🌹. శ్రీచక్ర విజ్ఞానం - 5 🌹
(5 వ భాగం)
🌹4 -నాలుగవ ఆవరణ - మన్వస్రం 🌹
శ్రీ చక్రం లోని నాలుగవ ఆవరణ ఇక్కడ క్రింది పటం లో చూపిన విధంగా 14 కోణాలు కలిగిన ఆకారంతో ఉంటుంది. ఇక్కడ 'సంప్రదాయ యోగినిలు' 14 మంది పటం లో సూచించిన సంఖ్యల క్రమం లో ఉంటారు.
వీరు కాలానల శరీర కాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో వహ్ని చాపం, వహ్ని బాణం, వహ్ని రూప ఖడ్గం, వహ్ని రూప చక్రం ధరించి ఉంటారు. వీరి పేర్లు;
1. సర్వ సంక్షోభిణీ
2. సర్వ విద్రావణీ
3. సర్వ ఆకర్షిణీ
4. సర్వ ఆహ్లాదినీ
5. సర్వ సమ్మోహినీ
6. సర్వ స్తంభినీ
7. సర్వ జ్రుమ్భిణీ
8. సర్వ వశంకరీ
9. సర్వ రంజనీ
10.సర్వోన్మాదినీ
11.సర్వార్ధ సాధినీ
12. సర్వ సంపత్తి పూరిణీ
13. సర్వ మంత్రమయీ
14. సర్వ ద్వంద్వక్షయంకరీ
ఈ ఆవరణలో సాధకుడు ఈ యోగినీ శక్తులను ప్రాప్తించుకుని తన సాధనలో ముందుకు సాగుతాడు. (సశేషం)..
🌹శ్రీ మాత్రే నమః🌹
No comments:
Post a Comment