నిర్మల ధ్యానాలు - ఓషో - 170


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 170 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నువ్వు అహం లేకుండా వుండగలిగితే, ఫలానాగా , ఎవరిగానో వుండని పక్షంలో, ఏమీ లేనితనంగా వుండే పక్షంలో అనంతాన్ని అందుకుంటావు. అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటావు. దాన్ని మించిన లక్ష్యం లేదు. 🍀


అహమొక్కటే సమస్య. అప్పుడది వేల సమస్యల్ని సృష్టిస్తుంది. ఈర్ష్య, అసూయ, కాంక్ష, ద్వేషం యిట్లా లెక్కలేనన్ని వాటిని సృష్టిస్తుంది. జనం వాటన్నిటితో ఘర్షిస్తారు. ఫలితముండదు. పునాదుల్ని మార్చినపుడు కానీ ఫలితముండదు. కొమ్మల్ని నరికితే మళ్ళీ చిగురిస్తాయి. ఆకుల్ని తుంపితే మళ్ళీ వస్తాయి. చెట్టు మరిం బలంగా మారుతుంది. నేనేమంటానంటే వాటితో ఘర్షించకు. మూలాల్లోకి వెళ్ళు. అక్కడ పునాదిగా వున్నది అహం. నువ్వు అహం లేకుండా వుండగలిగితే, ఫలానాగా వుండలేని పక్షంలో, ఎవరిగానో వుండని పక్షంలో, ఎవరిగానో మారని పక్షంలో ఏమీలేనితనంగా వుండే పక్షంలో అనంతాన్ని అందుకుంటావు. అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటావు. దాన్ని మించిన లక్ష్యం లేదు. దాన్ని సులభంగా అందుకోవచ్చు.

కారణం అహమన్నది ఒక పొరపాటు విషయం భ్రాంతి. అందు వల్ల దాన్ని వదిలించుకోవచ్చు. అది యథార్థం కాదు. వూహ, నీడ. అది వున్నదని నువ్వు నమ్ముతూ పోతే అది వుంటుంది. లోలోతుల్లోకి నువ్వు చూస్తే అది వుండదు. ధ్యానమంటే లోలోతుల్లోకి గాఢంగా చూడడం. అహాన్ని చూడడం అన్ని కోణాల్లో నీ అస్తిత్వం ఎక్కడ వుందో పరిశీలనగా చూడడం. అదెక్కడా కనిపించదు. అదెక్కడా కనిపించని క్షణంలో నీ ప్రయత్నం ఫలవంతమవుతుంది. కొత్త జన్మనెత్తుతావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


26 Apr 2022

No comments:

Post a Comment