🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 3 🌻
20. రుద్రుడి యొక్క తత్త్వం ఏమిటంటే, అయిదవ బ్రహ్మగా అతడు అంతర్ముఖుడై ఉన్నాడు. శుద్ధజ్ఞానలక్షణ విలసితుడై, అంతర్ముఖుడై అతడు ఉండటచేత సాధారణంగా నిష్క్రియుడు.
21. అతడి యందు అతని యొక్క కార్యలక్షణము ఎప్పుడు వస్తుందంటే, లోకంలో ఏదయినా విపత్తు సంభవించినప్పుడుకాని, ఎవరైనా ఆరాధించినప్పుడుకాని (అతడున్నాడని తెలిసినవాడూ అతడిని ఆరాధిస్తే), అతడికి క్రియ ఏర్పడుతుంది తప్ప; లేకపొతే అతడి యందు క్రియలేదు.
22. శుద్ధజ్ఞాన స్వరూపమై, ఆదియందున్న పరబ్రహ్మతత్త్వమైన సదాశివతత్త్వం ఏదయితే ఉన్నదో, దానియొక్క జ్ఞానం సంపూర్ణంగా కలిగి ఉండటంచేత – రుద్రుడు నిష్క్రియుడై, క్రియాతీతుడై సర్వకాలములకు అతీతుడైన స్థితిలో ఉంటాడు.
23. కనుక రుద్రుడు ప్రథమమైనటువంటి పరబ్రహ్మ-సదాశివబ్రహ్మ-యొక్క రూపాంతరమే. అందుకని లోకమందున్న విభూతులు, ఐశ్వర్యము, సుఖము – వాటియొక్క స్పృహ అతడియందు ఉండదు.
24. అయితే, ఈ రుద్రునికి మళ్ళీ పత్నిగా పరాశక్తి ప్రక్కన ఉన్నదని మనవేదాలు, పురాణాలు, శాస్త్రాలు విరూపణంచేసాయి. అంటే, మన ఉపాసనాసౌలభ్యంకోరకే ఈ సిద్ధంతం ఏర్పడినదని గ్రహించాలి. లేకపోతే, రుద్రుడు వివాహంచేసుకున్నాడని, ఆయనకు స్వాధీనంగా లేకుండానే ఆమె వెళ్ళిపోయి, దాక్షాయణిగా తనను తాను ఉపసంహారం చేసుకుందనీ, ఈ కథకంతటికీకూడా ఎలాగ అర్థం చెప్పుకోవాలి? సృష్టిమూలకమైన తత్త్వములకు – మన పౌరాణికగాధలన్నీ కొన్ని రూపకల్పనలని చేసుకోవాలి.
25. కథారూపకల్పన లేకుంటే, ఆ తాత్త్వముల అంతరార్థం మానవబుద్ధికి సులభంగా అవ్గాహన కాదు.
దేవాలయంలో నందీశ్వరుడిని, గణపతిని ప్రతిష్ఠ చేస్తాం. ఆ రెండూ లేకపోతే ఈ రుద్రుణ్ణి మనం చేరటానికి, సమీపించడానికి, ఆయనను ఉపాసించడానికి సాధ్యంకాదు. ఆ వేదాంతతత్త్వమే మనయొక్క ఈశ్వర ఉపాసనా విధానములందుకూడా అనేక రూపాంతరములు పొంది వచ్చింది ఈ ప్రకారంగా.
26. జ్ఞానాజ్ఞానముల యొక్క అనేక అవస్థలలో జీవులు ఆయా పరిణామదశలలో ఉన్నారు. ఈ సృష్టిలో అనేక చరిత్రలు జరగవలసి ఉంది. దానికి దేవకార్యం అనిపేరు.
27. ఈశ్వరుని నుండి బహిర్గతమైన జగత్తంతా – ఈ జీవకోటి అంతా కూడా – తనలో మళ్ళీ లయం చెందాలనేది ఒకటే ఆయన సంకల్పం. కానీ జీవులకు ఆయన్ స్వేఛ్ఛనిచ్చాడు. వాళ్ళందరినీ తను వెంటనే ఉపసంహారం చేసుకోవచ్చు కదా! అటువంటి క్రియయందు అతడికి కారణత్వంలేదు. అలాంటికారణం అతడు కాడు.
28. స్వేఛ్ఛ జీవాహంకారానికి ఇవ్వటంచేత, దానంతట దానికే ఎప్పుడైతే ఆ మోహమ్నుంచి విడిపోదామనే మోక్షేఛ్ఛ కలుగుతుందో, అప్పుడే దానికి మార్గాలు ఈ సృష్టిలో ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కర్మయొక్క బంధ్నాన్నే కోరుకొని శాశ్వతంగా ఇక్కడే ఉండేవాళ్ళకు దానికి ఏర్పాట్లు వేరే ఉన్నయి.
29. రెండు విధాలుగా రాచబాటలు వేసి ఈశ్వరుడు జీవాత్మకు ఇచ్చాడు. అతడు మనకు ఇచ్చిన దానికే చిత్తము – బుద్ధి – మనసు అని మనమంటున్నాం. అంటే, జీవుని కివ్వబడిన ‘స్వేఛ్ఛ’ పేరే, మనోబుద్ధిచిత్తములు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
07 Oct 2020
No comments:
Post a Comment