3-July-2020 Messages
1) శ్రీమద్భగవద్గీత - 416 / Bhagavad-Gita - 416
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 204 / Sripada Srivallabha Charithamrutham - 204 🌹
3) 🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 68 🌹
4) 🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 47 / Dasarathi Satakam - 47 🌹
5) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 107 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 24 🌹
7) 🌹. పంచకోశములు - ప్రాణమయకోశము 🌹
8) 🌹. సౌందర్య లహరి - 31 / Soundarya Lahari - 31 🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 330 / Bhagavad-Gita - 330 🌹
10)
11)
12)
13)
14)
15)
16)
17)
18)
19)
20)
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
.
🌹. శ్రీమద్భగవద్గీత - 416 / Bhagavad-Gita - 416 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 24 🌴
24. నభ:స్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ |
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా
ధృతిం న విన్దామి శమం చ విష్ణో ||
🌷. తాత్పర్యం :
ఓ సర్వవ్యాపక విష్ణూ! పలు ప్రకాశమాన వర్ణములతో ఆకాశమును తాకుచు, విప్పారిన వక్త్రములు, తేజోమయమైన నేత్రములు కలిగిన నిన్ను గాంచి నా మనస్సు భీతిచే కలతనొందినది. మనోస్థిరత్వమును గాని, సమత్వమును గాని నేను ఏ మాత్రము నిలుపుకొనలేకున్నాను.
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 416 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 24 🌴
24. nabhaḥ-spṛśaṁ dīptam aneka-varṇaṁ
vyāttānanaṁ dīpta-viśāla-netram
dṛṣṭvā hi tvāṁ pravyathitāntar-ātmā
dhṛtiṁ na vindāmi śamaṁ ca viṣṇo
🌷 Translation :
O all-pervading Viṣṇu, seeing You with Your many radiant colors touching the sky, Your gaping mouths, and Your great glowing eyes, my mind is perturbed by fear. I can no longer maintain my steadiness or equilibrium of mind.
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 204 / Sripada Srivallabha Charithamrutham - 204 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 34
🌻. మానవత్వమే అసలైన దైవత్వం (ధూమావతి) - 2 🌻
🌹. గర్వభంగం 🌻
శరభేశ్వరశాస్త్రి అహంకారం తగ్గి, బ్రాహ్మణుని అప్పు పూర్తిగా తీర్చి వారి యింట ఆతిథ్యం స్వీకరించమని మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. వారు మాతో, “అయ్యా! దశ మహావిద్యలలో ఒకటైన ధూమావతీ దేవిని నేను ఆరా ధించేవాడిని.
తంత్ర గ్రంథాల ప్రకారం ఆమె ఉగ్రతారాదేవే. ఆమె ప్రసన్నురాలయితే సర్వ సుఖాలు ప్రాప్తిస్తాయి, కోపిస్తే జీవనం దుఃఖప్రదమే.
నేను ఆ మహాతల్లి అనుగ్రహం పొందాను. చాతబడివల్ల, ప్రేతాత్మతో పీడింపబడటం వల్ల బాధ పడుతున్న వారి దుఃఖాలు ఆ తల్లి దయతో పోగొట్టే వాడిని. మొదట ధనాశ లేకుండా చేసినా మెల్లగా నేను ధనాకర్షణకి లోనయ్యాను.
ఇది ఆ మహాతల్లికి సమ్మతం కాదు. ఇంతలో ప్రాణమయ జగత్తులోని శక్తివంతమైన ప్రేతా త్మతో నాకు అనుబంధం ఏర్పడింది. ఇటువంటి వాటిని ఉపాసిస్తే చివరికి దుఃఖమే మిగులుతుంది అని తెలిసినా కూడా నేను ధన వ్యామోహంలో ఇరుక్కున్నాను.
అయితే ఆవిధంగా సంపాదించిన ధనాన్ని ప్రజల క్షేమం కోసం ఉపయోగిస్తే ప్రేతాత్మ మన అధీనంలో ఉంటుంది, లేదా ఇలా తప్పుడు జోస్యాలు చెప్పి అవమానాలపాలు చేస్తుంది,” అని మాకు వివరించి తనను శిష్యునిగా స్వీకరించమని నన్ను ప్రార్థించారు.
“ఈ ప్రపంచానికే శ్రీపాద శ్రీవల్లభులు తప్ప వేరే గురువు ఎవరూ లేరు. శ్రీపాదులు దశమహావిద్యల గురించి సంక్షిప్తంగా చెప్పి మిగిలిన విషయాలు ఎవరి ద్వారా ఎంతవరకు తెలియచేయాలో అంతవరకు బోధపడేలా చేస్తాను అని చెప్పారు మాకు దశ మహావిద్యలలో కాళి, మరియు ధూమావతి గురించి తెలిసింది.
శ్రీపాదులు ఇక్కడ మమ్మల్ని విచిత్ర పరిస్థితు లలో ఇరికించి తిరిగి వారే ఒడ్డున వేసారు. శ్రీపాదులవారు చిక్కులను కలిగించుటలో బహు నేర్పరి. వాటినుంచి భక్తులను బయట పడవేయుటలో బహు చమత్కారులు. శ్రీపాద నామస్మరణం ఇహపర సాధనం,”అని చెప్పాను.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sripada Srivallabha Charithamrutham - 204 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
CHAPTER 20
🌴. The Story of Vissavadhanulu Description of Sripada’s divine auspicious form - 11 🌴
🌻 All the sins of those worshipping Sripada will be destroyed 🌻
It is futile to go to an animal and teach Sanskrit Vyakarana. If an animal wants to learn Sanskrit, it should first come out of that low birth and get a human birth and learn it from suitable person. I am the one present inside every living being.
So I will take the samskaras and impurities of ‘jeevas’ and burn them daily with a bath and japa and help them in their transformation.
Really, I need not to do any worship. I will attract the sinful sanskaras of people worshipping me and do the ‘gross’ worship of Kalagni Shamana Datta who is present in our house as family deity.
I will pass on the great result that comes by worship to people who worship me. Without doing karma, the results cannot be given. That is why, I will perform great merited karmas with this body.
Because I am the endless chaitanya, immediate results come for my actions. I will transfer those results to those respective devotees according to their eligibility.
That is why mine is the form of Adi Guru. The disciple is the heir to the Tapo Shakti of his Guru, just as a child becomes the heir of his parents’ property. In Bhagavidgitha also it was mentioned that “doing karma is inevitable”.
🌻 There is no end to my avathar - 1 🌻
Being Datta, I am easily accessible. The other Gods give boons, when they become happy with the ‘tapas’ of devotees. But Datta the form of ‘Guru’ is a compassionate form.
He will destroy the cruel powers and bad luck powers which cause obstructions to His devotees getting boons. Thatha! That is why I am called ‘Smarthrugami’ (The one who comes by merely remembering). I am the one present in all Gurus.
There will be no end for this avathar because I am this form of Parama Guru, having great compassion. When I get the call from my devotee, I will respond immediately. I will be waiting for the call of My devotee.
If my devotee takes one step towards Me, I will take hundred steps towards him. It is my natural quality to save my devotees like an eyelid to the eye from all difficulties and pains.” Thus Sripada taught Bapanarya. I asked that Maha Guru ‘Maha Prabhu! I heard a little about ‘soma latha’ and ‘soma yagam’.
Please let me know in detail. Sripada said that ‘somalatha’ was also called sanjeevini moolika (plant) and asked me. ‘Do you like to see it?’ I said “yes”.
Immediately sanjeevini moolika appeared in His hand. He gave it to me as a gift. That is present in my puja room safely even today as His divine ‘prasad’.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 68 🌹
🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ
సంక్షోభిణీ ప్రధానా
శ్శక్తీ స్తస్యోర్ధ్వవలయకృత వాసాః I
ఆలోలనీల వేణీ
రన్తః కలయామి యౌవనోన్మత్తాః II 135 II
సౌభగ్యదయాకేఽస్మిం
శ్చక్రే శ్రీ త్రిపుర వాసినీ జీయాత్ I
శక్తయ స్సమ్ప్రదాయా
దిమా స్సమస్తాః ప్రమోదయ న్త్యనిశమ్ II 136 II
మణిపీఠోపరి తాసాం
మహతి చతుర్నల్వ విస్తృతే వలయే I
సన్తత విరచిత వాసాః
శక్తీః కలయామి సర్వసిద్ధి ముఖాః II 137 II
సర్వార్థ సాధకాఖ్యే
ఛక్రేఽముష్మిన్ సమస్త ఫలదాత్రీ I
త్రిపురాశ్రీ ర్మమ కుశలం
దిశతా దుత్తీర్ణ యోగినీ సేవ్యా II 138 II
తస్య వలయస్యచోపరి
ధిష్ణ్యే కౌసుమ్భ కఞ్చుక మనోజ్ఞాః I
సర్వజ్ఞాద్యా దేవ్య
స్సకలా స్సమ్పాదయన్తు మమ కీర్తిమ్ II 139 II
చక్రేసమస్త రక్షాకర
నామ్న్యస్మిన్ సమస్త జనసేవ్యామ్ I
మనసి నిగర్భా సహితాం
మన్యే తాం త్రిపురమాలినీం దేవీమ్ II 140 II
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 47 / Dasarathi Satakam - 47 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 93వ పద్యము :
సిరిగలనాఁడు మైమఱచి చిక్కిననాఁడుదలంచి పుణ్యముల్
పొరిఁబొరి సేయనైతినని పొక్కినఁ గల్గు నెగాలిచిచ్చుపైఁ
గెరలిన వేళఁదప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త
త్తరమునఁ ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఐశ్వరములలో తులతూగునాడు నేనే గొప్ప వాడినని విఱ్ఱవీగి నిన్నే మరిచితిని. దరిద్రదేవతలకు బానిసనైతిని ఇప్పుడు బాధపడి ఏమి ప్రయోజనము? నీటి కోసము బావిని ముందు తవ్వవలనే కాని అగ్నిజ్వాలలు లేచినప్పుడో దాహముతోనున్నప్పుడో కాదు కదా! అట్టి నన్ను కాపాడవయా దేవదేవా! ఆశ్రితవత్సలా!
🌻. 94వ పద్యము :
జీవనమింకఁ బంకమున జిక్కిన మీను చలింపకెంతయు
దావుననిల్చి జీవనమె దద్దయుఁ గోరువిధంబు చొప్పడం
దావలమైనఁగాని గుఱి తప్పనివాఁడు తరించువాఁడయా
తావకభక్తియో గమున దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
చెరువు ఎండిపోయి బురద పడినాకూడా అందులోనే నీటిని కోరుకొను చేప మాదిరిగా ఎన్ని కష్టనష్టములు వచ్చిననూ, నిన్ను విడువలేక కొలుచు వానిని నీవును వదిలి పెట్టవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 47 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 93th Poem :
sirigalanADu maimarxaci cikkinanADudalaMci puNyamul
poribori sEyanaitinani pokkina galgu negAliciccupai
geralina vELadappikoni kIDpaDu vELa jalaMbu gOri ta
ttaramuna dravvinaM galade dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
When riches abound you forget about performing good things (punyamulu) and in penury you regret about it. It is like trying to dig a well when you are engulfed by fire and feeling thirsty.
🌻 94th Poem :
jIvanamiMka baMkamuna jikkina mInu caliMpakeMtayun
dAvunanilci jIvaname daddayu gOruvidhaMbu coppaDaM
dAvalamainagAni gurxi tappanivADu tariMcuvADayA
tAvakaBaktiyOgamuna dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
Just as a fish living in water awaits the return of water even after the water dries up and it is stuck up in mud, your devotees will not give up the worship of Your Lotus Feet even if they are swamped by sufferings with the hope of eventually attaining Salvation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹 The Masters of Wisdom - The Journey Inside - 107 🌹
🌴 The Aquarian AGE - 3 🌴
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj
🌻 Descent of the Aquarian Energy - 2 🌻
The people of the surrounding area ran to him, thinking that the building had been destroyed and its inhabitants killed.
But they found the Master in deep contemplation and he radiated bright light. Then they retreated. In the morning they visited him and asked him for an explanation.
The Master said, “The energies of the New Age have come. I have invoked them into me and in due time I will distribute them to mankind.”
For 60 days he kept the energies with him. With the help of his wife, he conducted many experiments to find out the main properties and goals of the Aquarian energy.
He discovered that it can transform matter very quickly and stimulate the Kundalini, and he called this energy “the Master”. Whenever we speak of “the Master” we speak of this Aquarian energy.
He also recognized that the intention of the energy is to transform the body of the people and to anchor them in the etheric body.
The energy accelerates the changes in such a way that the matter of the human body becomes lighter and lighter.
People will be able to fly with the help of the etheric body and they will experience deathlessness and continuity of consciousness beyond incarnations.
The energy accelerates evolution on all levels, in the mineral, plant, animal and human kingdoms. He could experience all this during the period of experimentation.
On May 29, 1910 Master CVV began to distribute the energy. He gathered six people and initiated them into the energy. Master CVV said that every May 29th, the MASTER may call those who want to enter into the energies of synthesis.
Since then, every May 29th is celebrated as the day for group initiation and it is commonly called “May Call Day”.
🌻 🌻 🌻 🌻 🌻 🌻 🌻
Sources used: Master K.P. Kumar: The Aquarian Master. Div. seminar notes/ Master E. Krishnamacharya: Spiritual Astrology.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. నారద భక్తి సూత్రాలు - 24 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, అచల గురు పీఠము.
📚. ప్రసాద్ భరద్వాజ
ప్రథమాధ్యాయం - సూత్రము - 15
🌻. 15. తల్లక్షణాని వాచ్యంతే నానా మత భేదాత్ - 1 🌻
పరాభక్తుని లక్షణాలు ఇతరులకు అర్థం కావు. వారు అతడి బాహ్య క్రియలను బట్టి నిర్ణయిస్తే, అది అతడి ఆంతరంగిక స్థితితో సరిపోదు.
చూచేవారి ఊహలనుబట్టి కూడా భిన్న భిన్నాలుగా ఉంటుంది. అయినా అతడి నిజ స్థితి ఏ ఒక్కరి ఊహకు సరిపోదు. భక్తుని లక్షణం ఆ భక్తునికి మాత్రమే అనుభవగోచరం. అయినప్పటికీ పరాభక్తుని లక్షణాలు మరొక పరాభక్తునికి తెలుస్తాయి.
అదే మాదిరి నారద మహర్షి వంటి వారికి తెలుస్తుంది. కనుకనే మనకు యీ నారద భక్తి సూత్రాలు లభించాయి. పరాభక్తులు ఈ క్రింది విధంగా చెప్తున్నారు.
1. ఈ పరాభక్తి అనాది కర్మలను నశింపచేస్తుంది. అనాది కర్మలంటే మొదటి జన్మకు కారణమైన ఈశ్వర దత్త కర్మలు. తరువాతి కర్మలు జీవుడు ప్రతి జన్మలోనూ కొద్దికొద్దిగా సంపాదించినవి. తాను చేసిన కర్మవలన జన్మ, ప్రతి జన్మలోనూ మరల కర్మ చేయుట. ఆ విధంగా జన్మ కర్మ చక్రమందు తిరుగు చున్నాడు.
ఇట్టి జనన మరణ చక్రం ఈశ్వరుని నియమం. దీనిని భవం అంటారు. జీవుడు నిష్కామ కర్మ యోగం, భక్తి యోగం మొదలైన సాధనలచేత వాసనాక్షయానికి ప్రయత్నిస్తే, అనాది సంస్కార బీజం మాత్రం మిగిలి ఉండి, అది ఈశ్వరానుగ్రహం వలన నశించిన పిదప పరాభక్తి సిద్ధిస్తుంది.
2. అంతర్యామియైన భగవంతుని కల్యాణ గుణాలను వినినంతనే తన భావాన్ని తైలధారలాగా ప్రవహింపచేస్తాడు. ఇది ఆ పరాభక్తుని ప్రయత్నమేమీ లేకనే సహజంగా జరుగుతుంది.
అంతర్యామితో అను సంధానమైన పరాభక్తుడు భావావేశం పొంది తను ఏయే వర్ణనలను విని ఆ భగవంతుని నిర్ణయించాడో అదే వర్ణనలతో భగవంతుని కీర్తిస్తాడు. గానం చేస్తూ కవిత్వం పొంగిస్తాడు. అంతకుముందు అతడు కవి కాక పోయినా సంగీత విద్వాంసుడు కాకపోయినా, ఆ విధంగా చేస్తాడు. అలవాటు లేకపోయినా ఏవేవో చేస్తూ ఉంటాడు.
3. మూఢులకు ప్రాపంచిక భోగాల పట్ల ఎంతటి ప్రీతి ఉంటుందో అంతకంటే తీవ్రంగా ఈ పరాభక్తుడు భగవంతుని పట్ల ప్రీతిని కలిగి ఉంటాడు. అసలు ప్రాపంచికమైనవి అతనికి తోచవు.
అవి ఎదురైనా ఉదాసీనత వహించి ఉంటాడు. వేటితోనూ బంధింపబడి ఉండడు. భగవంతుని విషయంలో మాత్రం విడచి ఉండలేని విరహంతో ఉంటాడు.
భగవంతుని ఒక్క క్షణం కూడా మరచి ఉండడు. భగవంతునితో అను సంధానమై, తెంపులేని ప్రేమలో మునిగి ఉంటాడు. భగవంతుని కోసం ప్రాణాలైనా అర్పిస్తాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. పంచకోశములు - ప్రాణమయకోశము 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
చలాచల బోధ...
📚. ప్రసాద్ భరద్వాజ
పంచ ప్రాణములు - కర్మేంద్రియములు ఐదింటిని కలిపి ప్రాణమయకోశము అంటారు.
ఆకలి దప్పికలు ప్రాణమయకోశ ధర్మములు.
ఈ ప్రాణమయకోశము శరీరము, మనస్సులకు మధ్య వాహకముగా పనిచేస్తుంది.
ప్రాణము లేని శరీరమును దహనము చేస్తున్నారు. ప్రాణము ఉన్నంత వరకే ఈ శరీరమునకు విలువ. కనుక ప్రాణమయకోశమే ఆత్మ అని పొరపడుటకు అవకాశమున్నది.
ప్రాణశక్తి లోకిని , బయటకు సంచరిస్తూ నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది. కనుక ప్రాణమయకోశము ఆత్మ కాదు.
కాని నేను వ్యవహరించే సమయమున
నేను ఆకలిగొన్నాను
నేను దప్పికగొన్నాను
నేను ఆరోగ్యముగా లేక అనారోగ్యముతో ఉన్నాను( ప్రాణము బాగుండ లేదు)
అని ప్రాణమునకు సంబందించిన ధర్మములను నేను(ఆత్మ)కు ఆపాదిస్తున్నాము.
ఇవన్నియూ ప్రాణము ధర్మములు అని భావించి వాటితో తధాత్మ్యత చెందక నేను ఆత్మ స్వరూపుడను, సాక్షిని అను భావంతో మెలగ వలెను.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. సౌందర్య లహరి - 31 / Soundarya Lahari - 31 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
31 వ శ్లోకము
🌴. సర్వ ఆకర్షణ 🌴
శ్లో: 31. చతుష్టష్ట్యా తంత్రైః సకల మతిసంధాయ భువనం
స్థిత స్తత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః l
పునస్త్వ న్నిర్బంధా దఖిల పురుషార్ధై క ఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితి తలమవాతీతర దిదమ్
🌻. తాత్పర్యము :
అమ్మా ! పశువులగు ప్రాణులను రక్షించు శివుడు అరువది నాలుగు తంత్ర విద్యలను సాధకులకు వారి వారి కోరిక ప్రకారము ఇచ్చి మిన్నకుండిన నీవు ఆ చతుష్షష్ఠి తంత్రముల వలన సాధకులకు మోక్షము రాదని తెలిపి నీ భర్తను ఉత్తమ తంత్రము తెలుపుమని నిర్భంధించగా శివుడు స్వతంత్రమయిన నీ యొక్క తంత్రమును సాధకులకు తెలిపెను కదా !
🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె, పాలు, ఫలాలను నివేదించినచో సర్వ ఆకర్షణ శక్తిని, and అధికారుల మీద వశ్యత పొందును అని చెప్పబడింది.
🌹 Soundarya Lahari - 31 🌹
📚 Prasad Bharadwaj
🌴 Attraction of Everything 🌴
31. Cautuh-shashtya tantraih sakalam atisamdhaya bhuvanam Sthitas tat-tat-siddhi-prasava-para-tantraih pasupatih; Punas tvan-nirbandhad akhila-purusarth'aika ghatana- Svatantram te tantram khsiti-talam avatitaradidam.
🌻. Translation :
The lord of all souls, Pasupathi, did create the sixty four thanthras, each leading to only one desired power, and started his relaxation. But you goaded him mother, to create in this mortal world. Your tantra called Sri Vidya which grants the devotee, all powers that give powers, over all the states in life.
🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times each day for 45 days, offering, honey, milk and fruits as prasadam, it is said that one would be able get the attraction of everything and control over higher officials.
🌻 BENEFICIAL RESULTS:
Royal and governmental favours, winning popularity, fulfillment of desires.(Yantra to be held on a piece of red silk spread on right palm).
🌻 Literal Results:
Freedom and independence from usual surroundings and people, through new approach towards life.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 330 / Bhagavad-Gita - 330 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 11 🌴
11. అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ |
పరం భావమజానన్తో మమ భూతమహేశ్వరమ్ |
🌷. తాత్పర్యం :
నేను మానవరూపమున అవతరించినపుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. సమస్తమునకు పరమప్రభువైన నా దివ్యత్వమును వారెరుగరు.
🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు మనవరూపమున అవతరించినప్పటికిని సామాన్య మానవుడు కాడని ఈ అధ్యాయమునందలి కడచిన శ్లోకముల భాష్యము వలన స్పష్టముగా విదితమైనది. వాస్తవమునకు సమస్త విశ్వము సృష్టి, స్థితి, లయములను గావించు శ్రీకృష్ణభగవానుడు సాధారణమానవుడు కానేకాడు. అయినప్పటికిని పెక్కురు మూఢులు శ్రీకృష్ణుడు కేవలము శక్తిమంతుడైన మానవుడే గాని అంతకు మించి ఏదియును కాడని భావింతురు. కాని బ్రహ్మసంహిత యందు నిర్ధారింపబడినట్లు అతడే ఆదిదేవుడు మరియు దేవదేవుడు (ఈశ్వర: పరమ: కృష్ణ: ) .
వాస్తవమునకు నియమించెడి ఈశ్వరులు పెక్కురు గలరు. వారిలో ఒకరికన్నను వేరొకరు అధికులుగా గోచరింతురు. భౌతికజగమునందలి లౌకికకార్యములందు కూడా ఒక అధికారి, అతనిపై ఒక కార్యదర్శి, అతనిపై ఒక మంత్రి, ఆ మంత్రిపై అధ్యక్షుడు ఉన్నట్లుగా మనము గాంతుము. వీరందరు తమ పరధిలో ఈశ్వరులేయైనను వేరొకనిచే నియమింపబడెడివారు. కాని శ్రీకృష్ణభగవానుడు మాత్రము దివ్య నియామకుడని బ్రహ్మసంహిత యందు తెలుపబడినది. భౌతిక, ఆధ్యాత్మికజగత్తులలో పలు ఈశ్వరులున్నను శ్రీకృష్ణుడు మాత్రము పరమేశ్వరుడు (ఈశ్వర: పరమ: కృష్ణ: ) మరియు అతని దేహము సచ్చిదానందమయమైనది (భౌతికము కానిది).
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 330 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 11 🌴
11 . avajānanti māṁ mūḍhā
mānuṣīṁ tanum āśritam
paraṁ bhāvam ajānanto
mama bhūta-maheśvaram
🌷 Translation :
Fools deride Me when I descend in the human form. They do not know My transcendental nature as the Supreme Lord of all that be.
🌹 Purport :
From the other explanations of the previous verses in this chapter, it is clear that the Supreme Personality of Godhead, although appearing like a human being, is not a common man. The Personality of Godhead, who conducts the creation, maintenance and annihilation of the complete cosmic manifestation, cannot be a human being. Yet there are many foolish men who consider Kṛṣṇa to be merely a powerful man and nothing more. Actually, He is the original Supreme Personality, as is confirmed in the Brahma-saṁhitā (īśvaraḥ paramaḥ kṛṣṇaḥ); He is the Supreme Lord.
There are many īśvaras, controllers, and one appears greater than another. In the ordinary management of affairs in the material world, we find some official or director, and above him there is a secretary, and above him a minister, and above him a president. Each of them is a controller, but one is controlled by another. In the Brahma-saṁhitā it is said that Kṛṣṇa is the supreme controller; there are many controllers undoubtedly, both in the material and spiritual world, but Kṛṣṇa is the supreme controller (īśvaraḥ paramaḥ kṛṣṇaḥ), and His body is sac-cid-ānanda, nonmaterial.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment