వివేక చూడామణి - 37 / Viveka Chudamani - 37


🌹. వివేక చూడామణి - 37 / Viveka Chudamani - 37 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు

🍀. ఆత్మ స్వభావము - 5 🍀


136. మనస్సును అదుపులో ఉంచి బుద్ది స్వచ్ఛమై తన ఆత్మను తాను నేరుగా ఈ శరీరములోనే గుర్తించి సరిహద్దులేలేని సంసార మహాసముద్రమును దాటి, పుట్టుక, చావు లేని బ్రాహ్మిక స్థితిలో స్థిరపడుతుంది. అది తన అసలు స్థితిని తాను పొందుతుంది.

137. అజ్ఞానమనే బంధనాల నుండి విడివడి, పుట్టుక, చావులనే దుఃఖాలకు అతీతమై జీవాత్మ పరమాత్మను గుర్తిస్తుంది. అజ్ఞానము వలన, క్షయించే ఈ శరీరము నిజమని భావించి, అదే తానని భావిస్తూ, దానిని పోషిస్తూ, దానికి వివిధ అలంకారములు, సుగంధములు అలుముతూ దాని బంధనాలలో జ్ఞానేంద్రియాలకుచిక్కినట్లు అనగా పట్టుపురుగు తన చుట్టూ తానే గూడు కట్టుకొని అందులో బంది అయి, తన చావును తానే కొనితెచ్చుకొన్నట్లు జీవాత్మ చిక్కుకొన్నది.

138. ఏ వ్యక్తి అయితే అజ్ఞానమనే చీకటిలో మునిగి సరైన వస్తువును గుర్తించలేక మంచి, చెడు వ్యత్యాసమును గ్రహించలేక, తాడును పామని భ్రమించినట్లు అనేక ప్రమాదాలను ఎదుర్కొనుచున్నాడు. అందువలన ఈ విషయాన్ని గ్రహించాలి. మార్పు చెందే ఈ వస్తు విశేషములు నిజమని నమ్మి బంధనాలలో చిక్కుకొనుట జరుగుచున్నది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 37 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj


🌻 Nature of Soul - 5 🌻

136 .By means of a regulated mind and the purified intellect (Buddhi), realise directly thy own Self in the body so as to identify thyself with It, cross the boundless ocean of Samsara whose waves are birth and death, and firmly established in Brahman as thy own essence, be blessed.

137. Identifying the Self with this non-Self –this is the bondage of man, which is due to his ignorance, and brings in its train the miseries of birth and death. It is through this that one considers this evanescent body as real, and identifying oneself with it, nourishes, bathes, and preserves it by means of (agreeable) sense-objects, by which he becomes bound as the caterpillar by the threads of its cocoon.

138. One who is overpowered by ignorance mistakes a thing for what it is not; It is the absence of discrimination that causes one to mistake a snake for a rope, and great dangers overtake him when he seizes it through that wrong notion. Hence, listen, my friend, it is the mistaking of transitory things as real that constitutes bondage.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

03 Mar 2021

No comments:

Post a Comment