రోపరి సంస్థితా - 
ఆరు విధములైన మూలాధారాది చక్రముల యొక్క పైభాగమందు చక్కగా నున్నది.

🍀 109. మహాసక్తిః - 
బ్రహ్మమునందు ఆసక్తి గలది.

🍀 110. కుండలినీ - 
పాము వంటి ఆకారము గలది.

🍀 111. బిసతంతు తనీయసీ -
 తామరకాడలోని ప్రోగువలె సన్నని స్వరూపము గలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 40 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 40. taḍillatā-samaruciḥ ṣaṭcakropari-saṁsthitā |*
*mahāsaktiḥ kuṇḍalinī bisatantu-tanīyasī || 40 || 🌻*

🌻 107 ) Thadillatha samaruchya -   
She who shines like the streak of lightning

🌻 108 ) Shad chakropari samshitha -   
She who is on the top of six wheels starting from mooladhara

🌻 109 ) Maha ssakthya -   
She who likes worship by her devotees

🌻 110 ) Kundalini -   
She who is in the form of Kundalini ( a form which is a snake hissing and exists in mooladhara)

🌻 111 ) Bisa thanthu thaniyasi -   
She who is as thin as the thread from lotus.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 40 / Sri Vishnu Sahasra Namavali - 40 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*సింహ రాశి- మఖ నక్షత్ర 4వ పాద శ్లోకం*

*🍀 40. విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర స్సహః।*
*మహీధరో మహాభాగో వేగవానమితాసనః॥ 🍀*

🍀 363) విక్షర: - 
నాశములేనివాడు.

🍀 364) రోహిత: - 
మత్స్యరూపమును ధరించినవాడు.

🍀 365) మార్గ: - 
భక్తులు తరించుటకు మార్గము తాను అయినవాడు.

🍀 366) హేతు: - 
సృష్టికి కారణము అయినవాడు.

🍀 367) దామోదర: -
 దమాది సాధనలచేత ఉదారమైన బుద్ధిద్వారా పొందబడువాడు.

🍀 368) సహ: - సహనశీలుడు.

🍀 369) మహీధర: - 
భూమిని ధరించినవాడు.

🍀 370) మహాభాగ: - 
భాగ్యవంతుడు.

🍀 371) వేగవాన్ -
అమితమైన వేగము కలవాడు.

🍀 372) అమితాశన: - 
అపరిమితమైన ఆకలి గలవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 40 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Simha Rasi, Makha 4th Padam*

*🌻 40. vikṣarō rōhitō mārgō heturdamodarassahaḥ |*
*mahīdharō mahābhāgō vegavānamitāśanaḥ || 40 || 🌻*

🌻 363. Vikṣaraḥ: 
One who is without Kshara or desruction.

🌻 364. Rōhitaḥ: 
One who assumed the form of a kind of fish called Rohita.

🌻 365. Mārgaḥ: 
One who is sought after by persons seeking Moksha or Liberation.

🌻 366. Hetuḥ: 
One who is both the instrumental and the material cause of the universe.

🌻 367. Damodaraḥ: 
One who has very benevolent mind because of disciplines like self-control.

🌻 368. Sahaḥ: 
One who subordinates everything.

🌻 369. Mahīdharaḥ: 
One who props up the earth in the form of mountain.

🌻 370. Mahābhāgaḥ: 
He who, taking a body by His own will, enjoys supreme felicities.

🌻 371. Vegavān: 
One of tremendous speed.

🌻 372. Amitāśanaḥ: 
He who consumes all the worlds at the time of Dissolution.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
Join and share.....
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation  
www.facebook.com/groups/vishnusahasranam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్గీత యథాతథం - 1 - 012 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. విషాదయోగం - అధ్యాయము 1 - శ్లోకము 12 🌻*

12
*తస్య సంజనయన్‌ హర్షం కురువృద్ధ: పితామహ: |*
*సింహనాదం వినద్యోచ్చై: శంకం దధ్మౌ ప్రతాపవాన్‌ ||*

🌻. తాత్పర్యము : 
అప్పుడు కురువృద్ధుడును, యోధుల పితామహుడును అగు బీష్ముడు దుర్యోధనుననకు ఆనందమును గూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను.

🌻. భాష్యము : 
బీష్ముడు, తన మనుమడైన దుర్యోధనుని కలతను అర్థము చేసుకుని దానిని దూరము చేయుటకు సింహనాదము వలె శంఖువు పూరించి యుద్ధమునకు తన సంసిద్ధతను తెలియజేసెను. అయితే శంఖువు చిహ్నము విష్ణువును సూచించును. ఆ విష్ణువు కృష్ణుని రూపములో ఎదుటి పక్షమున ఉండెను. అందువలన దుర్యోధనునికి విజయము ప్రాప్తించదని తెలియజేసెను. ఏది ఏమైనప్పటికీ, యుద్ధమును నిర్వహించుట తన కర్తవ్యము కనుక దానిలో వచ్చు కష్టనష్టాలకు వెనుకాడే సమస్యే లేదని బీష్ముడు తెలియజేసెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment