✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 16 🌻
271. బాహ్యమును సృష్టిలో ఏదైనను జరిగినట్లు, జరుగుచున్నట్లు జరగబోవునట్లు కనిపించినచో, అదియంతయు, భగవంతుడు"నేను ఎవరిని?" అన్నట్టి తన స్వీయమైన అనంత భగవద్విలాసము తరంగ చలితమైన క్షణికములో భగవంతుడు కనిన దివ్యస్వప్నము తప్ప మరేమియు కాదు.
272. భగవంతుడు, తన దివ్యమూలమైన అనంత దివ్యస్వప్నంలో శాశ్వతముగా ఏక కాలమందే సృష్టి--స్థితి--లయకారుల పాత్రలను నిర్వహించుకున్నారు.
273. భగవంతుడు మానవ స్థితిలో మానవునిగా, మానవునిలో నిద్రాణమైయున్న సంస్కారములు ద్వారా తన స్వీయ సృష్టికి, తానుకర్తయైన బ్రహ్మగను,
బయటికి చిమ్మిన సంస్కారముల ద్వారా మానవుని దైనందిన జీవితంలో, తన స్వీయ సృష్టిని పోషించుటలో స్థితికారుడైన విష్ణువుగను,
వ్యతిరేక సంస్కారముల ద్వారా పోషించుచున్న స్వీయ సృష్టిని నాశనమొనర్చుటలో లయకారుడైన మహేశ్వరునిగను-- ఇట్లు సృష్టి- స్థితి-లయకారుడైన జగత్కర్త (ఈశ్వరుడు)గా,తన విజయమును ధృవపరచు చున్నాడు.
274. (1) నిద్రాణ సంస్కారముల-- ద్వారా-- సృష్టిని,
(2) జాగృతిలో నిత్యజీవితము-- ద్వారా--స్థితిని
(3) సుషుప్తి లో వ్యతిరేక సంస్కారముల -- ద్వారా -- లయమును అనుభవించుట ద్వారా జగత్కర్తయౌచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
06 Oct 2020
No comments:
Post a Comment