మైత్రేయ మహర్షి బోధనలు - 109
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 109 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 86. సమాధాన విద్య - 1 🌻
ప్రశ్నకు సమాధానము తెలుపువాడు అవగాహన ఏర్పడునట్లు సమాధానమీయవలెను. సమాధానమిచ్చినను అవగాహన కాదు అని అనిపించినచో సమాధాన మీయకుండుటయే మంచిది. సాధారణముగ సమాధానము నుండి మరల ప్రశ్నలు పుట్టుచుండును. అనగా పృచ్ఛకుడు సమాధానపడలేదనే కదా అర్థము. ప్రశ్నలతో కలవర పడువారికి సమాధానము మరింత కలవరపెట్టకలదు సుమా!
అందుకే తెలిసిననూ సమాధానమీయ కుండుట ఉత్తమము. పృచ్ఛకుడే సమాధాన పడునట్లు సూచన లీయుట బోధన కాని సూటిగా సమాధానమును చెప్పుట ఉపయోగకరము కాదు. సూచనలే ఉపయోగకరము. సూచనలు ప్రశ్నించు వాడి ప్రశ్నయందే యుండును. ప్రశ్న యందే సమాధాన మున్నది అని తెలుపుటలో గల రహస్య మిదియే.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
26 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment