భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 185


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 185 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - అవతార పురుషుడు - 7 🌻


696. అవతారపురుషుడు మానవుని వలెనే అస్వస్థతగానున్నడో ఏక కాలమందే ఆతని వెనుక ఆతనికి అనంతశక్తియు – అనంత జ్ఞానమును – అనంత ఆనందమును కలిగియున్నాడు.

697. ముక్తి పొందిన తొలి ప్రత్యగాత్మయే అవతార పురుషుడా? భగవంతుడు తొలిసారిగా పరమాత్మ యొక్క (B) స్థితిలో చైతన్యవంతుడయ్యెను.

అనగా – భగవంతుడు, ముందు తనను తాను తెలిసికొనెను. ఏక కాలమందే పరమాత్మ యొక్క (A) స్థితిలో అనంతముగా చైతన్య మందు స్పృహ లేక యుండెను.

భగవంతుని తక్కిన ఇతర స్థితులును, దివ్య అంతస్తులును యీ (A) స్థితి యొక్క ఫలితములే. (A) స్థితి శాశ్వతముగా అనంత చైతన్యమును పొందుటకు జిజ్ఞాసతో నుండును. తత్ఫలితముగా మానవుడు భగవంతుడై నట్లు మనము కనుగొనుచున్నాము.

699. సత్యమేమనగా - అవతార పురుషుడు సదా ఒక్కడే, అతడే. ఆ కాలపు పంచ సద్గురువులే భగవంతుని భూలోకమునకు దింపెను. ఈ విధానము ఇంతకు పూర్వము, ఇకముందును శాశ్వతముగా ఇట్లే జరిగిపోవు చుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


03 Mar 2021

No comments:

Post a Comment