🌹 వివేక చూడామణి - 3 / VIVEKA CHUDAMANI - 3🌹

🌹 వివేక చూడామణి  - 3 / VIVEKA CHUDAMANI - 3🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 వివిధ మార్గాలు 🍃


40. ఈ ప్రాపంచిక విషయ వాసనలనే మహాసముద్రమును దాటుటకు ఏ విధమైన మార్గాలను అనుసరించిన నా భవిష్యత్తు సాఫీగా జరుగుతుందో నాకు తెలియుటలేదు. నన్ను రక్షించుటకు, నా దుఃఖాలను అంతము చేయుటకు ప్రభూ మీరు నాకు ఏ విధముగా తోడ్పడగలరు.

41. సాధకుడు ఈ విధముగా తన మార్గదర్శకుని ప్రార్ధించినప్పుడు, ఈ ప్రపంచమనే అడవిలోని దావాలనము అడవిని దహించినట్లు, ఆ సాధువు తన మృదువైన కృపాదృష్టిని దయతో సాధకునిపై ప్రసరింపజేసి అతని భయాన్ని దుఃఖాన్ని తొలగించగల్గుతాడు.

42. ఏ సాధకునికి గురువు తన రక్షణ కవచాన్ని అందించాడో అతడు జనన, మరణ, దుఃఖాల నుండి విముక్తిని పొంది, గురువు యొక్క శాస్త్ర విహితమైన సూచనలు ఆమోదిస్తూ, పవిత్రమైన మనస్సుతో ప్రశాంత స్థితిని పొందుటకు గురువు అతనికి దయతో సత్యబోధ చేయగల్గుతాడు.

43. జ్ఞాని అయిన ఓ సాధకుడా! భయపడకు నీకు చావులేదు ఈ సంసారసాగరమును దాటుటకు యోగులు మార్గమును చూపించినారు. అదే మార్గమును నేను నీకు చూపించెదను.

44. ఈ ప్రాపంచిక దుఃఖముల నుండి విముక్తిని పొందుటకు ఒక బంగారు బాట కలదు. ఆ మార్గమును అనుసరించిన నీవు సంసారసాగరమును సులువుగా దాటి ముక్తిని పొందగలవు.

45. వేదాంత విజ్ఞానమును చిలికిన బ్రహ్మాన్ని తెలుసుకొనే అత్యున్నత జ్ఞానమును పొందగలవు. అది ఈ ప్రాపంచిక సుఖ దుఃఖముల నుండి విముక్తి పొందుటకు తోడ్పడగలదు.

 46. సాధకుడు సృతులలో చెప్పినట్లు సంసార బంధముల నుండి విముక్తి కొరకు నమ్మకము, భక్తి మరియు ధ్యాన మార్గమును అవలంబించవలసి ఉండును.

47. పుట్టుక చావులనే చక్ర భ్రమణముల నుండి విముక్తి పొందాలంటే, అజ్ఞానమనే చీకటిని పారద్రోలి సాధకుడు అనాత్మ బంధనాల నుండి విడివడాలి. అందుకు జ్ఞానాగ్నిని ఆత్మ, అనాత్మ విచక్షణ జ్ఞానము ద్వారా రగిల్చి, అజ్ఞానమును కూకటి వేళ్ళతో దహించివేయవలెను.
🌹 🌹 🌹 🌹 🌹


🌹VIVEKA CHUDAMANI - 3 🌹
✍. Swami Madhavananda
📚. Prasad Bharadwaj


21.    Vairagya or renunciation is the desire to give up all transitory enjoyments (ranging) from those of an (animate) body to those of Brahmahood (having already known their defects) from observation, instruction and so forth.

22.    The resting of the mind steadfastly on its Goal (viz. Brahman) after having detached itself from manifold sense-objects by continually observing their defects, is called Shama or calmness.

23.    Turning both kinds of sense-organs away from sense-objects and placing them intheir respective centres, is called Dama or self-control. The best Uparati or selfwithdrawal consists in the mind-function ceasing to be affected by external objects.

24.    The bearing of all afflictions without caring to redress them, being free (at the sametime) from anxiety or lament on their score, is called Titiksha or forbearance.

25.    Acceptance by firm judgment as true of what the Scriptures and the Guru instruct, iscalled by sages Shraddha or faith, by means of which the Reality is perceived.

26.    Not the mere indulgence of thought (in curiosity) but the constant concentration of the intellect (or the affirming faculty) on the ever-pure Brahman, is what is called Samadhana or self-settledness.

27.    Mumukshuta or yearning for Freedom is the desire to free oneself, by realising one’strue nature, from all bondages from that of egoism to that of the body – bondages superimposed by Ignorance.

28.    Even though torpid or mediocre, this yearning for Freedom, through the grace of theGuru, may bear fruit (being developed) by means of Vairagya (renunciation), Shama (calmness), and so on.

29.    In his case, verily, whose renunciation and yearning for Freedom are intense,calmness and the other practices have (really) their meaning and bear fruit.

30.    Where (however) this renunciation and yearning for Freedom are torpid, therecalmness and the other practices are as mere appearances, like water in a desert.

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment