మైత్రేయ మహర్షి బోధనలు - 78
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 78 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 64. అసత్య భాషణము 🌻
అసత్య భాషణము, భాషించు వానిని క్రమముగ క్రుంగతీయును. జీవితము బరువెక్కుచుండును. పలికిన ప్రతి అసత్యము ఏనుగంత బరువై బ్రతుకు భారముగ చేయును. అట్టి భాషణము
వలన వ్యక్తిగత కర్మము విపరీతముగ పెరుగును. దాని ఫలితము జీవుని స్వభావమున పాదుకొని జన్మ జన్మలు వెంబడించును. దానికి సంబంధించిన కర్మ భవిష్యత్తున ఆపదయై తారసిల్లును.
అసత్య భాషణము యొక్క ఫలములను తెలిసినవాడు అసత్య మాడుటకు భయపడును. తెలియనివాడు అసత్యమాడుచు జీవితమును క్లిష్టపరచుకొనును. తెలిసియు ఆచరింపని వాడు మూర్ఖుడు. అన్ని దోషముల యందు అసత్యదోషము జీవుల నెక్కువగా బాధించునని తెలియవలెను.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
24 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment