నిర్మల ధ్యానాలు - ఓషో - 141


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 141 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మీరు నిజమైన ప్రార్థనని నేర్చుకోవాలి. అది నిశ్శబ్దాన్ని నింపుకున్నది. దాంట్లో గాఢమయిన వినడమన్నది వుంది. దేవుడు నీకు ఏదో చెప్పాలనుకుంటాడు. నీ కోసం వెతుకుతాడు. కానీ నువ్వు కనిపించవు. కారణం బాగా బిజీగా వుంటావు. నిశ్శబ్దంగా వుండు. 🍀


ప్రార్థన అంటే దేవుడితో ఏదో చెప్పడం కాదు. ఏదో అడగటం కాదు. ప్రార్థన అంటే దేవుణ్ణి 'వినడం' నువ్వు చెప్పేది ఏదయినా వుంటే అది కేవలం కృతజ్ఞతే కేవలం ఒక ఆమోదం చాలు. సంస్థాగతమయిన మతాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అనవసరమైన ప్రార్థనల్ని బోధిస్తాయి. ప్రజలు ఆ ప్రార్థనల్ని పునశ్చరణ చేస్తూ వుంటారు. చిలక పలుకులు పలుకుతారు. వాళ్ళకు అర్థం తెలీదు. కేవలం ఆచార కర్మ కాండల్ని జరుపుతారు.

మీరు నిజమైన ప్రార్థనని నేర్చుకోవాలి. అది నిశ్శబ్దాన్ని నింపుకున్నది. దాంట్లో గాఢమయిన వినడమన్నది వుంది. దేవుడు నీకు ఏదో చెప్పాలనుకుంటాడు. నీ కోసం వెతుకుతాడు. కానీ నువ్వు కనిపించవు. కారణం బాగా బిజీగా వుంటావు. నిశ్శబ్దంగా వుండు. మరింత మరింతగా విశ్రాంతిగా వుండు. అప్పుడు, నువ్వు నిశ్చలమైన చిన్ని శబ్దాన్ని నీలోలోపల వింటావు. దేవుడు బయటి నించి మాట్లాడడు. నీ లోలోతుల నించీ మాట్లాడతాడు. అతను అప్పటికే అక్కడున్నాడు. నీ అంతరాంతరాలతో నువ్వు సంబంధమేర్పరచు కోవడమే నిజమైన ప్రార్ధన. నువ్వు సంబంధ మేర్పరచుకున్న క్షణం.. ఆ క్షణం ఆనందదాయకం, ఎంత పరవశమయ క్షణమంటే నువ్వు అప్పుడు కృతజ్ఞతతో తలవంచుతావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


24 Feb 2022

No comments:

Post a Comment