✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 32. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 2 🌻
ఆ రోజు ఉదయం పిల్లలను బడికి పంపి, కొన్ని నిముషములు చల్లనిగాలి హాయిగా పీల్చుకొనుటకు మా ఇంటి దగ్గరలోని ఒక చిన్న కొండపైకి చేరితిని.
అచట చతికిలబడి జీవితమును పర్యావలోకనము చేయుట ప్రారంభించితిని. అంతలోనే అకస్మాత్తుగా నేను అప్రమత్త నైతిని. చైతన్యమున ఒక క్రొత్త మెలకువ ఏర్పడినది.
ఎచ్చటనుండియో సుదూరముగ సంగీతము వినవచ్చినది. ఆ గానము ఎటునుండి వచ్చుచున్నదో యని పరికించితిని, పరిశీలించితిని. అది నా చుట్టూ వున్న ఆకాశము నుండి కొండ మీదుగా నాలో ప్రవేశించి వినిపించు చున్నట్లుగ గమనించితిని. అమితాశ్చర్యము పొందితిని. గానము నాదమై, నాదము వాక్కైయిట్లు వినిపించినది. "ప్రజా సంక్షేమమునకై కొన్ని పవిత్ర గ్రంథములను వ్రాయుటకు నిర్ణయింపబడినది. వాటిని వ్రాయుటకు నీవు అర్హురాలవు. ఈ మహా యజ్ఞమును ప్రారంభించుటకు నీవు అంగీకరింతువా?”
తక్షణమే నే నిట్లంటిని. “ముమ్మాటికీ అంగీకరింపను. నే నెవరికిని వ్రాయసకత్తెను కాజాలను. అట్టి విషయములు నా కనంగీకారములు.” ఆశ్చర్య మేమనగా - నేను వినిన దివ్యవాణికి అసంకల్ప ప్రతీకారచర్యగా ఈ సమాధానము అకస్మాత్తుగా వైఖరీ వాక్కుగా వెలువడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
03 Mar 2021
No comments:
Post a Comment