✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃 ప్రశ్న, జవాబు 🍃
48. శిష్యుడు గురువుగారిని ఈ విధముగా ప్రశ్నించును. దయయుంచి నేను అడిగే ఈ క్రింది ప్రశ్నకు సమాధానమును తమ నోటి ద్వారా వినాలని కోరుచున్నాను.
49. బంధనమనగా నేమి? అది ఎలా ఆత్మను పట్టి ఉంచింది? అది ఎలా కొనసాగుతుంది? ఎవరైన దాని నుండి ఎలా విముక్తి పొందగలరు? అనాత్మ అంటే ఏమిటి? ఉన్నతమైన ఆత్మ ఎవరు? ఆత్మ అనాత్మల భేదమును ఎలా తెలుసుకొనగలము? ఈ విషయములన్నింటిని వివరించవలసినదిగా కోరుచున్నాము.
50. గురువు ఈ విధముగా సమాధానము చెప్పుచున్నాడు.
ఇలాంటి ప్రశ్నలు అడిగినందుకు భగవంతుడు నిన్ను దీవించుగాక! నీవు జీవితములో ఉన్నత స్థితిని చేరుకున్నావు. నీ కుటుంబమును పవిత్ర పర్చినావు. అజ్ఞాన బంధనాల నుండి విడివడి బ్రహ్మత్వమును పొంది యున్నావు.
51. ఒక తండ్రి తన కుటింబీకులందరిని అప్పుల బంధనాల నుండి విముక్తి కలిగించుగాక. కాని తనను తాను తన బంధనాల నుండి విముక్తి పొందియుండలేదు.
52. ఇతరులు తన నెత్తిన మోపిన బరువు బాధ్యతలను ఇతరులే దింపివేయవలెను. కాని వ్యక్తి తనకు తానే కల్పించుకున్న ఆకలి వంటి బాధలను తనకుతానే తొలగించకొనవలెను.
53. ఒక రోగి తనకు తగిన ఆహారమును, మందును తాను తీసుకొన్నప్పుడు రోగము పూర్తిగా తగ్గుతుంది. కాని ఇతరుల కృషి వలన కాదు.
54. వస్తువుల యొక్క నిజమైన స్వభావమును ముందుగా వ్యక్తి తనకు తాను తన దృష్టి ద్వారా వివరముగా చూసి గ్రహించాలి గాని ఇతర పండితులు చెప్పినప్పటికి అర్థము కాదు. చంద్రుడు ఎలా ఉంటాడు అనేది తన కండ్ల ద్వారా చూసి తెలుసుకోవాలి. ఇతరులు ఎలా తెలియచెప్పగలరు.
55. అజ్ఞానము, కోరికలు, కర్మల లాంటి వాటిని వ్యక్తి స్వయముగా తనకు తాను తొలగించుకోవాలి గాని, 100 కోట్ల జన్మలెత్తినను ఎవరు తొలగించలేరు. అజ్ఞానము వలన కోరికలు, కోరికల వలన కర్మలు, కర్మల వలన పాపపుణ్యములు తప్పవు. ఇవన్నీ పోవాలంటే వాటి యొక్క జ్ఞానాన్ని పొందాలి.
56. హఠయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము మరియు జ్ఞాన యోగముల ద్వారా బ్రహ్మమును పొందలేము. కేవలము బ్రహ్మమునకు తనకు భేదము లేదని స్వయముగా తెలుసుకొన్నప్పుడే బంధనాల నుండి విముక్తి లభిస్తుంది. పై యోగాలను యాంత్రికముగా అనుసరించిన బ్రహ్మమును పొందలేమని బంధనాల నుండి విముక్తి లభించదని అద్వైత సిద్ధాంతము తెలుపుచున్నది. సాంఖ్యయోగములో పురుష, ప్రకృతిలోని భేదమును స్వయముగా గ్రహించినప్పుడే విషయముల నుండి విముక్తి లభిస్తుంది. ప్రకృతిలో ఉన్న పురుష మామూలుగా వ్యక్తము కాదు. కాని పనులన్ని ప్రకృతిలోనే జరుగుచున్నవి. పురుష లేకుండా ప్రకృతి లేదు. ప్రకృతి పురుష నుండి స్వేచ్ఛను పొందియున్నది. ఇంకను సాంఖ్య యోగము వివిధ ఆత్మలను గూర్చి నమ్ముచున్నది. సాంఖ్య యోగానికి వేదాంత సిద్ధాంతాలకు ఇదే ముఖ్య భేదము. విషయ వాంఛలకు సంబంధించిన యజ్ఞాయాగాదుల వలన స్వర్గ సుఖాలు పొందవచ్చు గాని బ్రహ్మాన్ని చేరలేము. బ్రహ్మాన్ని పొందాలంటే బ్రహ్మాన్ని దర్శించుటయే మార్గము.
57. గిటారు వాయిద్యాలు, శృతులు కొద్ది మందికి సంతోషాన్ని కలిగించగలవే గాని ఆధ్యాత్మిక ఔన్నత్యానికి తోడ్పడవు.
58. వాక్చాతుర్యముతో కూడిన ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక గ్రంధాలలోని విషయ పరిజ్ఞానము వ్యక్తీకరించుట అనునవి కేవలము వ్యక్తిగతమైన ఆనందానికి తోడ్పడునే గాని వాటి వలన ఏ విధమైన సాంసారిక బంధనాల నుండి విముక్తి లభించదు.
🌹🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 4 🌹
✍. Swami Madhavananda
📚. Prasad Bharadwaj
31. Among things conducive to Liberation, devotion (Bhakti) holds the supreme place.The seeking after one’s real nature is designated as devotion.
32. Others maintain that the inquiry into the truth of one’s own self is devotion. Theinquirer about the truth of the Atman who is possessed of the above-mentioned means of attainment should approach a wise preceptor, who confers emancipation from bondage.
33. Who is versed in the Vedas, sinless, unsmitten by desire and a knower of Brahmanpar excellence, who has withdrawn himself into Brahman; who is calm, like fire that has consumed its fuel, who is a boundless reservoir of mercy that knows no reason, and a friend of all good people who prostrate themselves before him.
34. Worshipping that Guru with devotion, and approaching him, when he is pleasedwith prostration, humility and service, (he) should ask him what he has got to know:
35. O Master, O friend of those that bow to thee, thou ocean of mercy, I bow to thee;save me, fallen as I am into this sea of birth and death, with a straightforward glance of thine eye, which sheds nectar-like grace supreme.
36. Save me from death, afflicted as I am by the unquenchable fire of this world-forest, and shaken violently by the winds of an untoward lot, terrified and (so) seeking refuge in thee, for I do not know of any other man with whom to seek shelter.
37. There are good souls, calm and magnanimous, who do good to others as does thespring, and who, having themselves crossed this dreadful ocean of birth and death, help others also to cross the same, without any motive whatsoever.
38. It is the very nature of the magnanimous to move of their own accord towardsremoving others’ troubles. Here, for instance, is the moon who, as everybody knows, voluntarily saves the earth parched by the flaming rays of the sun.
39. O Lord, with thy nectar-like speech, sweetened by the enjoyment of the elixir-likebliss of Brahman, pure, cooling to a degree, issuing in streams from thy lips as from a pitcher, and delightful to the ear – do thou sprinkle me who am tormented by worldly afflictions as by the tongues of a forest-fire. Blessed are those on whom even a passing glance of thy eye lights, accepting them as thine own.
40. How to cross this ocean of phenomenal existence, what is to be my fate, and whichof the means should I adopt – as to these I know nothing. Condescend to save me, O Lord, and describe at length how to put an end to the misery of this relative existence.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment