మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 110


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 110 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని తత్త్వము అంతు పట్టనది 🌻

భగవంతుడు జీవుడుగా దేహములలోనికి దిగి వచ్చునపుడు , దేహములందలి యింద్రియములను సృష్టించి కాపాడు దేవతలకు గూడ వాని తత్త్వము అంతుపట్టదు. కనుకనే వేదములలో " కంటి నుండి ఎవడు చూచునో, కన్ను ఎవరిని చూడలేదో, చెవి నుండి ఎవడు వినునో, చెవి ఎవరిని వినలేదో, మనస్సు నుండి ఎవడూహించునో, మనస్సు ఎవనిని గూర్చి ఊహింపలేదో.....". అతడే భగవంతుడని వర్ణింపబడినది. ఆతడు ఇంద్రియముల నడుమ జీవుడై దిగివచ్చి క్రీడించుచు , ఇంద్రియములచే కూడ తెలియబడడు‌.

వేడుకతో గోపాలవరులతో గూడి గోవులను, దూడలను గాచెను. అపుడు గూడ నందలి గోపాల శ్రేష్ఠులకైనను తన సమగ్రమైన నిజస్వరూపమును చూపలేదు. (గోపాలవరులు అను మాటకు ఇంద్రియములను రక్షించు దేవతలని కూడ నర్థము.)

భగవంతునికి పూజాదికముల రూపమున తమకున్నది సమర్పించుట మాని తమ్ము తాము సమర్పణ చేసుకొనువారికి సంసార తాపములను అతడే నివారించును. అట్టివారి కథలను ఆతని కథలుగా అనుభవించు వారు నిజమైన మోక్షమును పొందుచున్నారు.

...... ✍🏼 మాస్టర్ ఇ.కె.

🌹 🌹 🌹 🌹 🌹


27 Nov 2021

No comments:

Post a Comment