శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 394 / Sri Lalitha Chaitanya Vijnanam - 394


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 394 / Sri Lalitha Chaitanya Vijnanam - 394🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।
మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀

🌻 394. 'ప్రభారూపా'🌻

కాంతిరూపము కలిగినది శ్రీమాత అని అర్థము. శ్రీమాత గుణమే కాదు; రూపము కూడ కాంతివంతమే. కాంతివంత మగు గుణ మున్ననూ, కాంతివంత మగు రూపము ఉండనక్కర లేదు. కాని శ్రీమాత విషయమున రూపము కూడ కాంతి వంతమే. కాంతి రూపముల యందలి కాంతి శ్రీమాతయే అని తెలియ వలెను. కన్నులలోని కాంతి ఆమెయే. శరీరమందలి మెఱపు ఆమెయే. కాంతికి ఆకర్షణ సహజ గుణము.

ఆకర్షణము ఎచ్చట నున్నదో అచ్చట శ్రీమాత యున్నదని తెలియవలెను. కాంతి రూపముతోనే అందరిని ఆకర్షించును. దుష్టులను మాయ చేయును. శిష్టులను అనుగ్రహించును. నిజముగ కాంతి మాయా రూపమే. సత్యమును మరుగు పరచగల కాంతి ఆమె. ఆమె కాంతి ఆవరణము నందే శివుడు సత్యమై యున్నాడు. సత్యమునకు ఆమె ప్రథమావరణ మగుటచే సత్యమును కూడ మరుగు పరచగల కాంతి రూపము శ్రీమాతది. ఆమె కాంతి ఆధారముగనే ఇచ్ఛా, జ్ఞాన, క్రియలు జీవుల కేర్పడి సృష్టి కార్యము నడచుచున్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 394 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari
Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻

🌻 394. Prabhārūpā प्रभारूपा 🌻

The luminous light emanating from Her and was referred to in the last nāma, is said to be powerful in this nāma. These devi-s derived their illumination from this brightness. She is said to be in the form of Supreme light.

Chāndogya Upaniṣad (III.14.2) describes this light “He is controlled by the mind. He has a subtle body and He is luminous (bhārūpaḥ).”


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

07 Aug 2022

No comments:

Post a Comment